Snake Farming In China: మనిషి బతకాలంటే ఏదో ఒకటి చేయాలన్న విషయం అందరికి తెలుసు. మనదేశంలో వ్యవసాయం చేస్తూ ధాన్యం, పండ్లు, కూరగాయలు వంటివి విరివిగా పండిస్తారు. అంతే కాకుండా కోళ్లు, గొర్రెలు వంటివి పెంచడం ద్వారా కూడా ఆదాయం పొందుతారు. అయితే చైనాలో ఇందుకు భిన్నంగా పాములను పెంచి కోట్లలో సంపాదిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, చైనాలోని జిసికియావో గ్రామంలో పాములను పెంచి ఏడాదికి కోట్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ గ్రామం స్నేక్ విలేజ్‌గా మారిపోయింది. ఇక్కడ ప్రతి వ్యక్తి సుమారు 30వేలకంటే ఎక్కువ పాములను పెంచుతారని చెబుతారు. పిల్లలు కూడా బొమ్మలకి బదులు పాములతోనే ఆడుకుంటారు.
నిజానికి పాములను పెంచుతున్నారు కదా? ఇవన్నీ విషరహితమైనవనుకుంటే పొరపాటే. ఎందుకంటే వీటిలో చాలావరకు ఎక్కువ విషం ఉన్న పాములు కూడా ఉన్నాయని తెలుస్తోంది. పాముల మాంసంతో పాటు వాటి శరీర భాగాలను కూడా అమ్ముతూ బాగా డబ్బు సంపాదిస్తున్నారు. ఒక లీటరు విషం ఏకంగా రూ. 3.5 కోట్లు వరకు ఉంటుంది.
ఇదీ చదవండి: మానవాద్భుత సృష్టి.. వీడియో చూసి ఫిదా అవుతున్న నెటిజన్లు!
మన దేశంలో పనీర్ మాదిరిగా చైనాలో పాముల మాంసం తింటారు. అంతే కాకుండా క్యాన్సర్ సంబంధిత మందుల తయారీకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి. కావున పాములను చెక్క పెట్టెలు లేదా గాజు పెట్టెలలో పెంచుతారు. ఇవి పెద్దవైన తరువాత విషం సేకరిస్తారు. ఆ తరువాత వంటలు చేసుకోవడానికి ఉపయోగిస్తారు. పాము చర్మం ఖరీదైన బెల్టులు, ఇతర వస్తువుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment