
ఘటనా స్థలంలో విచారణ చేస్తున్న నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సంతపేట ఇన్‌ప్పెక్టర్ అన్వర్‌బాషా
నెల్లూరు (వీఆర్సీసెంటర్): తల్లి ఒడిలో ఆడుకునే రెండేళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. జిల్లాలోని బుచ్చిరెడ్డిపాళెం గిరిజన కాలనీకి చెందిన రామయ్య, పాపమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరు బిడ్డలను వెంటబెట్టుకుని రోడ్ల వెంబడి చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి సెకండ్ షో సినిమా చూసి కుక్కలగుంట వద్ద ఉన్న మహాలక్ష్మి అమ్మవారి గుడి మెట్ల వద్ద పిల్లలతో కలిసి నిద్రించారు.
ఆదివారం తెల్లవారుజామున లేచి చూసే సరికి రెండేళ్ల మూగ బాలిక పాపమ్మ కనిపించలేదు. దీంతో చుట్టు పక్కల వెతికినా ఆచూకీ లభ్యంకాకపోవడంతో స్థానికుల సహకారంతో చిన్నబజారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్పందించిన నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఇన్‌చార్జి సీఐ అన్వర్‌బాషా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నాలుగు ప్రత్యేక టీమ్‌లు, మరో రెండు టెక్నికల్ టీమ్‌లను ఏర్పాటు చేసి ముమ్మరంగా గాలింపు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment