భారతదేశంలో ఉబర్ డ్రైవర్ల సంఖ్య ఏకంగా 1 మిలియన్ (10 లక్షలు) కంటే ఎక్కువ ఉన్నట్లు సంస్థ సీఈఓ దారా ఖోస్రోషాహి ప్రకటించారు. ఈ ఏడాది మార్చి త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. 10 లక్షల డ్రైవర్ల మార్కును దాటిన అమెరిక, బ్రెజిల్ తర్వాత మూడో దేశంగా భారత్ నిలిచిందని ఆయన స్పష్టం చేశారు.
ఉబర్ సేవలు దేశంలో కొత్త ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. దీంతో మునుపటి కంటే డ్రైవర్ల సంఖ్య పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా సర్వీస్ భారీగా పెరిగిందని ఖోస్రోషాహి అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత మార్కెట్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.
బుకింగ్‌లు, లావాదేవీల పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. పెద్ద మార్కెట్లు నెమ్మదిగా వృద్ధి చెందుతున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వం ఓఎన్‌డీసీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్టు ఉబెర్ ప్రకటించింది. రాబోయే రోజుల్లో కంపెనీ మరింత వృద్ధి చెందుతుందని, డ్రైవర్ల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment