ఓ వ్యక్తి కాలేజ్ చదువు కూడా చదవకుండా కోట్లు గడిస్తున్నాడంటే నమ్ముతారా..!. ఏ వ్యాపారం చేసో అనుకుంటే పొరబడ్డట్లే. ఎందుకంటే..అతడు చక్కగా పెద్ద కార్పోరేట్ కంపెనీలో అప్రెంటీస్‌గా మొదలు పెట్టి..ఏకంగా కంపెనీ పార్ట్నర్‌గా పనిచేసే స్థాయికి చేరకున్నాడు. ఎలాంటి గ్రాడ్యుయేషన్ చదువులు చదవకుండా.. ఎలా అతడికి సాధ్యం అయ్యింది? అతడి సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..
యూకేకి చెందిన న్యూటన్(30) యూవివర్సిటి విద్య కూడా చదవలేదు. కానీ డెలాయిట్ కంపెనీలో పార్టనర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వార్షిక వేతనం సుమారుగా రూ. 10 కోట్లు పైనే ఉంటుందట. ఇదంతా ఎలా సాధ్యం అనే కదా..!. అతడి కెరీర్ జర్నీ 12 ఏళ్ల క్రితం డెలాయిట్ కంపెనీలో బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరడంతో మొదలయ్యింది. అలా కంపెనీ పార్ట్నర్‌గా పనిచేసే స్తాయికి ఎదిగిపోయాడు. అది కాలేజ్‌డ్రాపౌట్స్ కోసం ఏర్పాటు చేసిన డెలాయిట్ బ్రైట్ స్టార్ అప్రెంటీస్ ప్రోగ్రామ్ అతడి తలరాతనే మార్చిందని చెప్పొచ్చు.
నూటన్ పెరిగిందంతా డోరెట్స్‌లోనే. తన తండ్రి 16 ఏళ్ల వయసులో పాఠశాల చదువును విడిచిపెట్టి ఆర్మీలో చేరిపోయాడు. తన అమ్మ పబ్‌లోనూ, ట్రావెలింగ్ ఏజెన్సీలోనూ పనిచేసేది. దీంతో తల్లిదండ్రుల ప్రంపంచానికి దూరంగా పెరిగాడు న్యూటన్. ఆర్థిక పరిస్థితి వల్లే కదా తాను ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది అని భావించి సంపాదన మార్గాల గురించి తీవ్రంగా అన్వేషించడం ప్రారంభించేవాడు. తీరిక దొరికితే అందుకోసమే వెతికేవాడు. ఐతే అనుకోకుండా విశ్వవిధ్యాలయంలో గణితం అధ్యయనం చేసేందుకు సీటు లభించింది. ఇలా అతడి కుటుంబంలో విశ్వవిద్యాలయంలో సీటు పొందిన ఏకైక వ్యక్తి కూడా న్యూటనే.
కానీ అందులో చేరలేదు. సంపాదన మార్గాల మీదే అతడి ధ్యాసంతా. అందుకోసం రెండు మూడు చిన్నా చితకా ఉద్యోగాలు కూడా చేసేవాడు. అంతేగాదు స్కూల్ చదువుతో డబ్బులు వచ్చే స్కీములు ఏం ఉన్నాయా అని చూసేవాడు. ఆ కారణాల రీత్యా అతడు చదువాలనే దానిపై దృష్టి కేంద్రీకరించ లేదు. ఆ అన్వేషణలో భాగంగానే న్యూటన్ డెలాయిట్ బ్రైట్‌స్టార్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్‌లో చేరాడు. ఐతే ఇది విద్యార్థులు కళాశాలలో చేరి చదువుకునేలా చేసేందుకు ఏర్పాటు చేసిన ఉపాది మార్గం ఇది.
దీన్ని కాలేజ్ యూనివర్సిటీలే ఏర్పాటు చేశాయి. అయితే ఇదంతా న్యూటన్‌కి నచ్చక ఒకింత అసహనం అనిపించినా, డబ్బు సంపాదించే మార్గం దొరికిందన్న ఉద్దేశ్యంతో అందులో జాయిన్ అయ్యాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీ పార్ట్నర్‌గా క్వాలిఫైడ్ అకౌంటెంట్ అండ్ ఆడిటర్‌గా విధులు నిర్వర్తించే రేంజ్‌కి చేరాడు. నిజానికి డెలాయిట్ కంపెనీ రిక్రూట్‌మెంట్ కోసం ఈ బ్రైట్‌స్టార్ ప్రోగ్రామ్‌ని ఏర్పాటు చేసింది.
దీని ద్వారా విద్యార్థుల ఉపాది పొందుతూ కాలేజ్ చదువును చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. అంతేగాక ఈ ప్రోగ్రాం ద్వారా వారిలో దాగున్న టాంటెంట్ బయటకి వెలికితీస్తుంది. పైగా సామాజికంగా ఆర్థిక నేపథ్యం సరిగా లేని వ్యక్తులకు ఈ ప్రోగ్రాం ఒక గొప్ప వరం. అంతేగాదు కెరీర్‌లో మంచిగా సెటిల్ అవడానికి ఉపకరించే గొప్ప ఉపాధి మార్గం ఇది. ఇక్కడ న్యూటన్ సంపాదన ధ్యాస కళాశాలకు వెళ్లనీయకుండా చేసినా..ఉద్యోగంలో ఉన్నతంగా ఎదిగేలా చేసి ఈ స్థాయికి తీసుకురావడం విశేషం. ఇక్కడ డిగ్రీలు, పీహెచ్‌డీలు కాదు ముఖ్యం. సంపాదించాలనే కసి పట్టుదల అన్ని నేర్చుకునేలా, ఎదిగిలే చేస్తుందనడానికి న్యూటనే స్ఫూర్తి కదూ..!.
(చదవండి: ఆర్బీఐ మాజీ గవర్నర్‌కే పాఠాలు బోధించిన వ్యక్తి..కోట్ల ఆస్తులను..!)
Comments
Please login to add a commentAdd a comment