Chhath Puja
-
నెక్లెస్ రోడ్డు : బతుకమ్మ ఘాట్‌లో భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు (ఫొటోలు)
-
ఆసియాలో అతిపెద్ద ఛత్ ఘాట్ ఇదే..
పూర్వాంచల్: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్లతో పాటు దేశంలోని పలు ప్రాంతాలలో ఛత్ పండుగ జరుగుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లోగల పూర్వాంచల్‌లో ఉన్న ఛత్ ఘాట్‌కు ఎంతో ప్రత్యేకత ఉంది. అర్పా నది ఒడ్డున నిర్మించిన ఈ ఛత్ ఘాట్ ఆసియాలోనే అతిపెద్ద ఛత్ ఘాట్‌గా పేరొందింది. ఈ ఘాట్ మొత్తం పొడవు సుమారు ఒక కిలోమీటర్లు ఉంటుంది. ఛత్ పూజలు నిర్వహించేందుకు ఈ ఘాట్‌ను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు.ఈ ఏడాది 50 వేల మందికి పైగా ఛత్వర్తీలు ఈ ఛత్ ఘాట్‌లో జరిగే పూజల్లో పాల్గొనే అవకాశం ఉంది. వీరితో పాటు లక్షల సంఖ్యలో వారి కుటుంబ సభ్యులు ఇక్కడికి తరలిరానున్నారు. ఛత్ పండుగ సందర్భంగా అర్పా నది ఒడ్డును అందంగా అలంకరించారు. భద్రత దృష్ట్యా పోలీసులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఈ ఘాట్‌ను జిల్లా యంత్రాంగం, భోజ్‌పురి సొసైటీ కొన్నేళ్ల క్రితమే నిర్మించింది. ప్రతి ఏటా ఛత్ పూజ సందర్భంగా ఇక్కడకు వేలాది మంది భక్తులు తరలివచ్చి, సూర్య భగవానుని ఆరాధిస్తారు. గత 24 సంవత్సరాలుగా భోజ్‌పురి కమ్యూనిటీ ప్రజలు ఈ ఘాట్‌ను ప్రార్థనా స్థలంగా ఉపయోగిస్తున్నారు. ఛత్ పూజలు జరిగే సమయంలో భక్తులు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో ఇక్కడ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పిస్తారు. భక్తులు నదిలో నిలబడి పూజలు చేస్తారు. ఇక్కడ జరిగే ఛత్ పండుగలో సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: పండగల్లో రూ. లక్ష కోట్ల వస్తువులు కొనేశారు -
ఛత్ వేడుకల్లో విషాదం.. వివిధ ప్రాంతాల్లో 22 మంది మృతి
బీహార్‌లోని పలు ఛత్ ఘాట్ల వద్ద నీట మునిగి 22 మంది మృతిచెందారు. ఆది, సోమవారాల్లో ఈ విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఆరుగురు యువకులు, ఏడుగురు యువతులు, ఒక బాలిక సహా ఐదుగురు మహిళలు ఉన్నారు. షాపూర్ సమీపంలోని బ్రహ్మాపూర్ చెరువులో అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఇద్దరు కవల సోదరులతో సహా ముగ్గురు యువకులు నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై ఆగ్రహించిన జనం జగన్పుర సమీపంలోని కొత్త బైపాస్ రోడ్డును దిగ్బంధించి, ట్రాఫిక్ చెక్‌పోస్టును ధ్వంసం చేసి దానిని తగులబెట్టారు. సరన్ జిల్లాలోని దిఘ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌దాస్చక్ గ్రామంలో గంగా నదిలో స్నానం చేస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు, ఒక బాలుడు నీటిలో మునిగి మరణించారు. దర్భంగా జిల్లాలోని నెహ్రా అసిస్టెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జగదీష్పూర్ గ్రామంలో కొందరు యువకులు ఛత్ పూజ అనంతరం జూదం ఆడుతున్నారు. ఇంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. దీంతో వారంతా అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో నీటితో నిండిన గోతిలో రోషన్ అనే యువకుడు పడిపోయి మృతి చెందాడు. ఇది కూడా చదవండి: సొరంగ బాధితులకు తొలిసారిగా వేడి కిచిడీ పంపిణీ! -
మోకాలు లోతు నురగ నీటిలో ఛఠ్ పూజలు
ఢిల్లీ: యమునా నదిలో కలుషిత నీటిలోనే భక్తులు నేడు ఛఠ్ పూజలు నిర్వహించారు. కాళింది కుంజ్ వద్ద మోకాలు లోతు నురగ నీటిలో మహిళలు సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యమునా నది కలుషిత నీటిపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Delhi: Devotees stand in knee-deep toxic foam in Yamuna for Chhath Puja Read @ANI Story | https://t.co/M97YK6qIOn#Yamuna #ChhathPooja #Delhi #ToxicFoam pic.twitter.com/dPrvex1Esh — ANI Digital (@ani_digital) November 20, 2023 నాలుగు రోజుల పాటు సాగిన ఛఠ్ పూజా వేడుకల ముగింపు సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు సోమవారం ఉదయం సూర్యునికి అర్ఘ్యం సమర్పించారు. యమునా నదిలో నురగలు వస్తున్నప్పటికీ తప్పనిస్థితిలో భక్తులు పూజా కార్యక్రమాలు చేశారు. అయితే.. యమునా నది నీటిలో అధిక పాస్పేట్ స్థాయిల కారణంగా నురగ నీరు ప్రవహిస్తోంది. యూపీ, హర్యానా సహా చుట్టుపక్కల రాష్ట్రాల పరిశ్రమల నుంచి కలుషిత నీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా నది నీటిలో పాస్పేట్ స్థాయిలు అధికంగా ఉన్నాయి. ఛఠ్ పూజా కార్యక్రమాలు ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీతో పాటు బిహార్, యూపీ, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతాయి. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. నాలుగు రోజులపాటు జరుగుతున్న ఛఠ్ పండుగ శుక్రవారం ప్రారంభమైంది. స్వచ్ఛత, సద్భావన, విశ్వాసాలకు నిలయంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇదీ చదవండి: Delhi Schools: ఢిల్లీలో తెరుచుకున్న విద్యాసంస్థలు -
భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజలు (ఫొటోలు)
-
దీపావళి ధమాకా!
న్యూఢిల్లీ: దేశీయంగా పండుగ సీజన్ సందర్భంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ. 3.75 లక్షల కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు అఖిల భారతీయ ట్రేడర్ల సమాఖ్య (సీఏఐటీ) వెల్లడించింది. రాబోయే గోవర్ధన పూజ, భాయ్ దూజ్, ఛత్ పూజ వంటి పర్వదినాల సందర్భంగా మరో రూ. 50,000 కోట్ల మేర వ్యాపారం జరగవచ్చని అంచనా వేస్తున్నట్లు వివరించింది. ఈసారి దీపావళికి ఎక్కువగా దేశీయంగా తయారైన ఉత్పత్తులే అమ్ముడైనట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. చైనా ఉత్పత్తులకు రూ. 1 లక్ష కోట్ల మేర వ్యాపారం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ‘గతంలో దీపావళి పండుగ సందర్భంగా అమ్మకాల్లో చైనా ఉత్పత్తుల వాటా దాదాపు 70 శాతం ఉండేది. కానీ ఈసారి దేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు ఇటు వ్యాపారవర్గాలు, అటు వినియోగదారుల నుంచి భారీగా స్పందన లభించింది‘ అని ఆయన వివరించారు. ఇలా ఖర్చు చేశారు.. కస్టమర్లు ఈ దీపావళికి ఫుడ్, గ్రాసరీపై 13 శాతం వెచ్చించారు. వస్త్రాలు, దుస్తులపై 12 శాతం, ఆభరణాలకు 9 శాతం, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్‌పై 8 శాతం, బహుమతులకు 8 శాతం, కాస్మెటిక్స్‌కు 6 శాతం ఖర్చు చేశారు. డ్రైప్రూట్స్, స్వీట్స్, నమ్కీన్ 4 శాతం, ఫర్నీషింగ్, ఫర్నీచర్ 4 శాతం, గృహాలంకరణ 3 శాతం, పూజా సామగ్రి 3, పాత్రలు, వంటింటి ఉపకరణాలు 3 శాతం, కన్ఫెక్షనరీ, బేకరీ 2 శాతం కైవసం చేసుకున్నాయి. ఆటోమొబైల్, హార్డ్‌వేర్, ఎలక్ట్రికల్, బొమ్మలు, ఇతర వస్తువులకు 20 శాతం వెచి్చంచారని సీఏఐటీ తెలిపింది. అన్ని విభాగాల్లోనూ జోష్.. రిటైల్‌లో అన్ని విభాగాలు మెరుగ్గా పనితీరు కనబరిచాయి. అమ్మకాల పరంగా ఆన్‌లైన్‌కు, ఆఫ్‌లైన్‌కు వ్యత్యాసం లేదని రిటైల్ రంగ నిపుణుడు కళిశెట్టి పి.బి.నాయుడు తెలిపారు. మొత్తం రిటైల్ వ్యాపారంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా 16 శాతం ఉందన్నారు. తెలుగు రాష్ట్రా ల్లో గతేడాదితో పోలిస్తే ఈ దీపావళికి డైమండ్ జువెల్లరీ విక్రయాలు 15–20 శాతం, బంగారు ఆభరణాలు 35 శాతం దూసుకెళ్లాయని హీరావాలా జెమ్స్, జువెల్లర్స్ ఎండీ గౌతమ్ చవాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 19,000 కోట్లపైనే.. ఇక, దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ.19,000 కోట్లపైన వ్యాపార అమ్మకాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా దుస్తులు, నిత్యావసర వస్తువులు, టపాసులు, గృహోపకరణాలు జరిగినట్లు తెలిపాయి. దీపావళి అంటే టపాసులతో పాటు స్వీట్లకు అత్యధిక ప్రాధాన్యత ఉండటంతో వీటికోసమే రూ.3,800 కోట్ల వరకు వ్యయం చేసినట్లు పేర్కొన్నాయి. దేశవ్యాప్తంగా సగటున ప్రతి ఒక్కరు దీపావళి పర్వదినం సందర్భంగా రూ.3,500 వరకు ఖర్చు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయని, ఆ లెక్కన చూస్తే రాష్ట్రంలో దీపావళి సందర్భంగా రూ.19,000 కోట్లపైన మార్కెట్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్‌పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
మోర్బీ తరహాలో ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన
లక్నో: ఛట్ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. #WATCH | UP: A part of a canal culvert carrying many people collapsed in Chandauli's Saraiya village of Chakia Tehsil during #ChhathPooja celebrations earlier today A few bricks of the bridge slipped & fell into the river during #Chhath celebrations, but no one was injured: ASP pic.twitter.com/IQMykWjhrw — ANI (@ANI) October 31, 2022 ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే.. -
గుజరాత్ కేబుల్ బ్రిడ్జి విషాదం.. వంతెన కూలడానికి కారణాలివేనా?
గుజరాత్లో మచ్చు నదిపై నిర్మించిన మోర్బీ తీగల వంతెన కూలిపోయిన ఘటన దేశం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇంజనీరింగ్ అద్భుతంగా చెప్పుకునే గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కుప్పకూలడంతో దాని మీదున్న వందలాది మంది సందర్శకులు నదిలో పడిపోయారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మంది ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 130 మందికి పైగా మృత్యువాత పడ్డారు. దాదాపు 170 మందిని రక్షించారు. మరో వందమంది ఆచూకీ తెలియాల్సి ఉంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మరమ్మతుల కోసం ఆరు నెలల క్రితం మూసేసిన ఈ కేబుల్ బ్రిడ్జిని ఐదు రోజుల క్రితమే పునఃప్రారంభించారు. వారం కూడా గడవక ముందే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. కూలిన ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. చదవండి: Morbi Bridge Collapse: కేబుల్ బ్రిడ్జి విషాదం. 12 మంది ఎంపీ కుటుంబ సభ్యులు మృతి ప్రస్తుతం బ్రిడ్జి కూలడానికి గల కారణాలు ఏంటనే ప్రశ్న అందరి బుర్రల్లో మెదులుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటం, పాతకాలపు వంతెన, నిర్వహణ లోపం వంటి పలు కారణాలు తెర మీదకు వస్తున్నాయి. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం #Watch the CCTV footage of the bridge collapse in Gujarat's Morbi. Over 200 people have been rescued from the site of the incident, MoS Harsh Sanghvi said Monday. #MorbiBridgeCollapse Follow live updates: https://t.co/yxhdG5Hw3P pic.twitter.com/d1cKoTSDQw — The Indian Express (@IndianExpress) October 31, 2022 ► మచ్చు నదిపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రద్దీ ఎక్కువగా కనిపించింది. దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై స్థానికులతో పాటు సందర్శకులు మొత్తం కలిపి 500మంది వరకు ఉన్నట్లుగా కనిపిస్తోంది. వీరిలో ఛట్ పూజా వేడుకల కోసం, సెలవు దినం కావడంతో కుటుంబంతో వచ్చినవారు అధికంగా ఉన్నారు. ఒకేసారి వంతెనపై పరిమితికి మించి ఎక్కువ మంది నడవటం, జన సాంద్రత తట్టుకోలేకే కూలినట్లుగా భావిస్తున్నారు. Over 100 killed and 170 injured in the tragic #Morbi bridge collapse in Gujarat. Several people still remain missing. Rescue efforts underway by Indian Army, Indian Navy, Indian Air Force, NDRF, SDRF, Fire Brigade and local police. Chief Minister and Home Minister at spot. pic.twitter.com/mocM8UuajY — Aditya Raj Kaul (@AdityaRajKaul) October 30, 2022 ► ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో బ్రిడ్జిపై నడుస్తున్న కొందరు యువకులు ఉద్ధేశ పూర్వకంగా వంతెనను విపరీతంగా ఊపుతుండటం, ఒకరినొకరు తోసుకోవడం కనిపిస్తుంది. యువకుల పిచ్చి చేష్టల వల్లే బ్రిడ్జి కూలిందని నెటిజనన్లు మండిపడుతున్నారు. అయితే ఈ వీడియో పాతదా.. ప్రమాదానికి ముందు తీసిందా అనేది తెలియాల్సి ఉంది. ► మోర్బీ వంతెన 140 ఏళ్ల నాటిది. బ్రిటిష్ కాలంలో నిర్మించిన బ్రిడ్జి కావడం, బలమైన పునాది లేకపోవడం కూడా ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనికితోడు మరమత్తుల కోసం వంతెనను మూసేశారు. ఏడు నెలలపాటు మరమత్తులు నిర్వహించి గుజరాత్ న్యూయర్ డే వేడుకల కోసం అక్టోబర్ 26నే తిరిగి సందర్శకుల నిమిత్తం తెరిచారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, ఛట్ పూజ నేపథ్యంలో సరైన ఏర్పాట్లు లేకపోవడంతో వందలాది మంది ఒకేసారి వంతెనపైకి వచ్చారని పలువురు ఆరోపిస్తున్నారు. ►మరమత్తుల అనంతరం వంతెనను తెరవడానికి ప్రభుత్వ అనుమతి తీసుకోలేదని తెలుస్తోంది. అంతేగాక వంతెన పటిష్టతను తనిఖీ చేయలేదని, బ్రిడ్జికి మున్సిపల్ అధికారుల నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోకుండానే రీఓపెన్ చేశారని విమర్శలు గుప్పుముంటున్నాయి. అయితే బ్రిడ్జి కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు పూర్తయితే గానీ అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
దేశ వ్యాప్తంగా ఘనంగా ఛట్ పూజ వేడుకలు (ఫోటోలు)
-
యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి
యుమునా నది విషపూరితం అంటూ బీజేపీ ఎంపీ పర్వేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ జల్ బోర్డ్ డైరెక్టర్ సంజయ్ శర్మతో వాదనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రసిద్ధి గాంచిన ఛత్ పూజ సందర్భంగా వేలమంది స్నానం చేసే యమునా నదిలో స్నానం చేసి చూపించగలవా అంటూ ఛాలెంజ్ విసిరారు. దీంతో ఢిల్లీ జల్ బోర్డు డైరెక్టర్ సంజయ్ శర్మ ఆదివారం ఉదయం ఛత్ పూజకు ముందు యమునా నీటిలో స్నానం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో...యమునా నది శుభ్రంగా సురక్షితంగా ఉందని చూపించారు. నది నీరు స్వచ్ఛమైనది, ప్రజలకు ఎలాంటి హాని కలిగించదన్నారు. బీజేపీ ఎంపి పర్వేష్ శర్మ నీటిలో విష రసాయనాలు చల్లారంటూ ఆరోపణలు చేశారు. అందుకే తాను అన్నమాట ప్రకారం స్నానం చేసి చూపించాను. నదిని శుద్ధి చేసే నిమిత్తం సంబంధిత అధికారుల అనుమతితో రసాయనాలను పిచికారి చేశాం. నీరు విషపూరితం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. यह दिल्ली के सांसद है लेकिन इनकी जुबान तो देखो कितनी ओछी और तुच्छ है और वो भी भारतीय सरकार के एक अधिकारी के प्रति। delhi jal board k director DTQC Sanjay Sharma ji ne yamuna k Pani me naha kar ye saaf kar diya ki yamuna ka pani puri tarah se saaf h @msisodia @ANI @CNNnews18 pic.twitter.com/tsEnXfrkKA — water treatment plant DJB (@delhijalboard0) October 30, 2022 (చదవండి: ఎట్టకేలకు డ్రీమ్ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!) -
తనిఖీలు చేస్తుండగా గాయపడ్డ నితీష్‌కుమార్
పట్నా: బిహార్‌లో గంగానది ఒడ్డున అట్టహాసంగా జరిగే ఛత్ పూజ నిమిత్తం ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ఘాట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఆయన కాసేపు విలేకరులతో ముచ్చటించారు. ఐతే ఈ వారం తనిఖీలు పడవలో కాకుండా కారులో పర్యవేక్షిస్తున్నారేంట? అని విలేకరులు నితీష్‌ని ప్రశ్నించారు. దీంతో నితీష్ కుమార్ వివరణ ఇస్తూ... గతవారం తాను పడవలో తనిఖీలు చేస్తుండగా తమ బోటు జేపీ స్తంభాన్ని ఢీ కొట్టిందని తెలిపారు. దీంతో తాను గాయపడ్డానంటూ తన కుర్తా ఎత్తి మరీ బ్యాండేజ్‌లను చూపించారు. ఐతే పడవలో ఉన్నవారందరు సురక్షితంగా ఉన్నారని, తమను వేరే పడవలో తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన కాలికి కూడా గాయమైందని చెప్పారు. తన పొట్టకు బ్యాండేజ్‌ఉండటంతోనే సీటు బెల్టు వేసుకోలేక కారు ముందు సీటులో కూడా కూర్చొలేదని వివరణ ఇచ్చారు. ఛత్‌పూజ బిహార్‌లో అత్యంత ప్రసిద్ధమైన పండుగ, అందువల్ల మూడు రోజుల పాటు గంగానది వద్ద ఉండే ఘాట్లన్నీ జనసందోహంతో కిటకిటలాడుతుంటుంది. (చదవండి: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు సోనియా అభినందనలు) -
భక్తిశ్రద్ధలతో ఛట్ పూజలు
-
ఛట్ పూజ ఫోటోలు
-
నిజమా.. అసలు ఇదెలా సాధ్యం: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశాల్లో ఛత్ పూజ వేడుకలపై నిషేధం విధించాలన్న కేజ్రీవాల్ సర్కారు నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. మహమ్మారి కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇలాంటి కార్యక్రమాల వల్ల ‘సూపర్ స్ప్రెడర్లు’ పుట్టుకువచ్చే అవకాశం ఉందని పేర్కొంది. కాగా రాజధాని నగరంలో నివసించే బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజ ప్రారంభం(నవంబరు 20) కానున్న నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం వేడుకల(నదీ తీరాలు, సరస్సుల వద్ద గుమిగూడటం)పై నిషేధం విధించింది. ఇప్పటికే కరోనా థర్డ్‌వేవ్ మొదలైన కారణంగా సామూహిక సమావేశాల నిర్వహణకు అనుమతించేది లేదని ఢిల్లీ డిజాస్టర్ మేజ్మెంట్ అథారిటీ చైర్మన్ ఓ ప్రకటన విడుదల చేశారు. (చదవండి: ఢిల్లీ లాక్డౌన్ : మనీష్ సిసోడియా స్పందన) ఇదెలా సాధ్యం? ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దుర్గా జన్ సేవా ట్రస్టు ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. ఛత్ పూజ నేపథ్యంలో కనీసం వెయ్యి మందికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై నేడు విచారణ చేపట్టిన న్యాయస్థానం పిటిషనర్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ సుబ్రహ్మణ్యం ప్రసాద్‌తో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేస్తూ.. ‘‘ అవునా నిజంగానా? నేడు ఢిల్లీ ప్రభుత్వం వివాహ శుభాకార్యాలకు కేవలం 50 మందికే అనుమతి ఇస్తానని పేర్కొంది. మీరేమో వెయ్యి మందికి కావాలి అంటున్నారు. ఇదెలా సాధ్యపడుతుంది?’’అని ప్రశ్నించింది. క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడింది. ‘‘కోవిడ్ ఇన్ఫెక్షన్ రేటు పెరిగిపోతోంది. 7800 నుంచి 8593 కేసులు నమోదవుతున్నాయి. కరోనా మరణాల రేటు కూడా రెట్టింపైంది. ప్రస్తుతం సుమారుగా 42 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. బహుశా వీటి గురించి అవగాహన లేదేమో’’అని ఢిల్లీ పరిస్థితుల గురించి పిటిషనర్‌కు వివరించింది. నాలుగు రోజుల పండుగ మొత్తం నాలుగు రోజులు ఛత్ వేడుకలు జరుపుకొంటారు. తొలి రోజు నాహాయ్-ఖాయ్ నిర్వహించారు. ఇందులో భాగంగా స్త్రీ పురుషులు సూర్య భగవానుడిని అత్యంత నియమనిష్టలతో పూజిస్తారు. వ్రత ప్రక్రియ 72 గంటలలో పూర్తవుతుంది. రెండో రోజు ఖర్నా, మూడో రోజు డాలా ఛట్, నాలుగో రోజును పెహలా పేరిట పండుగ జరుపుకొంటారు. నాలుగో రోజు మోకాలిలోతు నీటిలో నిలబడి అస్తమించే సూర్యుడికి ఆరోగ్య ప్రసాదాలను, ఐదో రోజు ఉదయించే సూర్య భగవానుడికి ఆరోగ్య ప్రసాదాలను సమర్పిస్తారు. అనంతరం ఉపవాసాలు విరమించి బంధుమిత్రులతో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీ. యుమనా నది తీరంతోపాటు వివిధ కాలనీల్లో బహుళ అంతస్తుల టెర్రస్‌పై ఏర్పాటు చేసే కృత్రిమ చెరువులు ఈ పండుగకు వేదికలుగా మారతాయి. -
ఈ ఫొటో చూసి భ్రమ పడొద్దు.. ప్లీజ్!
న్యూఢిల్లీ : ఛత్ పూజ అనగానే గుర్తొచ్చేది ఉత్తర భారతీయులు. వేకువ జామునే నది వద్దకు చేరుకుని.. సూర్యుడు ఉదయించే వరకు పూజలు చేసి.. సూర్యదేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఇటీవల ఛత్ పూజలో భాగంగా యమునా నది తీరంలో మహిళలు పెద్ద ఎత్తున సూర్యదేవునికి పూజలు చేశారు. అయితే ఢిల్లీ సమీపంలో కలిండి కుంజ్ ప్రాంతంలో కనిపించిన కొన్ని దృశ్యాలు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. యమునా నదిలో విషపు రసాయనాలతో కూడిన నురగ మధ్యలోనే కొందరు మహిళలు పూజలు నిర్వహించారు. విషపు నురగ తమ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందనే అవగాహన లేక చాలా మంది అందులో దిగి తమ భక్తిని చాటుకున్నారు. మరికొంత మంది ఏది ఏమైనా పూజ చేసి తీరాలని విషపు నురగను సైతం లెక్కచేయకుండా తమ పని కానిచ్చారు. అయితే అలాంటి పరిస్థితుల్లో మహిళలు పూజలు నిర్వహిస్తున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ ఫొటోలు చూసిన వారు మహిళలు తెల్లని మబ్బుల మధ్య నిల్చోని పూజ చేస్తున్నారమోనని భ్రమపడుతున్నారు. కానీ.. వారు కాలుష్యపు కోరల మధ్య సూర్యదేవుడికి పూజ చేస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రజలు గాలి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. దేశంలో కాలుష్యం ఏ స్థాయిలో పెరుగుతుందో చెప్పడానికి ఈ ఘటనలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. -
ఆసిఫాబాద్ జిల్లాలో ఘనంగా ప్రారంభమైన ఛాట్ పూజలు
-
ఛాఠ్ పూజలో అపశ్రుతి.. ముగ్గురు మృతి
పట్నా : బిహార్‌లో నాలుగు రోజులపాటు జరిగే ఛాఠ్ పూజలో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సమస్తీపూర్‌లోని దేవాలయ గోడ కూలిన ఘటనలో ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు ప్రాణాలు విడిచారు. పురాతన కాళీమాత ఆలయంలో ఆదివారం ఉదయం ‘ఆఘ్యా’ పూజ నిర్వహిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చెరువుకు ఆనుకుని ఉన్న ఆలయ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో.. లీలా దేవి (62), బచ్చీ దేవి (62) కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలపాలైన కొకాయ్ యాదవ్ (55) ఇంటివద్ద మృతి చెందినట్టు స్థానికులు చెప్తున్నారు. అయితే, అతను గాయాల కారణంగానే చనిపోయారా.. మరేదైన కారణమా అని తెలియాల్సి ఉంది. ఇక ఈ ఘటనపై ప్రభుత్వం స్పందించింది. మృతులకు రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ఛాఠ్ పూజలో భాగంగా ఔరంగాబాద్ జిల్లాలోని సూర్యనగరి దేవాలయంలో జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. -
ఛత్ పూజలో విషాదం
సూర్యభగవానుడికి మొక్కులు చెల్లించుకోవడానికి అందిరితో కలిసి యుమునా నదికి చేరుకొన్న ఓ యువతితోపాటు చిన్నారిని నది బలిగొన్నది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఘజియాబాద్: ఛత్ పూజలో విషాదం చోటు చేసుకొంది. ఇరువై ఏళ్ల యువతి గురువారం యమునా నదిలో ఛత్‌పూజలో భాగంగా పుణ్యస్నానమాచరిస్తూ వృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పార్కు కాలనీకి చెందిన దిలీప్ అతడి భార్య నీతు, జ్యోతి ఆమె తండ్రి జస్వంత్ కలిసి యమునా నది ఒడ్డున ఛత్ పూజల కోసం ఏర్పాటు చేసిన ఇలాచీపూర్ ఘాట్ నంబర్-33కి చేరుకొన్నారు. ఉదయం 6.00 గంటలకు నదిలోకి పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లిన నీతు, జ్యోతి అదుపుతప్పి కొట్టుకొనిపోయారు. ఈ సమయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇద్దరు గజ ఈతగాళ్లు రెండు గంటలపాటు శ్రమించి వృతదేహాలను వెలికి తీశారు. జ్యోతి 6వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఉత్తర ఢిల్లీ పరిధిలోని బురారి పోలీసులు వృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు -
భక్తిశ్రద్ధలతో ఛత్ సంబరాలు షురూ
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ వాసులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఛత్ పూజలు ప్రారంభమయ్యాయి. మొత్తం నాలుగు రోజులు ఈ పండుగను జరుపుకొంటారు. ఇందులో భాగంగా మొదటి రోజు సోమవారం నాహాయ్-ఖాయ్ పూజను ఘనంగా నిర్వహించారు. స్త్రీ పురుషులు సూర్య భగవానుడిని అత్యంత నియమనిష్టలతో పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. వ్రత ప్రక్రియ 72 గంటలలో పూర్తవుతుంది. రెండో రోజు ఖర్నా, మూడో రోజు డాలా ఛట్, నాలుగో రోజును పెహలా పేరిట ఈ పండుగను నిర్వహించనున్నారు. బుధవారం సాయంత్రం భక్తులు మోకాలిలోతు నీటిలో నిలబడి అస్తమించే సూర్యుడికి ఆరోగ్య ప్రసాదాలను, ఐదో రోజు ఉదయించే సూర్య భగవానుడికి ఆరోగ్య ప్రసాదాలను సమర్పిస్తారు. అనంతరం భక్తులు ఉపవాసాలను విరమించి బంధుమిత్రులతో వనభోజనాలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందుకు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. యుమనా నది తీరంతోపాటు వివిధ కాలనీల్లో బహుళ అంతస్తుల టైలపై ఏర్పాటు చేసే కృత్రిమ చెరువులు ఈ పండుగకు వేదికలుగా మారాయి. నగరంలో సుమారు వెయ్యి చోట్ల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. యమునా నది తీరంలో.. యమునా నది తీరంలో 24 ఘాట్ల వద్ద ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇండియాగేట్, బిర్లా మందిర్‌తో పాటు అనేక కాలనీలలో కృత్రిమ చెరువులను ఏర్పాటు చేసి ట్యాంకర్లతో నీరు నింపుకొన్నారు. నగరంలో పూర్వాంచలీయుల( బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినవారి) సంఖ్య లక్షలకు చేరుకొంది. దీంతోపాటు వారు బలమైన రాజకీయ శక్తిగా ఎదగడంతో ఈ వ్ర తం ఆచరించేవారి సంఖ్య భారీగా పెరిగింది. ఇందు కోసం యమునా నది ఒడ్డున ప్రత్యేక ఘాట్ల వద్ద భారీ ఏర్పాట్లు చేశారు.మార్కెట్లకు కళ : నగరంలోని మార్కెట్లు ఛత్ పూజ సామగ్రితో కళకళలాడుతున్నాయి. ప్రజలు భారీగా తరలి వచ్చి పూజాసామగ్రిని కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లు జనంతో రద్దీగా మారాయి. పూజ సామగ్రిని బీహార్, యూపీల నుంచి ప్రత్యేకంగా తెప్పించినట్లు దుకాణదారులు చెబుతున్నారు. సుమారు రు.10 కోట్ల వ్యాపారం జరుగుతందని అంచనా. -
ఛత్ భక్తుల కోసం ప్రత్యేక రైలు
న్యూఢిల్లీ: జరిగే ఛత్ పూజకు వెళ్లేవారి సౌకర్యార్థం పాట్నాకు ప్రత్యేక రైలు నడిపేందుకు ఉత్తర రైల్వే నిర్ణయించింది. ఉపాధి నిమిత్తం నగరానికి వచ్చి స్థిరపడిన ఉత్తర భారతదేశ ప్రజలు ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీవరకు ఛత్ పూజ నిమిత్తం సొంత గ్రామాలకు తరలుతున్నారు. వేలాదిగా ఉన్న వీరి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం నుంచి ఆనంద్ విహార్ స్టేషన్ నుంచి పాట్నా వరకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి నీరజ్ శర్మ తెలిపారు. పండగల సీజన్ నిమిత్తం సెప్టెంబర్ చివరి వారం నుంచి నవంబర్ 10వ తేదీవరకు ఉత్తర రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటివరకు నవరాత్రి, ఈద్, దసరా, దీపావళి పండుగలు ముగియగా, ప్రస్తుతం ఛత్ పూజ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. వీటిలో డైలీ, వీక్లీ రైళ్లు ఉన్నాయని, ఈ పండగ సీజన్ మొత్తం సుమారు 3 వేల అదనపు ట్రిప్పులు నడిపామని ఆయన వివరించారు. అలాగే దీనికోసం 130 అదనపు కోచ్‌లను ఆయా రైళ్లకు కలిపామని చెప్పారు. సాధారణంగా పండగల సీజన్లో రైల్వే ప్రయాణికుల సంఖ్య 30 నుంచి 40 శాతం అదనంగా పెరుగుతుందని శర్మ తెలిపారు. శుక్రవారం ఒక్కరోజే 30 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన వివరించారు. ఛత్‌పూజను బీహార్ ప్రజలు ఎక్కువగా జరుపుకుంటారు. -
లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు
-
ఉత్తర భారతదేశంలో ఘనంగా చత్పూజ
-
లాలూ కటౌట్లతో రబ్రీదేవి చట్పూజలు
న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలో చత్పూజను మహిళలు ఘనంగా జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చత్పూజ చేస్తే అంతా మంచే జరుగుతుందని మహిళల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు బీహార్ మాజీ ముఖ్యమంత్రి - లాలూ ప్రసాద్ సతీమణి రబ్రీదేవీ పాట్నాలో చత్పూజ నిర్వహించారు. సొంత నివాసంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పశువుల దాణా స్కామ్‌లో లాలూ ప్రసాద్‌యాదవ్ జైలుపాలు కాగా.. అతని ఫ్లెక్సీలను పూజా ప్రాంతంలో ప్రదర్శించారు. -
ఛట్‌పూజపై రాజకీయం
సాక్షి, ముంబై: ‘ఛట్ పూజ’ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. గత రెండు మూడేళ్లలో ఈ అంశం పెద్దగా తెరపైకి రానప్పటికీ త్వరలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దీనిపై పెద్ద ఎత్తున రాజకీయం నడుస్తోంది. ఉత్తర భారతీయులు, ముఖ్యంగా బీహారీ ప్రజలు జరుపుకునే పండుగల్లో ఒకటైన ఈ ‘ఛట్‌పూజ’ను ఓవైపు మహారాష్ట్ర నవనిర్మాణసేన (ఎమ్మెన్నెస్) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ మాత్రం ఛట్‌పూజకు అనుకూలంగా ఉంది. శివసేన కొంతకాలంగా ఈ అంశంపై పెద్దగా స్పందించకపోయినా, ఎన్నికల నేపథ్యంలో దీనిపై ఒక అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలున్నాయి. బాల్‌ఠాక్రే కూడా చట్పూజను తీవ్రంగా వ్యతిరేకించేవారు. ఈ నేపథ్యంలో పూజ జరుగనున్న పలు ప్రాంతాల్లో కొంత ఉద్రిక్త వాతవరణం నెలకొందని చెప్పవచ్చు. మరో ఐదారు నెలల్లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర భారతీయుల ఓటర్లతోపాటు మరాఠీ ఓటర్లనూ ఆకట్టుకునేందుకు ఛట్‌పూజ రాజకీయ పార్టీలకు ఎంతో ఉపయోగపడనుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు దాదాపు అన్ని పార్టీలూ ప్రయత్నాలు మొదలుపెట్టాయి. గత కొన్నేళ్లుగా ఛట్ పూజను ముంబైలో నిర్వహిస్తున్నప్పటికీ దానిని ఎమ్మెన్నెస్ వ్యతిరేకిస్తోంది. ఈసారి కూడా మరాఠీ ఓటర్లను ఆకట్టుకునేందుకు మునుపటి వైఖరినే కొనసాగించనుందని తెలుస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఉత్తర భారతీయులను ఆకట్టుకునేందుకు ఛట్‌పూజ శుభాకాంక్షలు చెబుతూ హోర్డింగ్‌లు నెలకొల్పింది. అయితే ఈ పార్టీ ఎమ్మెల్యేల్లో కొందరు ఛట్‌పూజను వ్యతిరేకిస్తుండడం గమనార్హం. ఎమ్మెన్నెస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రేకు సన్నిహితుడిగా గుర్తింపుపొందిన బీజేపీ ముంబైశాఖ అధ్యక్షుడు ఆశీష్ శేలార్ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పూజపై ఒక నిర్దుష్ట అభిప్రాయం తెలియజేయకపోవచ్చని సమాచారం. బీహారీలు ముంబైలో తమ బలప్రదర్శన నిర్వహించేదుకే ఈ పూజను నిర్వహిస్తున్నారని రాజ్‌ఠాక్రే ఆరోపించడం తెలిసిందే. పూజకు ముస్తాబయిన జుహూచౌపాటీ... ఛట్‌పూజలు నిర్వహించేందుకు జుహూచౌపాటీ ముస్తాబయింది. బీహారీ సమాఖ్య పూజకోసం అన్ని ఏర్పాట్లూ చేసింది. జుహూ చౌపాటీలో శుక్రవారం జరగనున్న ఈ పూజ సందర్భంగా భజన, ఇతర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలియజేశారు. ఇందులో పాల్గొనే భక్తులకు ఎవరికి ఎలాంటి ఇబ్బందీ కలుగకుండా గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. శక్తి కాదు... భక్తి ప్రదర్శన ఛట్‌పూజను కొందరు కావాలనే శక్తి ప్రదర్శనగా పేర్కొంటున్నారని, ఇది భక్తి ప్రదర్శన మాత్రమేనని ‘బీహారీ సమాఖ్య’ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ పేర్కొన్నారు. ముంబైలో గత 14 సంవత్సరాలుగా జరుగుతున్న ఈ పూజలో లక్షలాది మంది బీహారీలు పాల్గొంటారని తెలిపారు. ఎమ్మెన్నెస్ వైఖరిపైనే అందరి దృష్టి... ఛట్‌పూజపై ఎమ్మెన్నెస్ ఎలాంటి వైఖరిని అవలంభిస్తోందనే విషయంపై అందరి దృష్టి కేంద్రీకతమైంది. పూజకు తాము వ్యతిరేకులం కాదని పేర్కొన్నప్పటికీ, రాజకీయ బలప్రదర్శన చేస్తే మాత్రం ఊరుకునేది లేదని గతంలో రాజ్‌ఠాక్రే హెచ్చరించారు. ఈసారి ఆయన ఎటువంటి వైఖరి తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. దీనిపై ఎమ్మెన్నెస్ నాయకుడు ఒకరు మాట్లాడుతూ ఛట్ పూజనుఎప్పటిలాగే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. సూర్యుడికి మొక్కులు ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సక ల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. తదనంతరం గృహిణులు జల్లెడ నుంచి చంద్రుణ్ని వీక్షించిన తరువాత భర్తను చూస్తారు. దీనివల్ల తన భర్త ఆయురారోగ్యాలతో జీవిస్తాడని విశ్వసిస్తారు. భర్త కూడా ఈ పర్వదినం నాడు భార్యకు కానుకలు అందజేస్తాడు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఇది నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. -
ఛట్‌పూజ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: పూర్వాంచలీయుల సంస్కృతి, సంప్రదాయాల్లో భాగమైన ఛట్‌పూజ నగరంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య కూడా పెరుగుతుండడంతో ఈ పండుగపై రాజకీయ నాయకులు కూడా దృష్టిసారించారు. పూజలు జరిగే నదీతీరాలను శుభ్రపరిచే పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నాలుగురోజులపాటు జరుపుకునే ఈ వ్రతంలో తొలిరోజైన నహాయ్ఖాయ్ను సంప్రదాయంగా జరుపుకున్నారు. రెండో రోజైన ‘ఖర్నా’ను జరుపుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఛట్ పూజను ప్రధానంగా నాలుగు రోజులు జరుపుకుంటారు. మొదటి రోజును నహాయ్ ఖాయ్, రెండోరోజును ఖర్నా, మూడవ రోజును పెహలా ఆర్ఘ్య్, నాలుగవరోజును పార్నాగా పేర్కొంటారు. ఛట్ పూజ చేసేవారు అత్యంత నిష్టగా నహాయ్‌ఖాయ్ ఆచరిస్తారు. ఎక్కువగా మహిళలే ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇల్లంతా శుభ్రపరచుకుని, శుచిగా స్నానం చేస్తారు. వ్రతధారులే స్వయంగా పీలి మట్టితో పొయ్యి తయారుచేసి మామిడి కట్టెలను ఉపయోగించి అర్వాచావల్, శనగపప్పు, సొరకాయ లేదా అరటికాయ కూరతో తయారుచేసిన వంటకాన్ని ఆరగిస్తారు. వంటలో సాధారణంగా ఉప్పు వినియోగించరు. ఒకవేళ వాడినా సైంధవ లవణాన్ని మాత్రమే వాడుతారు. సొరకాయ ఈ రోజున వంటలో ప్రధానంగా వాడుతారు కనుక నహాయ్ ఖాయ్ భోజనాన్ని కొందరు కద్దూబాత్గా పేర్కొంటారు. వ్రతధారులు రాత్రి ప్రసాదం తరువాత మరుసటి రోజు సాయంత్రం వరకు ఉపవాసముంటారు. ఈ రోజును ఖర్నాగా పేర్కొంటారు. సాయంత్రం ఖీర్, రొట్టెలను ప్రసాధంగా స్వీకరించి నిర్జల ఉపవాసాన్ని ప్రారంభిస్తారు. మూడవ రోజున అస్తమించే సూర్యున్ని పూజించి చాటలో ప్రసాదాన్ని సమర్పిస్తారు. నాలుగో రోజున ఉదయించే సూర్యునికి ఆర్ఘ్యప్రసాదాలు సమర్పించి వ్రత విసర్జన చేసి విందు భోజనం చేయడంతో వ్రతం పూర్తవుతుంది. పెరుగుతున్న ఆదరణ... సువిశాల భారతదేశం వైవిధ్యానికి నెలవు. ఈ వైవిధ్య భరితమైన సంస్కృతి, వేషధారణ, ఆచారాలు, వ్యవహారాల్లోనే కాకుండా పండుగలలో కూడా కనబడుతుంది. దీపావళి, దసరా వంటి పండుగలు యావద్దేశం ఆనందోత్సాహాలతో జరుపుకుటున్నప్పటికీ కొన్ని ప్రాంతాలలో జరుపుకునే పండుగల గురించి మిగతా ప్రాంతాల వారికి పెద్దగా తెలియదు. ఉదాహరణకు కేరళ వాసుల అతి పెద్ద పండుగ ఓనమ్ గురించి మిగతా ప్రాంతాల ప్రజలకు తెలియదు. తెలంగాణవాసులు అత్యుత్సాహంతో జరుపుకునే బతుకమ్మ వేడుక గురించి పక్కనే ఉన్న సీమాంధ్ర ప్రాంతాల వారికి తెలియదు. ఇలా ఆయా ప్రాంతాలకే ప్రత్యేకమైన పండుగలు, పర్వదినాలు ఎన్నో ఉన్నాయి. ఈ కోవలోకే వస్తుంది పూర్వాంచలీయులు జరుపుకునే ఛట్ పూజ. ఛట్ పూజ గురించి రెండు దశాబ్దాల కిందటి వరకు ఢిల్లీవాసులకు కూడా పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నగరంలో పూర్వాంచలీయుల సంఖ్య భారీగా పెరగడంతో ఇప్పుడు ఈ పూజ సందడి నగరమంతటా దర్శనమిస్తోంది. ఒకప్పుడు ఛట్ పూజ కోసం పూర్వాంచలీయులే స్వయంగా ఘాట్లను శుభ్రపరచుకుని అన్ని ఏర్పాట్లు చేసుకునేవారు. పూజ సామగ్రిని ఉత్తర ప్రదేశ్, బీహార్ల నుంచి తెప్పించుకునేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వమే ఈ పూజ కోసం దాదాపు 70 ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పూజా సామగ్రి కూడా ఇప్పుడు నగరంలోని అన్ని మార్కెట్లలో లభిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం 2000 సంవత్సరంలో ఛట్ పూజ రోజును ఐచ్చిక సెలవుగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం కూడా 2011లో ఛట్‌పూజ రోజును ప్రాంతీయ సెలవుగా ప్రకటించింది. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్ పూజ రోజున ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని బీజేపీ చెబుతోంది. ఆసియా క్రీడల సమయం నుంచి నగరానికి పూర్వాంచలీయుల వలసలు పెరిగాయని, ఉపాధికోసం నగరానికి వచ్చిన వారు పాలం, సంగమ్ విహార్, డాబ్రీ, ఉత్తం నగర్, కిరాడీ, సాగర్పూర్, సీమాపురి, మంగోల్‌పురి తదితర ప్రాంతాలలో నివాసమేర్పరచుకుని యమునా తీరాన ఛట్ పూజ చేసుకునేవారని, లక్షలాది మంది పూర్వాంచలీయులు ఈ వేడుకలకు హాజరుకావడం గమనించి రాజకీయ నాయకులు, ప్రభుత్వం కూడా ఈ పూజ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం ప్రారంభించారని నగరంలో 30 సంవత్సరాలుగా నివాసముంటోన్న పూర్వాంచలీయులు చెప్పారు. ఛట్ పూజ కూడా కూడా బతుకమ్మ పండుగ మాదిరిగానే ప్రకృతికి సన్నిహితమైనది. సక ల సృష్టికి ఆధారమైన సూర్యభగవానున్ని ఈ పండుగ సందర్భంగా కొలుస్తారు. మోకాలి లోతు వరకు నీటిలో నిలబడి సూర్యదేవునికి ఆర్ఘ్యప్రసాదాలను సమర్పించడం ఈ పూజ ప్రత్యేకత. వెదురు గంప లేదా చాటలో పళ్లను ఉంచి అస్తమించే సూర్యునికి, ఉదయించే సూర్యునికి ప్రసాదంగా సమర్పిస్తారు. ఈ పూజలో ప్రధాన భాగం నదీతీరాన జరుగుతుంది కాబట్టి ఈ పూజ నదుల శుద్ధీకరణలపై కూడా దృష్టిసారించేలా చేస్తుంది. పండుగ సమయంలో ప్రసాదంగా సమర్పించే బెల్లం, చెరకు, కొబ్బరిరకాయలు, అరటిపళ్లు, పసుపు,అల్లం ఇత్యాది సామగ్రి ఆరోగ్యానికి కూడా మేలుచేస్తుందంటారు వైద్య నిపుణులు. -
ఛట్ పూజకు భారీ ఏర్పాట్లు
సాక్షి, న్యూఢిల్లీ:పూర్వాంచలీయులు భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఛట్ పూజ కోసం ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చే స్తోంది. ఛట్ పూజను పురస్కరించుకుని ఈ నెల 8, 9 తేదీల్లో పూర్వాంచలీయులు యమునా నదితీరంలోని ఘాట్లతోపాటు నగరంలో కాలువులు, సహజ జలాశయాలతో పాటు కృత్రిమంగా ఏర్పాటుచేసే జలాశయాల వద్ద సూర్యభగవానునికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఆర్ఘ్యప్రసాదాలను సమర్పిస్తారు. ఇందుకోసం యమునా నది ఘాట్లను శుభ్రం చేసి టెంట్లు వేయడం, వెదురు బారికేడ్లు నిర్మించడం తదితర పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఐటీఓ ఘాట్, యమునా ఘాట్, కుదేశియా ఘాట్ల వద్ద గుట్టల్లా పేరుకుపోయిన ప్లాస్టిక్ సంచులు, సీసాలను తొలగిస్తున్నారు. రాత్రి పూట నదీ తీరంలో బస చేయదలచిన వారికోసం టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని సంబంధిత అధికారులు తెలిపారు. యమునా నది లోతుల్లోకి ప్రజలు వెళ్లకుండా ఉండడం కోసం కంచెలు, ప్రజలను నియంత్రించడం కోసం వెదురు బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వైద్య సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టం తదితరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. 72 ప్రదేశాల్లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక నిమజ్జనం సమయంలో జరిగిన మరణాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు అటువంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత ్తలు తీసుకుంటున్నారు. యమునా నది తీరాన మయూర్ విహార్, షకర్‌పుర్, గీతాకాలనీ, సోనియా విహార్, బదర్ పూర్లలోగల అనేక ఘాట్ల వద్దకూడా పూర్వాంచలీయులు సూర్యునికి ఆర్ఘ్యపాద్యాలను సమర్పిస్తారు, కోండ్లీ కాలువకు ఇరువైపులా ఛట్‌పూజ కోసం పది ఘాట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇవేకాకుండా అనేక ఉద్యానవనాల్లో కృత్రిమ జలాశయాలను నిర్మించే పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూర్వాంచలీయులను ఆకట్టుకునేందుకు తంటాలు శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు కూడా పూర్వాంచల్ ఓటర్లను ఆకట్టుకోవడం కోసం ఈ సందర్భాన్ని శాయశక్తులా వినియోగించుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండడంతో ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా పూర్వాంచలీయులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము అధికారంలోకి వచ్చినట్లయితే ఛట్ ఫూజ రోజును ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామనిప్రకటించిన బీజేపీ.. ఈ పూజ కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇప్పటికే ఓ లేఖ రాసింది. ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయకపోయినట్టయితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఛట్ పూజ ఘాట్ల వద్ద తమ పార్టీ కార్యకర్తలు సేవలందిస్తారని ఆ పార్టీ నాయకుడొకరు చెప్పారు. కాగా తమ పార్టీ నేతలు,కార్యకర్తలు ఛట్ పూజలో పాల్గొంటారని ఆమ్ ఆద్మీపార్టీ కూడా ఇప్పటికే ప్రకటించింది. అన్ని నియోజకవర్గాల్లోనూ... నగర ఓటర్లలో 40 శాతం మంది పూర్వాంచలీయులే. దాదాపు అన్ని నియోజకవర్గాలలో పూర్వాంచలీయులు ఉన్నారని, కనీసం 30 నియోజక వర్గాల్లో ఫలితాలను వారు ప్రభావితం చేయగలరని రాజకీయ విశ్లేషకులు అం టున్నారు. పూర్వాంచలీ ఓటర్లకున్న ఈ సంఖ్యాబలం కారణంగా అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు వారిని ఆకట్టుకునే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. -
ఛట్‌పూజపై రాజకీయమా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఛట్ పూజకు సెలవుదినాన్ని ప్రకటించే అంశాన్ని సైతం బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకుంటున్నారని కాంగ్రెస్ మంత్రులు ధ్వజమెత్తారు. చట్పూజకు ప్రభుత్వం ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నా ప్రజలను తప్పుదోవ పట్టించేలా బీజేపీ నాయకులు ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ మంత్రులు అరవిందర్‌సింగ్,రాజ్‌కుమార్ చౌహాన్, హరుణ్ యూసుఫ్‌లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి అంశాన్ని బీజేపీ నాయకులు రాజకీయాలకు వాడుకోవాలని చూడడం శోఛనీయమన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఛట్‌పూజను ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తామని చెబుతున్నారు. అది ఎలా సాధ్యమో వివరించాలన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని మంత్రి అరవింద్‌సింగ్ లవ్లీ ఆరోపించారు. ప్రస్తుతం ఢిల్లీలో ఛట్ పూజ నిర్వహించే 72 ఘాట్లను కాంగ్రెస్‌పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. ఛట్‌పూజ ఏర్పాట్లలో రెవెన్యూ, ఢిల్లీ జల్ బోర్డు, ఢిల్లీ పోలీస్,ఆరోగ్య శాఖ, పీడబ్ల్యూడీ, డీయూఎస్ఐబీ,ఎంసీడీలు అన్ని విభాగాలు సమన్వయంతో ఏటా ఏర్పాట్లు చేస్తూనే ఉన్నాయన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఛట్‌పూజ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్న సంస్థలను ప్రభుత్వం ఎలాంటి వివక్షకు గురిచేయడం లేదన్నారు. వారికి అవసరమైన పూర్తి సహకారం ఇస్తున్నామన్నారు. అనధికారిక కాలనీలు, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై బీజేపీ సీఎం అభ్యర్థి హర్షవర్ధన్ లేవనెత్తిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయన్నారు. అనధికారిక కాలనీలను క్రమబద్దీకరించాలంటూ 2002లో కాంగ్రె స్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని హర్షవర్ధన్ వ్యతిరేకించారని గుర్తు చేశారు. ఇలా చేయడంతో ప్రభుత్వంపై భారం పడుతుందని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారని పేర్కొన్నారు. 2007-08లో 1,639 కాలనీలు రెగ్యులరైజేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిలో 1,218 కాలనీలను వెంటనే ప్రొవిజనల్ రెగ్యులరైజేషన్ ధ్రువపత్రాలు జారీ చే సినట్టు పేర్కొన్నారు. 2012 సెప్టెంబర్ 4న మరో 895 అనధికారిక కాలనీలను క్రమబద్దీకరించినట్టు తెలిపారు. 720 కాలనీల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 822 కాలనీలకు పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరాతోపాటు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎంసీడీల పరిధిలోని అనధికారిక కాలనీల్లో అభివృద్ధిపనులు చేపట్టడంలో బీజేపీ ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించేవారని సింగ్ మండిపడ్డారు. వారిలో హర్షవర్ధన్ ఒకరని ఆయన పేర్కొన్నారు. రాజకీయ లబ్ధికోసమే హర్షవర్ధన్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఛట్ పూజకు ఏర్పాట్లు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఛట్‌పూజ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా ఏర్పాట్లు చేయాలని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్టీ తరఫున చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. పూజకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలంటూ ఆయన సోమవారం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ), మూడు మున్సిపాలిటీల మేయర్లకు ఉత్తరాలు రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఛట్‌పూజ నాడు సెలవు ప్రకటిస్తామని వెల్లడించారు. లక్షల మంది భక్తులు పాల్గొనే ఛట్‌పూజకు ఢిల్లీ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేస్తున్న ధాఖలాలు కనపడడం లేదని ఎల్జీకి పంపిన ఉత్తరంలో పేర్కొన్నారు. పండుగ ఏర్పాట్లలో భాగస్వాములు కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ‘గణేశ్ చతుర్థి సందర్భంగా ఢిల్లీలో ఎన్నో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది యువకులు యమునానదిలో ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది పాల్గొనే ఈ పండుగ సందర్భంగా అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి’ అని అన్నారు. స్నానాల ఘాట్ల వద్ద భద్రతాచర్యలు, సరిపడా పోలీసులు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్‌లు, రవాణా సదుపాయాల కల్పన, ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవడం, మహిళల భద్రతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం సహా పలు అంశాలను లేఖలో ప్రస్తావించినట్టు పేర్కొన్నారు. వలంటీర్లుగా ఆయా ప్రాంతాల్లో అవసరమైన సేవలందించాలని బీజేపీ కార్యకర్తలకు గోయల్ సూచించారు. ఛట్‌పూజ సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నాయకులతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఏటా ఎదుర్కొంటున్న ఎన్నో ఇబ్బందులను పలువురు ప్రతినిధుల ముందుంచారు. వీటన్నిం టికీ పరిష్కారం కనుగొనేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ కొన్ని ప్రతిపాదనలను ఎల్జీకి పంపిన ఉత్తరంలో ఆయన పొందుపర్చారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లకు సైతం గోయల్ కొన్ని సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా వీలైనన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.