ఉద్యోగులు కరోనా మహమ్మారి భారీ నుంచి తప్పించుకున్నా.. లేఆఫ్స్ భారీ నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇప్పటికే లెక్కకుమించిన ఉద్యోగులను తొలగించిన దిగ్గజ కంపెనీలు ఇప్పటికి కూడా అదేపనిలో ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో డెలాయిట్ (Deloitte) 3శాతం ఉద్యోగులను తొలగిస్తూ నివేదికలు జారీ చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, మల్టి నేషనల్ ప్రొఫెషనల్ సర్వీస్ నెట్‌వర్క్ డెలాయిట్ 'యూకే' (UK)లో 800 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలిసింది. ఈ సంస్థలో అక్కడ మొత్తం 27,000మంది పనిచేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే కంపెనీ కొంత మందగమనంతో ముందుకు సాగుతున్న తరుణంలో ఖర్చులను తగ్గించుకోవడానికి కావలసిన ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీకి పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదని, రానున్న రోజుల్లో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రభావం టెక్ కంపెనీల మీద ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇదీ చదవండి: ఒక్క ఐడియా విలువ రూ.10 లక్షలు.. ట్రై చేసుకోండి!
ఇదిలా ఉండగా.. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ గణనీయమైన తొలగింపులను ప్రకటించి ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2023 జనవరిలో సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు గతంలో నివేదికలు వెల్లడించాయి. అమెజాన్ కంపెనీ కూడా ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దాదాపు 18,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ జాబితాలో మెటా, ట్విటర్ వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment