సూర్యభగవానుడికి మొక్కులు చెల్లించుకోవడానికి అందిరితో కలిసి యుమునా నదికి చేరుకొన్న ఓ యువతితోపాటు చిన్నారిని నది బలిగొన్నది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఘజియాబాద్: ఛత్ పూజలో విషాదం చోటు చేసుకొంది. ఇరువై ఏళ్ల యువతి గురువారం యమునా నదిలో ఛత్‌పూజలో భాగంగా పుణ్యస్నానమాచరిస్తూ వృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పార్కు కాలనీకి చెందిన దిలీప్ అతడి భార్య నీతు, జ్యోతి ఆమె తండ్రి జస్వంత్ కలిసి యమునా నది ఒడ్డున ఛత్ పూజల కోసం ఏర్పాటు చేసిన ఇలాచీపూర్ ఘాట్ నంబర్-33కి చేరుకొన్నారు. ఉదయం 6.00 గంటలకు నదిలోకి పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లిన నీతు, జ్యోతి అదుపుతప్పి కొట్టుకొనిపోయారు. ఈ సమయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇద్దరు గజ ఈతగాళ్లు రెండు గంటలపాటు శ్రమించి వృతదేహాలను వెలికి తీశారు. జ్యోతి 6వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఉత్తర ఢిల్లీ పరిధిలోని బురారి పోలీసులు వృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
ఛత్ పూజలో విషాదం
Published Thu, Oct 30 2014 11:48 PM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM
Advertisement