child missing
-
రెండేళ్ల చిన్నారి అదృశ్యం
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తల్లి ఒడిలో ఆడుకునే రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన రామయ్య, పాపమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరు బిడ్డలను వెంటబెట్టుకుని రోడ్ల వెంబడి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి కుక్కలగుంట వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి మెట్ల వద్ద పిల్లలతో కలిసి నిద్రించారు. ఆదివారం తెల్లవారుజామున లేచి చూసే సరికి రెండేళ్ల మూగ బాలిక పాపమ్మ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో స్థానికుల సహకారంతో చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి సీఐ అన్వర్‌బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నాలుగు ప్రత్యేక టీమ్‌లు, మరో రెండు టెక్నికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు. -
కొబ్బరికాయ కొడదామని గుడికి.. అంతలోనే బాబుతో
నారాయణఖేడ్: రెండున్నర నెలల బాబుతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన నారాయణఖేడ్‌లో చోటు చేసుకుందని ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని డీఎన్టీ తండాకు చెందిన కర్ర ప్రకాశ్ (34)కు సిర్గాపూర్ మండలం జమ్లా తండాకు చెందిన సంగీత (26)తో తొమ్మిదేళ్ల క్రితం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లతోపాటు ఇంకా పేరు కూడా పెట్టని రెండున్నర నెలల బాబు సంతానం ఉన్నారు. హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ కర్ర ప్రకాష్ భార్యా పిల్లలతో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. రెండు నెలల క్రితం సంగీత తల్లిగారి గ్రామమైన జెమ్లాతండాకు వెళ్లింది. అత్తగారి గ్రామమైన డీఎన్టీ తండాలో పూజ ఉన్నందున ఈనెల 1వ తేదీన ఇక్కడకు వచ్చింది. పూజ ముగిశాక వారం రోజులుగా ఖేడ్ పట్టణంలోని ప్రకాశ్ అక్క నిర్మల ఇంటికి వచ్చి ఉంటోంది. ఈ నెల 15న ఉదయం డీఎన్టీ తండాలోని ఒక గుడి వద్ద కొబ్బరికాయ కొడదామంటూ తన బాబును తీసుకొని సమీప బందువైన క్రిశాంక్‌తో కలిసి బైక్‌పై వెళ్లింది. కొబ్బరికాయ తీసుకురమ్మంటూ క్రిశాంక్‌ను పంపించి ఆ తర్వాత తనబాబుతో కలిసి సంగీత అదృశ్యమైంది. బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. భర్త కర్ర ప్రకాశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వివరించారు. చదవండి: ప్రేయసికి నిశ్చితార్థం: అంతలోనే కిడ్నాప్ చేసిన లవర్ -
చిన్నారుల అదృశ్యంపై హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నారుల అదృశ్యంపై దాఖలైన పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నారుల మిస్సింగ్ కేసులు అధికమైన నేపథ్యంలో ఈ పిటీషన్ విచారణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విచారణ సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది. చిన్నారుల ఆచూకీని కనిపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని పెదవి విరిచింది. చిన్నారుల ఆచూకీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అలాగే అదృశ్యమైన చిన్నారుల వివరాలను అన్ని రాష్ట్రాలతో పంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. బాలల సంక్షేమ కమిటీల ఏర్పాటులో ప్రభుత్వ జాప్యంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. మరో రెండు వారాల్లో 33 జిల్లాల్లో బాలల సంక్షేమ కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చింది. విచారణ సందర్భంగా అటార్నీ జనరల్(ఏజీ) మాట్లాడుతూ.. రాష్ట్రంలో దర్పన్ కార్యక్రమం అమలవుతుందని ధర్మాసనానికి వివరించారు. కాగా, పిటీషన్‌పై తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. -
పాపా.. కీర్తీ... ఎక్కడున్నావమ్మా..
సాక్షి, పెదకూరపాడు: పాపా.. కీర్తీ... ఎక్కడ ఉన్నావమ్మా.. ఎలా ఉన్నావు తల్లీ.. పుట్టిన రోజు అని నాన్న కేక్ తెచ్చాడు.. పెదనాన్న కొత్త డ్రస్సు కొన్నాడు.. జాలిలేని దేవుడు నా బిడ్డ జాడ చూపలేదు.. కళ్ల ముందు తిరిగే పాప 40 గంటలు గడిచినా కనిపించలేదంటూ చిన్నారి కీర్తి తల్లి రోదిస్తున్న తీరు అందరినీ కంట తడి పెట్టిస్తోంది. మండలంలోని పాటిబండ్ల గ్రామానికి చెందిన పాటిబండ్ల రమేష్, శ్రీలక్ష్మి అలియాస్ తిరుపతమ్మ రెండో కుమార్తె నాలుగేళ్ల కీర్తి సోమవారం ఉదయం 11 గంటల నుంచి కనిపించకుండా పోయిన సంగతి విదితమే. చిన్నారి కీర్తి జాడ కనుగొనేందుకు సోమవారం రాత్రి నుంచి తుళ్ళూరు డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గుంటూరు, విజయవాడ, ఒంగోలు, సత్తెనపల్లి పట్టణాల్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్ ఇతర ప్రాంతాల్లో గాలించారు. పాటిబండ్ల గ్రామంలో మంగళవారం ఏఎన్ఎస్ బృందాలు అణువణువు గాలించాయి. అయినప్పటికీ పాప ఆచూకీ దొరకకపోవటంతో కుటుంబ సభ్యులు మరింత ఆందోళన చెందుతున్నారు. (జన్మదినం రోజే బలవన్మరణం) యాచకురాలిపై అనుమానం సోమవారం గ్రామంలో ఓ గుర్తు తెలియని యాచకురాలు పసుపు రంగు చీర ధరించి బ్లూమాస్క్ పెట్టుకుని అనుమానాస్పదంగా సంచరించినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ కోణంలో పోలీసులు గ్రామంలో ఉన్న సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా ఉండటంతో తల్లిదండ్రులు చిన్నారులను ఇళ్ల వద్ద వదిలివెళుతున్నారు. ఈ నేపథ్యంలో యాచకురాలు కీర్తిని అపహరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. -
‘నా పేరు సాక్షి.. నాన్న పేరు సంతోష్’
ముంబై: నీలి రంగు టవల్ చుట్టుకుని.. రెండు పిలకలతో.. చేతిలో స్వీట్‌తో.. కళ్ల నిండా దిగులుతో ఎవరి కోసమో ఎదురు చూస్తోన్న ఓ మూడేళ్ల చిన్నారి ఫోటో నిన్నంతా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో పాటు.. ‘ఈ రోజు 3.30గంటల ప్రాంతంలో ఈ చిన్నారి.. యారి రోడ్ వెర్సోవాలోని బియాంక గేట్ వద్ద కనిపించింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి.. ‘ఎవరో ఆటోలో వచ్చారని.. ఈ పాపను ఇక్కడ వదిలేసి వెళ్లార’ని చెప్పాడు. తనను గుర్తు పట్టిన వారు ఎవరైనా.. తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించండి’ అంటూ వాట్సాప్, ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో వెర్సోవా పోలీసులు.. చిన్నారిని తమతో పాటు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేడు(బుధవారం) ఈ కథ సుఖాంతం అయ్యింది. బాలికను తమతో పాటు తీసుకెళ్లిన పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక తన పేరు సాక్షి అని, తండ్రి పేరు సంతోష్ అని తెలిపింది. సరిగా ఇదే సమయంలో గోరేగావ్ భగత్‌సింగ్ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తన పేరు సంతోష్ కుమార్ ఓం ప్రకాశ్ సావ్ అని.. తన కుమార్తె పేరు సాక్షి అని.. తనకు మూడేళ్ల వయసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటికే సాక్షి గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో వెర్సోవా పోలీసులు సంతోష్‌ను స్టేషన్‌కు పిలిపించి.. పూర్తిగా విచారించి సాక్షిని తండ్రికి అప్పగించారు. ఈ విషయం గురించి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘నా భార్య గర్భవతి. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే తొందరలో.. నా కూతురు గురించి మర్చిపోయాను. తనను అక్కడే వదిలేసి వెళ్లాను. కాసేపయ్యాక చూస్తే.. సాక్షి కనిపించలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించాన’ని తెలిపాడు. బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ముంబై పోలీసులను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు. -
మాత శిశు రక్షణ కేండ్రంలో పసిపాప అదృశ్యం
-
తిరుమలలో ఏడాదిన్నర బాబు మిస్సింగ్
-
ఇద్దరు పిల్లలతో సహా గృహిణి అదృశ్యం
పహాడీషరీఫ్: ఇద్దరు పిల్లలతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుక్కుగూడ గ్రామానికి చెందిన జమాల్పూర్ జహంగీర్, సరితా బాయి(28) దంపతులకు అక్షయ (9), ఓంకార్ (6) ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 4న బయటికి వెళ్లిన జహంగీర్ సాయంత్రం తిరిగివచ్చే సరికి ఇంటికి తాళం వేసి ఉంది. ఇరుగు పొరుగు వారిని ఆరా తీయగా తమకు తెలియదన్నారు. దీంతో అతను వారి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అనంత ఆస్పత్రిలో చిన్నారి అదృశ్యం
- సెక్యూరిటీ సిబ్బంది చొరవ - బాలిక ఆచూకీ కనుకొని కన్నవారికి అప్పగించిన వైనం అనంతపురం మెడికల్ : బిడ్డ కనిపించకపోవడంతో ఆ అమ్మ కన్నీరు పెట్టింది. తన బిడ్డ ఏడుస్తుంటే ఆమె తల్లి విలవిల్లాడింది. అనంతపురం సర్వజనాస్పత్రిలో శుక్రవారం ఓ చిన్నారి అదృశ్యం కావడంతో గంటన్నర పాటు మాతృ‘హృదయాలు’ తల్లడిల్లిపోయాయి. శింగనమల మండలం మదిరేపల్లికి చెందిన శకుంతల, వీరనారప్ప దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఓ కుమార్తెకు కొన్ని రోజులుగా జ్వరం వస్తుండడంతో గురువారం సర్వజనాస్పత్రిలోని చిన్న పిల్లల వార్డులో చేర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం నీటి కోసం ఆస్పత్రి ఆవరణలోని వాటర్‌ప్లాంట్ వద్దకు ఇద్దరు బిడ్డలను తీసుకుని వచ్చింది. రద్దీ ఉండడంతో కాసేపటి తర్వాత బాటిల్లో నీరు పట్టుకుంది. ఆ తర్వాత కుమార్తె కన్పించకపోవడం కంగారు పడింది. వెంటనే వార్డు వద్దే ఉన్న తన తల్లి శాంతమ్మతో పాటు భర్త, కుటుంబ సభ్యులకు తెలిపింది. వారంతా గాలించారు. అర గంట వెతికినా కన్పించకపోవడంతో ఔట్‌పోస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బిడ్డ ఆస్పత్రి బయటకు వెళ్లిందేమోనని వీరనారప్ప వెతకసాగాడు. ఈ క్రమంలో శకుంతల కన్నీరు పెడుతుంటే ఆమె తల్లి శాంతమ్మ కూడా రోదించింది. విషయం తెలుసుకున్న సెక్యూరిటీ సూపర్వైజర్ ఇర్ఫాన్, గార్డులు జయచంద్ర, రఫీ, శీన ఆస్పత్రి ఆవరణతో పాటు, వార్డుల్లో గాలించారు. గంట తర్వాత గైనిక్ వార్డు వద్ద ఓ చిన్నారి ఒంటరిగా కన్పించడంతో తీసుకుని వచ్చారు. ఆ పాప తప్పిపోయిన చిన్నారేనని గుర్తించి శాంతమ్మకు అప్పగించారు. ఈ దృశ్యాన్ని క్యాజువాలిటీ సమీపంలోంచి గమనించిన శకుంతల పరుగున వచ్చి బిడ్డను హత్తుకుంది. సెక్యూరిటీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపింది. -
తెలంగాణా ఆస్పత్రిలో ఆంధ్రా శిశువు మాయం
విచారణ చేపట్టిన భద్రాచలం పోలీసులు నెల్లిపాక : తెలంగాణ రాష్ట్ర పరిధిలోని భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో ఆంధ్రా శిశువు మంగళవారం మాయమైంది. ఎటపాక మండలం గోళ్లగట్ట (భద్రాచలం సమీపంలో)కు చెందిన సోయం శాంతమ్మ 20 రోజుల మగ శిశువుతో తన పెద్దమ్మ కల్లూరి భద్రమ్మను తీసుకుని మంగళవారం ఉదయం భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. íజ్వరంగా ఉన్న పిల్లాడిని పిల్లల వార్డులో చేర్పించేందుకు వెళ్లగా కాన్పుకు సంబంధించిన కాగితాలు తీసుకురావాలని అక్కడున్న నర్సులు వారికి సూచించారు. ఇంట్లో మర్చిపోయిన కాగితాలు తెమ్మని భద్రాచలంలోని ఓ షాపులో పనిచేస్తున్న తన కొడుక్కి చెప్పేందుకు భద్రమ్మ బయటకు వెళ్లింది. తిరిగి వచ్చేసరికి తల్లి శాంతమ్మ చేతిలో బిడ్డ కనబడలేదు. బిడ్డ ఏదని అడిగితే ఎవరో ఒకామె తీసుకున్నదని సమాధానం చెప్పింది. దీంతో అమె కంగారుపడి ఆసుపత్రి అంతా వెతికినా లాభం లేకపోయింది. శాంతమ్మకు ఇదే మొదటి కానుపు. ఇదే ఆస్పత్రిలో పురుడు పోసుకుంది. విషయం తెలుసుకున్న ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డి ప్రసూతి వార్డును సందర్శించి అక్కడున్న మాయమైన శిశువు తల్లి, అమ్మమ్మలను విషయం అడిగి తెలుసుకున్నారు. ఆయనిచ్చిన సమాచారం మేరకు భద్రాచలం పట్టణ ఎస్సై కరుణాకర్ ఆస్పత్రికొచ్చి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు. కాగా ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. -
బాలుడి అదృశ్యం
పెద్దకడబూరు: కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం చిన్నతుంబలం గ్రామంలో మహేంద్ర (15) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. మంగళవారం ఉదయం గొర్రెలు కాయటానికి వెళ్లిన మహేంద్ర సాయంత్రమైనా ఇంటికి రాకపోవటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి సమీపాన ఉన్న చెరువు కట్టమీద బాలుడికి సంబంధించిన చెప్పులు, సైకిల్, అన్నం బాక్సు ఉన్నాయి. ప్రమాదవశాత్తూ చెరువులో పడి ఉంటాడేమోనని అనుమానిస్తున్నారు. బుధవారం ఉదయం నుంచి బాలుడి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు. -
ఛత్ పూజలో విషాదం
సూర్యభగవానుడికి మొక్కులు చెల్లించుకోవడానికి అందిరితో కలిసి యుమునా నదికి చేరుకొన్న ఓ యువతితోపాటు చిన్నారిని నది బలిగొన్నది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.ఘజియాబాద్: ఛత్ పూజలో విషాదం చోటు చేసుకొంది. ఇరువై ఏళ్ల యువతి గురువారం యమునా నదిలో ఛత్‌పూజలో భాగంగా పుణ్యస్నానమాచరిస్తూ వృత్యువాత పడింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్‌పార్కు కాలనీకి చెందిన దిలీప్ అతడి భార్య నీతు, జ్యోతి ఆమె తండ్రి జస్వంత్ కలిసి యమునా నది ఒడ్డున ఛత్ పూజల కోసం ఏర్పాటు చేసిన ఇలాచీపూర్ ఘాట్ నంబర్-33కి చేరుకొన్నారు. ఉదయం 6.00 గంటలకు నదిలోకి పుణ్యస్నానమాచరించేందుకు వెళ్లిన నీతు, జ్యోతి అదుపుతప్పి కొట్టుకొనిపోయారు. ఈ సమయంలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. ఇద్దరు గజ ఈతగాళ్లు రెండు గంటలపాటు శ్రమించి వృతదేహాలను వెలికి తీశారు. జ్యోతి 6వ తరగతి చదువుతోందని పోలీసులు తెలిపారు. ఉత్తర ఢిల్లీ పరిధిలోని బురారి పోలీసులు వృతదేహాలను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు