పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.
ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.
ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు
Comments
Please login to add a commentAdd a comment