ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా మొదయ్యింది. లక్షలాది మంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేస్తున్నారు. ఉదయం 7.30 గంటల సమయానికల్లా 35 లక్షల మంది సంగమ తీరంలో స్నానాలు చేశారు. మహా కుంభమేళాలో రాజ స్నానం నిర్వహించే రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రయాగ్‌రాజ్‌లో గంగ, యమున, అదృశ్య సరస్వతి మూడు నదుల సంగమం ఉంది. సంగమ పవిత్ర ఘాట్లకు ఉన్న మతపరమైన, చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను చారిత్రక గ్రంథాలలో వర్ణించారు. కుంభమేళాకు వెళ్లేవారు ఈ ఘాట్ల గురించి తెలుసుకోవడం ఉత్తమం.
సంగమ ఘాట్
ప్రయాగ్‌రాజ్‌లోని సంగమ ఘాట్ ఇక్కడి ప్రధాన ఘాట్‌లలో ఒకటి. మహా కుంభమేళా సమయంలో ఈ ఘాట్ కీలకంగా మారుతుంది. ఈ ఘాట్ వద్ద మూడు నదుల సంగమం జరుగుతుంది. మహా కుంభ్ సమయంలో ఈ ఘాట్‌లో స్నానం చేసిన వారికి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతుంటారు.
కేదార్ ఘాట్
కేదార్ ఘాట్ శివుని ఆరాధనకు ప్రత్యేకించిన ప్రదేశం. ఇక్కడకు వచ్చే భక్తులు పవిత్ర స్నానం చేసిన తరువాత మహాశివుడిని పూజిస్తారు.
హండీ ఫోడ్ ఘాట్
హండీ ఫోడ్ ఘాట్ ప్రయాగ్‌రాజ్‌లోని పురాతన ఘాట్‌లలో ఒకటి. ఈ ఘాట్ సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ పరంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఘాట్‌కు వచ్చే భక్తులు ప్రశాంతమైన అలలతో కూడిన అందమైన నదీ దృశ్యాన్ని చూడవచ్చు.
దశాశ్వమేధ ఘాట్
దశాశ్వమేధ ఘాట్ ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర ఘాట్‌లలో ఒకటి. ఈ ఘాట్ గురించిన ప్రస్తావన పౌరాణిక గాథలలో కూడా కనిపిస్తుంది. పురాణాలపరంగా ఈ ఘాట్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఘాట్ వద్ద బ్రహ్మ దేవుడు స్వయంగా 10 అశ్వమేధ యాగాలు చేశాడని చెబుతారు. మహా కుంభమేళా సమయంలో ఈ ఘాట్ దగ్గర గంగా హారతితో పాటు పూజలు నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: Maha Kumbh-2025: అండర్ వాటర్ డ్రోన్లు.. ఏఐ కెమెరాలు.. ఫ్లోటింగ్ పోలీస్ పోస్టులతో నిఘా
Comments
Please login to add a commentAdd a comment