
( ఫైల్ ఫోటో )
సాక్షి, తిరుమల: ఇటీవల తిరుమల నడకమార్గంలో బాలిక లక్షిత.. చిరుత దాడిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ భక్తుల భద్రతపై అప్రమత్తమైంది. భక్తుల భద్రతపై ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. మరోవైపు.. తిరుమలలో చిరుతల వేట కొనసాగుతోంది.
కాగా, శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి తిరుమలకు ప్రత్యేక బృందాలు చేరుకున్నాయి. తిరుమలకు నడకదారిలో జంతువుల సంచారం కోసం 500 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మందితో కూడిన నిపుణుల బృందం కెమెరాలు ఏర్పాటుచేస్తోంది. అలాగే, వివిధ ప్రాంతాల్లో చిరుతల కోసం బోన్లు కూడా ఏర్పాటు చేశారు. మోకాళ్ల మెట్టు, 36వ మలుపు వద్ద బోన్లును అమర్చారు. అంతేకాకుండా నడకదారిలో అదనపు ఎల్‌ఈడీ లైటను అధికారులు ఏర్పాటుచేశారు.
ఇది కూడా చదవండి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. ప్రత్యేక దర్శనం ఎన్ని గంటలంటే?