దియా మీర్జా బాలీవుడ్‌లో పరిచయం అక్కర్లేనిపేరు. బాలీవుడ్‌లోని అత్యంత గ్లామర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ ఫెమినా మిస్ ఇండియా-2000 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత రెహనా హై టెర్రే దిల్ మే (2001) చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం సూపర్‌హిట్ కావడంతో సూపర్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత దస్, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి చిత్రాలలో నటించింది . ఆమె 2019లో కాఫిర్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. తన ప్రతిభ ఆధారంగానే గుర్తింపు సాధించిన దియా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం.
(ఇది చదవండి: మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే!)
మిస్ ఆసియా పసిఫిక్‌గా నిలిచిన దియా మీర్జా తల్లి బెంగాలీ కాగా, ఆమె తండ్రి జర్మనీకి చెందినవారు. అయితే దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జాను వివాహం చేసుకుంది. దియా ఇప్పటికీ తన సవతి తండ్రి పేరునే ఇంటిపేరుగా పరిగణిస్తోంది. ఇటీవల ఐఫా-2023 అవార్డుల సందర్భంగా తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఐదేళ్ల వయసులోనే..
దియా ఐదేళ్ల వయసులో ఉండగానే తన తండ్రిపై కోపాన్ని పెంచుకుంది. ఐదేళ్లు ఉన్నప్పుడు ఆమెను తండ్రి తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయి తన బంధువుల వద్దకు వెళ్లింది. ఆ తర్వాత దియా మీర్జా ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు కేవలం రూ. 5,000 మాత్రమే తీసుకునేదట.
(ఇది చదవండి: నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాని టాలీవుడ్ మూవీస్.. అసలు కారణాలేంటి?)
తొలిచిత్రమే రూ.100 కోట్లు
దియా మీర్జా 2001లో 'రెహ్నా హై తేరే దిల్ మే' చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ ఆర్ మాధవన్ సరసన నటించింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం బాలీవుడ్‌లోని అత్యుత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో దియా మీర్జా ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది. దియా మీర్జా దీవానాపన్, తుమ్కో నా భూల్ పాయేంగే, దమ్, పరిణీత, లగే రహో మున్నాభాయ్, సంజు వంటి చిత్రాలలో కనిపించింది. అయితే దియా వ్యక్తిగత జీవితంలో మాత్రం తన మొదటి భర్త సాహిల్ సంఘితో విడిపోయిన తర్వాత.. ఆమె వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment