suspension bridge
-
మీర్ ఆలం చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జ్
-
గుజరాత్ కేబుల్ బ్రిడ్జ్ ఘటన...మున్సిపల్ ఆఫీసర్‌పై వేటు
అక్టోబర్ 30న మచ్చు నదిపై మోర్బీ తీగల వంతెన కూలి 135 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించి మున్సిపాలిటీ చీఫ్ ఆఫీసర్ సందీప్ సిన్హ్ జలాలను గుజరాత్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడూ సందీప్ జాలా ఛీఫ్ ఆఫీసర్‌గా ఉండటంతో వేటు విధించామని కమిటీ స్పష్టం చేసింది. దర్యాప్తుని నిష్పక్షపాతంగా జరిపేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఐతే ఆయనపై ఇంకా ఎలాంటి నిర్ధిష్ట అభియోగాన్ని మోపలేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు కమిటీ దర్యాప్తులో....మున్సిపాలిటీ బోర్డు అనుమతి పొందకుండానే సుమారు 15 ఏళ్ల పాటు ఒరెవా గ్రూపుతో ఒప్పందంపై మున్సిపాలిటీ సంతకం చేసిందని అధికారులు తెలిపారు. అదీగాక 139 ఏళ్ల నాటి బ్రిడ్జిని ప్రైవేట్ కంపెనీ అనుమతి లేకుండానే మళ్లీ తెరిచినప్పుడూ మున్సిపాలిటీ చేతులు దులుపుకుందనే విమర్శలు తలెత్తుతున్నాయి. బ్రిడ్జిని తిరిగి తెరిచేటప్పుడూ కూడా కంపెనీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేసిందా లేదా అనేది తెలియదని మున్సిపాలిటీ చీఫ్ సందీప్ జాలా అన్నారు. ఈ బ్రిడ్జిని ఒరెవా కంపెనీ మార్చి7 నుంచి మరమత్తుల నిర్వహణ విషయమై ఏడు నెలలపాటు మూసేసింది. న్యూయర్ వేడుకల నేపథ్యంలోనే అక్టోబర్ 26న వంతెనను తిరిగి ప్రారంభించింది. అయితే ఒరేవా మేనేజింగ్ డ్రైరెక్టర్ జయసుఖ్ పటేల్ మోర్బి జిల్లా కలెక్టర్ మధ్య 2008 ఒప్పందం ప్రకారం సుమారు 10 సవంత్సరాల పాటు వంతెనను నిర్వహించడానకి కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఐతే ఒరెవా కాంట్రాక్టుకు ఎలాంటి టెండర్లు నిర్వహించలేదని గుజరాత్ ప్రభుత్వ న్యాయవాది హెచ్ఎస్ పాంచల్ బుధవారం స్థానిక కోర్టుకు తెలిపారు. అంతేగాదు కేవలం బ్రిడ్జి ప్లాట్‌ఫాంని మాత్రమే ఒరెవా గ్రూప్ మార్చిందని, తెగిపడిన కేబుల్ విభాగం బలహీనంగా తుప్పుపట్టి ఉందని పాంచల్ ఆరోపణలు చేశారు. అయితే మరో ప్రభుత్వ అధికారి 2018లోనే ఒప్పందం ముగిసిన ఒరెవాతో అనబంధ సాగించిందని, రాజ్‌కోట్ కలెక్టర్ కార్యాలయం కొత్త ఒప్పందం కుదుర్చుకునే వరకు వంతెనను నిర్వహించడానికి ఒరేవా మేనేజింగ్ డైరెక్టర్ పటేల్‌కు అనుమతి ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగస్టులో టికెట్ పీజు పెంచాలన్న కంపెనీ ప్రతిపాదనను సైతం మున్సిపల్ బోర్డు తిరస్కరించిందని అధికారి తెలిపారు. ఈ ఏడాది ఒప్పందం ప్రకారం పెద్దలకు రూ.15, 12 సంవత్సారాల కంటే తక్కువ వయసు ఉన్నవారికి రూ. 10గా నిర్ణయించారు. ఈ మేరకు ఒరెవా గ్రూపుకు చెందని నలుగురు అధికారులను, మరమత్తులు కేటాయించిన కాంట్రాక్టర్లు ప్రకాశ్ పర్మార్, దేవాంగ్ పర్మార్‌లతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఈ ఘటనపై దర్యాప్తు చేసి నివేదికను సిద్ధం చేసి త్వరతగతిన ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
మోర్బీ దుర్ఘటన.. దైవ నిర్ణయం!
మోర్బీ: గుజరాత్‌లోని మోర్బీ ప్రాంతంలో కూలిన కేబుల్ బ్రిడ్జి కేసులో అరెస్టయిన తొమ్మిది మందిని మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా మచ్చు నదిపై బ్రిడ్జి పునరుద్దరణ పనులు చేపట్టిన అజంతా ఒరేవా కంపెనీని ప్రాసిక్యూషన్ తప్పుబట్టారు. పునరుద్దరణ పనులకు ఒరివా కంపెనీకి అసలు అర్హత లేదని మోర్బీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కోర్టుకు నివేదించారు. అయినప్పటికీ ఇదే కంపెనీకి 2007, 2022లో బ్రిడ్జి రిపేర్ పనులకు కాంట్రాక్టు అప్పగించినట్లు తెలిపారు. వంతెన పునరుద్ధరణ సమయంలో ఫ్లోరింగ్ మార్చారు. కానీ అరిగిపోయిన తీగల స్థానంలో కొత్తవి అమర్చలేదని, పాత వాటిని అలాగే ఉంచారని ఆరోపించారు. దీనివల్ల కొత్తగా వేసిన నాలుగు లేయర్ల అల్యూమినియం ఫ్లోర్ బరువు ఎక్కువగా ఉండటంతో పాత తీగలు మోయలేక తెగిపోయాయని ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తెలిసిందన్నారు. చదవండి: Hemant Soren: జార్ఖండ్ సీఎంకు ఈడీ నోటీసులు.. విచారణకు రావాలని ఆదేశం గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ఘటనకు సంబంధించి కోర్టులో హాజరు పరిచిన నిందితుల్లో ఒరేవా కంపెనీ మేనేజర్ దీపక్ పరేఖ్ కూడా ఒకరు. అయితే వంతెన ప్రమాదంలో తమ ప్రమేయం ఏం లేదని.. అది ‘గాడ్ విల్’(దైవ నిర్ణయం) అని దీపక్ కోర్టుకు తెలిపారు. ఇలాంటి దురదృష్ట ఘటన జరగకుండా ఉండాల్సిందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి ఎంజే ఖాన్ ముందు దీపక్ విన్నపించారు. విచారణ అనంతరం నలుగురు నిందితులను కోర్టు నలుగురికి కోర్టు పోలీస్ కస్టడీకి అప్పగించింది. వీరిలో ఒరెవా సంస్థకు చెందిన ఇద్దరు మేనేజర్లు, ఇద్దరు సబ్‌కాంట్రాక్టర్లు ఉన్నారు. మిగతా అయిదుగురికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మచ్చు నదిపై కూలిన తీగల వంతెన దుర్ఘటనపై ఇప్పటికే సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీనిపై నవంబర్ 14న సర్వన్నోత న్యాయస్థానం విచారణ జరపనుంది. కాగా కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటి వరకు 135 మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్లు గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేది వెల్లడించారు. మచ్చునదిలో ఇంకా ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు ఘటనలో కంపెనీకి చెందిన 9 మందిని అరెస్టు చేయగా.. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు పత్తా లేకుండా పోయారు. చదవండి: కేబుల్ బ్రిడ్జిపైకి కారు..‘మోర్బీ’ విషాదం చూశాకైనా మారరా? -
వైరల్ వీడియో: ‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
-
‘మోర్బీ’ విషాదం చూశాకైనా మీరు మారరా?
బెంగళూరు: గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో కేబుల్ బ్రిడ్జి కూలిపోయి 130 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన సంఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆ తర్వాత కేబుల్ బ్రిడ్జిల సామర్థ్యం, నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు.. మోర్బీ విషాదం చూసైనా కొందరు మారటం లేదు. మోర్బీ ఘటన జరిగిన మరుసటి రోజునే కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి అత్యుత్సాహంతో కేబుల్ బ్రిడ్జిపైకి ఏకంగా కారునే తీసుకొచ్చాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. యెల్లపురా నగరంలోని నదిపై ఉన్న తీగల వంతెనపైకి ఓ వ్యక్తి కారును తీసుకొచ్చాడు. అయితే, ముందుకు వెళ్లేందుకు చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో స్థానికులు అతడికి సాయం చేసి కారును వెనక్కి తీసుకెళ్లి ప్రమాదం నుంచి తప్పించారు. ఈ వంతెనను కేవలం ద్విచక్రవాహనాలు, నడక కోసం మాత్రమే ఏర్పాటు చేశారు. కానీ, ఏకంగా కారునే తీసుకురావటం చర్చనీయాంశంగా మారింది. స్థానికులు ఈ అంశంపై అధికారులకు సమాచారం అందించి అలర్ట్ చేశారు. అయితే, బ్రిడ్జిపై బైక్‌లు వెళ్లటాన్ని చూసి.. కారు సైతం వెళ్తుందని భావించినట్లు డ్రైవర్ తెలిపాడు. తాను స్థానికుడిని కాదని, ఫోర్వీలర్స్కు బ్రిడ్జి సరికాదని తెలియదని చెప్పాడు. ఇదీ చదవండి: మోర్బీలో ప్రధాని మోదీ.. కేబుల్ బ్రిడ్జి ప్రమాద బాధితులకు పరామర్శ -
మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్, కమలా హారిస్
గుజరాత్లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్ ట్వీట్ చేశారు. Jill and I send our deepest condolences to the families who lost loved ones during the bridge collapse in India, and join the people of Gujarat in mourning the loss of too many lives cut short. In this difficult hour, we will continue to stand with and support the Indian people. — President Biden (@POTUS) October 31, 2022 అదే విధంగా గుజరాత్ దుర్ఘటనపై అమెరికా వైఎస్ ప్రెసిడెంట్ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌లో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు. We stand with the people of India who are mourning the victims of the devastating bridge collapse in Gujarat. Our hearts are with those who lost loved ones and all those impacted. — Vice President Kamala Harris (@VP) October 31, 2022 అంతులేని విషాదం మోర్బి ప్రాంతంలో కూలిన బ్రిటిష్ కాలపు తీగల వంతెన విషాదం 140 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. గుజరాత్ రాష్ట్రం మోర్బీ పట్టణంలో మచ్చూ నదిపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి కూలిపోయిన విషయం తెలిసిందే. నదిపై కట్టిన తీగల వంతెన సెకన్ల వ్యవధిలో కూలిపోతుంటే, ఒకరి మీద మరొకరుగా వందల సంఖ్యలో జనం నదీ జలాల్లో పడిపోయిన తీరు కలిచివేస్తోంది. చదవండి: శాపమా? పాలకుల పాపమా? మొత్తం 140 మందికి పైగా సందర్శకులు ప్రమాదం బారినపడి అన్యాయంగా అసువులు బాసారు. ఆరంభించిన అయిదు రోజులకే రోప్ బ్రిడ్జి కూలిపోవడం మరమ్మత్తుల పనిలో నాణ్యతా లోపంతో, ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఘటనా ప్రాంతంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, ఆర్మీ, భారత నేవీ సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ముమ్మాటికీ మానవ తప్పిదమే! మోర్బీ వంతెన ప్రమాదానికి ముమ్మాటికీ మానవ తప్పిదమే కారణమని స్పష్టమవుతోంది. బ్రిడ్జికి ఫిట్‌నెట్ సర్టిఫికెట్ జారీ చేయలేదని, మున్సిపాలిటీ అనుమతి లేకుండానే దాన్ని పునఃప్రారంభించారని అధికారులు తెలిపారు. అంతేగాక ప్రమాద సమయంలో 500 మందికిపైగా జనం వంతెనపై ఉన్నారని స్థానికులు పేర్కొన్నారు. బరువు ఎక్కువై కూలిపోయిందని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. తీగల సాయంతో వేలాడే ఈ వంతెన సామర్థ్యం కేవలం 150 మంది కాగా అంతకంటే ఎక్కువ మంది వెళితే ఆ బరువును తట్టుకోలేదు. అయినా ఈ విషయం తెలిసినప్పటికీ కాంట్రాక్ట్ సంస్థ ‘అజంతా ఒరెవా’ నిర్లక్ష్యంగా వ్యహరించి.. ఏకంగా 675 మంది సందర్శకులకు టిక్కెట్లు విక్రయించినట్లు తెలిసింది. చదవండి: మోర్బీ వారధి విషాదం: మృతుల్లో 47 మంది పిల్లలు.. మరో వంద మందికిపైగా జలసమాధి! కేసు నమోదు, అరెస్టులు ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీయగా అందులో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.వంతెన కూలుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కొంతమంది మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు తెలిపాడు.ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, త్రివిధ దళాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష సంఘ్వీ ఆదివారం రాత్రి నుంచి అక్కడే మకాం వేసి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి ఇప్పటిదాకా 9 మందిని అరెస్టు చేసినట్లు గుజరాత్ పోలీసులు తెలియజేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టును పొందిన అజంతా ఒరెవా కంపెనీపై కేసు నమోదు చేశామని తెలిపారు.దర్యాప్తు సిట్ ఏర్పాటుచేశారు. -
మోర్బీ బ్రిడ్జి విషాదం.. 12 మంది బీజేపీ ఎంపీ కుటుంబ సభ్యులు మృతి
గుజరాత్‌లోని మోర్బీ నగరంలో మచ్చు నదీపై తీగల వంతెన కూలిన ఘోర దుర్భటన యావత్ భారత్‌ను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. సెలవు దినం.. ఆపై ఛట్ పూజ సంబరాలతో వందలాది మంది ఆహ్లాదంగా నదిపై జరిపిన సరదా విహారం ప్రాణాంతకంగా మారింది. అందరూ హడావిడిగా ఉండగా ఒక్కసారిగా బ్రిడ్జి కుప్పకూలడంతో ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే చాలా మంది నదిలో పడిపోయారు. చేతికి అందిన తీగలు పట్టుకొని కొందరు నదిలో పడకుండా ఆపుకోగలిగారు. వంతెన పునరుద్దరించిన నాలుగు రోజుల్లోనే కూలిపోవడంతో 130 మందికి పైగా జల సమాధి అవ్వడం తీరని విషాదంగా మారింది. మృతుల్లో అత్యధికులు మహిళలు, చిన్నారులే ఉండటం మరింత ఆవేదన కలిగిస్తోంది. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటనలో బీజేపీ ఎంపీ కుటుంబానికి చెందిన పలువురు మృతి చెందారు. రాజ్‌కోట్‌కు చెందిన బీజేపీ ఎంపీ మోహన్‌భాయ్ కళ్యాణ్‌జీ కుందారియా సోదరికి చెందిన 12 మంది కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ‘‘వంతెన కూలిన దుర్ఘటనలో ఐదుగురు పిల్లలతో సహా నా సోదరి కుటుంబంలోని 12 మంది సభ్యులను కోల్పోయాను. ఘటనా స్థలంలో ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, స్థానిక యంత్రాంగం సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. ప్రమాదం నుంచి బయటపడిన వారికి చికిత్స అందుతోంది. నదిలో ఉన్నవారి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెస్క్యూ బోట్లు కూడా సంఘటనా స్థలంలో ఉన్నాయి. వంతెన కూలిన ఘటనలో పిల్లలు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. 60 మృతదేహాలను వెలికితీశాం’ అని ఎంపీ పేర్కొన్నారు. చదవండి: 140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం 132కు చేరిన మృతుల సంఖ్య మోర్భీ కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనితో సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోం మంత్రి షర్ష్ సంఘ్వీ తెలిపారు. బ్రిడ్జి కూలిన ఘటనపై సెక్షన్లు 304, 308, 114 ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్)ను ఏర్పాటు చేశారు. 140 ఏళ్లనాటి వంతెన కాగా ఈ వంతెనను 140 ఏళ్ల నాటిది. 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీనిని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. బ్రిటిష్ కాలం నాటి ఈవంతెనకు రూ. 2 కోట్లతో 7 నెలల పాటు మమరమత్తులు నిర్వహించి ఆధునీకరించారు. అయితే రిపేర్ తర్వాత వంతెనకు సేఫ్టి సర్టిఫికెట్ తీసుకోకుండానే తిరిగి తెరిచినట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. -
140 ఏళ్ల నాటి బ్రిడ్జి.. ఇటీవలే మరమత్తులు.. 4 రోజులకే పెను విషాదం
మోర్బీ: గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోర్బీ జిల్లాలోని ప్రాంతంలో మచ్చు నదిపైనున్న కేబుల్ బ్రిడ్జి ఆదివారం సాయంత్రం కుప్పకూలింది. ఉన్నట్టుండి బ్రిడ్జి తెగిపోవడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు నదిలో పడిపోయారు. బ్రిడ్జి కూలిన ఘటనలో మృతుల సంఖ్య 132కు చేరింది. ఇప్పటివరకు 177 మందిని రక్షించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో వంతెనపై దాదాపు 500 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యల్లో పలుపంచుకుంటున్నారని చెప్పారు. Early morning visuals from the accident site in #Morbi where over 130 people have died after a cable bridge collapsed. Gujarat Minister Harsh Sanghavi present at the spot. pic.twitter.com/mOtsYcINt2 — NDTV (@ndtv) October 31, 2022 మోర్బీలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. వెంటనే గుజరాత్ సీఎం గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో ఫోన్లో మాట్లాడారు మోదీ. ఘటన వివరాలను తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ ఘటనలో మరణించిన వారికి గుజరాత్ ప్రభుత్వం రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించగా, కేంద్రం రూ.2 లక్షలు ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50 వేల సాయం ప్రకటించింది. ఇక మోదీ అహ్మదాబాద్‌లో తలపెట్టిన రోడ్ షోను ప్రమాదం నేపథ్యంలో రద్దు చేసుకున్నారు. కట్టింది 1880లో...! తీగల సాయంతో వేలాడే మోర్బీ సస్పెన్షన్ బ్రిడ్జిపై నడవడం సందర్శకులకు మధురానుభూతి కలిగిస్తుంది. నిత్యం వందలాది మంది దీన్ని సందర్శిస్తుంటారు. ఇది 140 ఏళ్ల నాటిది! 1879 ఫిబ్రవరి 20న అప్పటి ముంబై గవర్నర్ రిచర్డ్ టెంపుల్ దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 1880లో నిర్మాణం పూర్తయ్యింది. ఇందుకు అప్పట్లోనే రూ.3.5 లక్షలు ఖర్చయ్యాయి. వంతెన పొడవు 765 అడుగులు (233 మీటర్లు). వెడల్పు 1.25 మీటర్లు. దీని నిర్మాణానికి అవసరమైన సామగ్రిని ఇంగ్లండ్ నుంచి తెప్పించారు. నాటి మోర్బీ పాలకుడు సర్ వాగ్జీ ఠాకూర్ అప్పట్లో యూరప్‌లో ఉన్న అత్యాధునిక పరిజ్ఞానాలను రంగరించి దీన్ని కట్టించాడు. ఇది మోర్బీ పట్టణంలోని దర్బార్గఢ్, నజార్బాగ్ ప్రాంతాలను అనుసంధానిస్తుంది. దీన్ని చారిత్రక వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చారు. 7 నెలల పాటు రిపేర్లు.. 26వ తేదీనే రీ ఓపెన్ బ్రిటిష్ హయాంలో కట్టిన ఈ పాదచారుల వంతెనను ఇంజనీరింగ్ అద్భుతంగా చెబుతుంటారు. దీనికి ఇటీవలే మరమ్మతులు చేయడంతో పాటు ఆధునీకరించారు. రూ.2 కోట్లతో 7 నెలలకు పైగా పనులు జరిగాయి. ఈ సందర్భంగా వంతెన ఏ మేరకు సురక్షితమన్న అంశం గుజరాత్ అసెంబ్లీలో కూడా చర్చకు వచ్చింది. దీని పటిష్టతపై పలువురు ఎమ్మెల్యేలు అనుమానం వ్యక్తం చేయగా అంతా బాగానే ఉందని ప్రభుత్వం బదులిచ్చింది. గుజరాతీ నూతన సంవత్సరం సందర్భంగా ఈ నెల 26వ తేదీన రీ ఓపెన్ చేసి సందర్శకులను అనుమతిస్తున్నారు. నాలుగు రోజులకే ఘోరం జరిగిపోయింది. మరమ్మతుల తర్వాత వంతెనకు మున్సిపాలిటీ ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇంకా అందలేదని అధికారులు తెలిపారు. 1979లో బద్దలైన మచ్చూ డ్యాం... వేలాదిమంది జలసమాధి మోర్బీ పట్టణంలో తీగల వంతెన ప్రమాదం 1979లో ఇదే మచ్చూ నదిపై జరిగిన ఘోర దుర్ఘటనను మరోసారి గుర్తుకు తెచి్చంది. 1979 ఆగస్టు 11న మోర్బీ సమీపంలోని మచ్చూ–2 డ్యామ్ తెగిపోయింది. దాంతో పట్టణాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ విషాదంలో 2,000 మందికిపైగా చనిపోయారు. సౌరాష్ట్రలో కరువు పీడిత ప్రాంతాలకు సాగునీరు అందించడానికి ఈ డ్యామ్‌ను 1972లో నిర్మించారు. -
రూ.300 కోట్లతో ఐటీ కారిడార్ అభివృద్ధి
సస్పెన్షన్ బ్రిడ్జి, సుందరీకరణ పనుల శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మహానగరంలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో పెరుగుతున్న జనాభా, వాహనాలు, ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా.. భవి ష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. బుధవారం దుర్గం చెరువుపై రూ.184 కోట్లతో నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జి, రూ.3.5 కోట్లతో చేపట్టిన సుందరీకరణ తదితర పనులకు కేటీఆర్ శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన ప్రసంగిస్తూ.. గ్రేటర్లో ఐటీ కారిడార్ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆ మేరకు ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని చెప్పారు. ఈ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన మేరకు స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్(ఎస్ఆర్డీపీ)లో భాగం గా సస్పెన్షన్ బ్రిడ్జి, ఇతర పనులు చేపట్టా మని చెప్పారు. 16 నుంచి 18 మాసాల్లో సస్పెన్షన్ బ్రిడ్జి పనులు పూర్తి చేయాల్సిందిగా కాంట్రాక్టు సంస్థ ఎల్అండ్టీకి సూచించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా బ్రిడ్జి అందుబాటులోకి రాగలదని విశ్వాసం వ్యక్తం చేశారు. రోడ్ నంబర్ 45 నుంచి సస్పెన్షన్ బ్రిడ్జి వైపు వచ్చేవారి కోసం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రూ.82 కోట్లతో టెండర్ పిలిచామన్నారు. దుర్గం చెరువు వద్ద ఎస్టీపీ తదితర పనుల కోసం మరో రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్లు ఖర్చవుతుందని, అన్నీ వెరసి ఐటీ కారిడార్‌లో దాదాపు రూ.300 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రణాళికతో ముందుకు పెరుగుతున్న జనాభా, నగర అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలకు తగిన ప్రణాళికలతో ముందుకెళ్తున్నామని కేటీఆర్ చెప్పారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఎస్ఆర్డీపీ తొలి దశలో రూ.2,600 కోట్ల పరిపాలన అనుమతులిచ్చామన్నారు. 18 జంక్షన్లలో పనులు ప్రారంభం కాగా, ఎన్జీటీ స్టేతో కేబీఆర్ పార్క్ వద్ద పనులు ఆగిపోయాయన్నారు. జీహెచ్ఎంసీ, టీఎస్ఐఐసీ, జలమండలి సమన్వయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. నగరంలో వైట్‌టాపింగ్ రోడ్ల కోసం టీఎస్ఐఐసీ రూ.90 కోట్లు కేటాయించిందన్నారు. ఇనార్బిట్ మాల్ నుంచి దాబా చౌరస్తా వరకు సొరంగ మార్గం సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామన్నారు. మరో రూ.124 కోట్లతో రహదారుల విస్తరణ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల సందర్భంగా మంత్రి ప్రకటించిన పనులన్నింటి విలువ దాదాపు రూ. 535 కోట్లు కావడం గమనార్హం. కార్యక్రమాల్లో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందమైన ల్యాండ్‌మార్క్.. సస్పెన్షన్ బ్రిడ్జితో దుర్గం చెరువు ప్రాంతం నగరానికి అందమైన ల్యాండ్‌మార్క్‌గా రికార్డు కెక్కుతుందని కేటీఆర్ అన్నారు. ‘దుర్గం’పరిసరాల్లో రాళ్లతో కూడిన ప్రకృతి సౌందర్యం దెబ్బ తినకుండా సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. దుర్గం సుందరీకరణ పనుల కోసం తొలి దశలో రహేజా ఐటీ పార్కు వారు 3 కి.మీ.ల సైక్లింగ్, జాగింగ్ ట్రాక్‌ల కోసం రూ.2 కోట్లు సీఎస్సార్ కింద ఇచ్చారని, 6 నుంచి 8 మాసాల్లో ఈ పనులు పూర్తవుతాయన్నారు. రెండో దశలో మరో రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్లతో 2 వేల మంది పట్టే యాంపీ థియేటర్ తదితర పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. -
ఇదేమి వంతెన బాబోయ్!
బీజింగ్: ఎత్తైన కొండల శిఖరాగ్రాలపై వంతెనలను నిర్మించడంలో ప్రపంచంలో తనకు సరిలేరు మరెవ్వరూ అని ఇప్పటికే నిరూపించుకున్న చైనా ఇప్పుడు ఆసియాలోనే అతి పెద్దదైనా, అతి పొడవైన వంతెనను నిర్మించి ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. దక్షిణ చైనాలోని యున్నన్ ప్రావిన్స్‌లో లాంగ్‌జియాంగ్ నదిపై రెండు కొండల శిఖరాగ్రాలపై ఈ వంతెనను నిర్మించింది. దీని పొడువు 8 వేల అడుగులు కాగా, ఎత్తు 920 అడుగులు. ఐదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం ఇప్పుడు పూర్తయింది. 1510 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ వంతెనను మే 1వ తేదీన ప్రారంభిస్తున్నారు. మొట్టమొదటి సారిగా డ్రోన్ ద్వారా వంతెనను, పరిసర ప్రాంతాలను చిత్రీకరించి ప్రపంచ మీడియాకు విడుదల చేశారు. ఈ వంతెనపై ప్రయాణిస్తూ చుట్టూవున్న కొండలు, లోయల అందాలను ఆస్వాదించవచ్చు. కిందకు చూస్తే మాత్రం ఊపిరి ఆగిపోయినంత పనవుతుంది.