అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు.
ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు.
అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు.
ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment