భారతదేశంలో ఉబర్ సర్వీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కస్టమర్లు ఎప్పుడు ఎక్కడికి వెళ్లాలన్న కారుని బుక్ చేసుకుని గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. ఇంతలా పాపులర్ అయిన ఉబర్ ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఉబర్ ప్రారంభమైనప్పటి నుంచి డ్రైవర్లు ఇప్పటి వరకు ఏకంగా 300 కోట్ల ట్రిప్పులు తిరిగి రూ. 50,000 కోట్లకు పైగా సంపాదించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మనషి నిత్యజీవితంలో ఒక భాగమైపోయిన రవాణాలో ఉబర్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుండటం చాలా గర్వంగా ఉందని ఉబెర్ ఇండియా ప్రెసిడెంట్ 'ప్రభ్‌జీత్ సింగ్' తెలిపారు.
ఇదీ చదవండి: నితిన్ గడ్కరీ ఆవిష్కరించిన ఫ్లెక్స్ ఫ్యూయెల్ కారు.. ఇది చాలా స్పెషల్!
భూమి నుంచి చంద్రునికి 86,000 సార్లు..
ఇప్పటి వరకు ఉబర్ ప్రయాణించిన దూరం 'భూమి నుంచి చంద్రునికి' దాదాపు 86,000 సార్లు ప్రయాణించడంతో సమానమని కంపెనీ చెబుతోంది. సుమారు 30 లక్షల మంది డ్రైవర్లు ఉబర్ ద్వారా డ్రైవర్ భాగస్వాములుగా ఉన్నారు. కంపెనీ భారతదేశం అంతటా 125 నగరాల్లో తమ కార్య కలాపాలను నిర్వహిస్తోంది.
ఆధునిక కాలంలో ఎక్కువ మంది ఇప్పుడు తమ గమ్యస్థానాలను ఉబర్ సర్వీస్ ద్వారా సురక్షితంగా చేరుకుంటున్నారు. చాలామంది ఉబర్ వినియోగించుకోవడానికి ప్రధాన కారణం కారు మెయింటెనెన్స్ & డ్రైవర్ జీతం నుంచి తప్పించుకోవడమే అని తెలుస్తోంది. ఈ సర్వీసుల వల్ల మరికొందరు సొంత వాహనాలు కొనుగోలు కూడా వాయిదా వేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment