Viral Video: Delhi Jal Board Officer Takes Bath In Yamuna Water - Sakshi
Sakshi News home page

యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్‌ చేసిన అధికారి

Published Sun, Oct 30 2022 3:52 PM | Last Updated on Sun, Oct 30 2022 4:27 PM

Viral Video: Delhi Jal Board Officer Takes Bath In Yamuna Water  - Sakshi

యుమునా నది విషపూరితం అంటూ బీజేపీ ఎంపీ పర్వేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఢిల్లీ జల్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ సంజయ్‌ శర్మతో వాదనకు దిగారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రసిద్ధి గాంచిన ఛత్‌ పూజ సందర్భంగా వేలమంది స్నానం చేసే యమునా నదిలో స్నానం చేసి చూపించగలవా అంటూ ఛాలెంజ్‌ విసిరారు. దీంతో ఢిల్లీ జల్‌ బోర్డు డైరెక్టర్‌ సంజయ్‌ శర్మ ఆదివారం ఉదయం ఛత్‌ పూజకు ముందు యమునా నీటిలో స్నానం చేశారు.

ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో...యమునా నది శుభ్రంగా సురక్షితంగా ఉందని చూపించారు. నది నీరు స్వచ్ఛమైనది, ప్రజలకు ఎలాంటి హాని కలిగించదన్నారు. బీజేపీ ఎంపి పర్వేష్‌ శర్మ నీటిలో విష రసాయనాలు చల్లారంటూ ఆరోపణలు చేశారు. అందుకే తాను అన్నమాట ప్రకారం స్నానం చేసి చూపించాను. నదిని శుద్ధి చేసే నిమిత్తం సంబంధిత అధికారుల అనుమతితో రసాయనాలను పిచికారి చేశాం. నీరు విషపూరితం కాదని నొక్కి చెప్పారు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది.

(చదవండి: ఎట్టకేలకు డ్రీమ్‌ గర్ల్‌తో వివాహం...మోదీ, యోగీలకు ఆహ్వానం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement