Diya Mirza
-
నెలకు రూ.5 వేల జీతం.. తొలి చిత్రంతోనే రూ.100 కోట్లు!
దియా మీర్జా బాలీవుడ్లో పరిచయం అక్కర్లేనిపేరు. బాలీవుడ్‌లోని అత్యంత గ్లామర్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ముద్దుగుమ్మ ఫెమినా మిస్ ఇండియా-2000 టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత రెహనా హై టెర్రే దిల్ మే (2001) చిత్రంతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రం సూపర్‌హిట్ కావడంతో సూపర్ స్టార్‌గా ఎదిగింది. ఆ తర్వాత దస్, లగే రహో మున్నా భాయ్, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి చిత్రాలలో నటించింది . ఆమె 2019లో కాఫిర్ అనే వెబ్ సిరీస్‌లో కూడా నటించింది. తన ప్రతిభ ఆధారంగానే గుర్తింపు సాధించిన దియా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. అదేంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: మెగాస్టార్ మూవీ రివ్యూ.. అందరికంటే ముందుగానే!) మిస్ ఆసియా పసిఫిక్‌గా నిలిచిన దియా మీర్జా తల్లి బెంగాలీ కాగా, ఆమె తండ్రి జర్మనీకి చెందినవారు. అయితే దియా పుట్టిన తర్వాత ఆమె తల్లి తన భర్త నుంచి విడిపోయింది. ఆ తర్వాత ఆమె తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జాను వివాహం చేసుకుంది. దియా ఇప్పటికీ తన సవతి తండ్రి పేరునే ఇంటిపేరుగా పరిగణిస్తోంది. ఇటీవల ఐఫా-2023 అవార్డుల సందర్భంగా తన లుక్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఐదేళ్ల వయసులోనే.. దియా ఐదేళ్ల వయసులో ఉండగానే తన తండ్రిపై కోపాన్ని పెంచుకుంది. ఐదేళ్లు ఉన్నప్పుడు ఆమెను తండ్రి తిట్టడంతో ఇంటి నుంచి పారిపోయి తన బంధువుల వద్దకు వెళ్లింది. ఆ తర్వాత దియా మీర్జా ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసింది. అప్పుడు ఆమె జీతం నెలకు కేవలం రూ. 5,000 మాత్రమే తీసుకునేదట. (ఇది చదవండి: నెలలు గడుస్తున్నా ఓటీటీకి రాని టాలీవుడ్ మూవీస్.. అసలు కారణాలేంటి?) తొలిచిత్రమే రూ.100 కోట్లు దియా మీర్జా 2001లో 'రెహ్నా హై తేరే దిల్ మే' చిత్రంలో నేషనల్ అవార్డ్ విన్నింగ్ స్టార్ ఆర్ మాధవన్ సరసన నటించింది. ఈ చిత్రం సూపర్‌హిట్‌గా నిలిచి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ చిత్రం బాలీవుడ్‌లోని అత్యుత్తమ రొమాంటిక్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో దియా మీర్జా ఓ సాధారణ అమ్మాయి పాత్రలో నటించింది. దియా మీర్జా దీవానాపన్, తుమ్కో నా భూల్ పాయేంగే, దమ్, పరిణీత, లగే రహో మున్నాభాయ్, సంజు వంటి చిత్రాలలో కనిపించింది. అయితే దియా వ్యక్తిగత జీవితంలో మాత్రం తన మొదటి భర్త సాహిల్ సంఘితో విడిపోయిన తర్వాత.. ఆమె వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. -
ఆ వయసు వరకే అవకాశాలు.. ఆ తర్వాత కష్టమే: దియా మీర్జా
బాలీవుడ్ నటి, మాజీ మిస్ ఇండియా దియా మీర్జా పరిచయం అక్కర్లేని పేరు. మోడల్, నటి, నిర్మాతగా రాణించింది. మిస్ ఆసియా పసిఫిక్ 2000 టైటిల్‌ను కూడా గెలిచింది. పుట్టి పెరిగింది హైదరాబాద్‌లో అయినా.. దియా మీర్జా ఎక్కువగా బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. రహ్నా హై తేరే దిల్ మే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బాలీవుడ్ నటి దియా మీర్జా మాట్లాడుతూ.. 'వయసు పెరిగేకొద్దీ అవకాశాలు వస్తాయని భావించట్లేదు. 40 ఏళ్లు దాటిన తర్వాత ఉత్తమమైన పాత్రలు పోషిస్తానని నేను ఎప్పుడూ అనుకోను. యంగ్‌గా ఉన్నప్పుడే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇది ఒక చిన్న జీవితమని గ్రహించాలి. కాలం ఎప్పుడు పరిగెడుతూనే ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.' అని అన్నారు. కాగా.. 2019లో నిర్మాత సాహిల్ సంఘాను దియా మీర్జా పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఐదేళ్లకే విడాకులిచ్చింది. ఫిబ్రవరి 15, 2021లో వ్యాపారవేత్త వైభవ్ రేఖీని రెండో పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఓ అబ్బాయి జన్మించారు. దియా చివరిసారిగా భీఢ్ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ధక్ ధక్ చిత్రంలో నటిస్తున్నారు. తరుణ్ దూదేజా దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహిస్తున్న షారుఖ్ ఖాన్-స్టార్ డుంకీలో దియా కనిపించనుంది. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న లవ్ బర్డ్స్ వీళ్లే..
Top Celebrities Weddings In 2021: See Which Stars Tied The Knot: అప్పటి వరకు సోలో లైఫే సో బెటర్ అన్నవాళ్లు సైతం ఈ ఏడాది పెళ్లి పీటలు ఎక్కారు. కొంతమంది డెస్టినేషన్ వివాహం చేసుకుంటే, మరికొందరేమో ఎవరికీ తెలియకుండా సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. మొత్తంగా ఈ ఏడాది 2021లో పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలపై మీరూ ఓ లుక్కేయండి. ప్రముఖ గాయని, డబ్బింగ్ అర్టిస్ట్ సునీత ఈ ఏడాది జనవరి9న వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని పెళ్లాడింది. అప్పట్లో వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. హీరోయిన్ ప్రణీత సుభాష్ వివాహం మే31న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో జరిగింది. . ‘అత్తారింటికి దారేదీ’సినిమాతో గుర్తింపు పొందిన ప్రణీత అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ హీరోయిన్ యామి గౌతమ్ ఈ ఏడాది జూన్4న వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ‘ఉరి:ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్‌తో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ఈ ఏడాది జనవరి14న ఓ ఇంటి వాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌తో ముంబైలోని ఓ ప్రముఖ రిసార్ట్‌లో వీరి పెళ్లి జరిగింది. దాదాపు 11సంవత్సరాల రిలేషన్ అనంతరం బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ తన ప్రియురాలు పత్రలేఖను నవంబర్15న పెళ్లాడాడు. తెలుగమ్మాయి ఆనంది కోలీవుడ్‌కు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌ను పెళ్లాడింది. ‘బస్టాప్, ప్రియతమా నీవచట కుశలమా, గ్రీన్ సిగ్నల్’ వంటి చిత్రాలలో టాలీవుడ్లో గుర్తింపు పొందిన ఈ భామ తమిళంలో బిజీ హీరోయిన్గా పేరు సంపాదించింది. ఈ ఏడాది తెలుగులో ‘జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాలతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా వివాహం వివాహం ఫిబ్రవరి 15న వ్యాపారవేత్త వైభవ్ రేఖీతో జరిగింది. ‘చెలి’ హిందీ రీమేక్ ‘రెహనా హై తేరే దిల్ మే’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దియా మీర్జా గతంలో సహిల్ సంఘా ను వివాహం చేసుకుంది. 11 సంవత్సరాల తర్వాత వారు 2019లో విడాకులు తీసుకున్నారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్‌ను హైదరాబాద్‌లో ఏప్రిల్ 22న వివాహం చేసుకుంది. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది ఓ ఇంటి వాడయ్యాడు. ప్రియురాలు లోహిత రెడ్డితో నవంబర్ 21న హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. బాలీవుడ్ కత్రినా కైఫ్, వీక్కీ కౌశల్ ఈ ఏడాది పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. నవంబర్ 9న మూడుమూళ్ల సాక్షిగా ఏడడుగులు వేసి అధికారికంగా భార్యభర్తలు అయిపోయారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని విలాసవంతమైన హోటల్లో అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిగింది. -
గుడ్‌న్యూస్ పంచుకున్న ‘వైల్డ్ డాగ్’ నటి
సాక్షి,ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా ఒక తీపికబురు తన ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోముంబైకి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకున్న దియా తను తల్లి కాబోతున్నానన్న విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ సందర్భంగా అద్భుతమైన ఫోటోను గురువారం ఇన్‌స్టాలో షేర్ చేశారు. భర్త వైభవ్ రేఖీతో కలిసి మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఆమె తన ప్రెగ్నెన్సీ కబురును అందించారు. అందమైన సూర్యాస్తమయంలో కడుపులోని బిడ్డను అదుముకుంటూ, తల్లి కాబోతున్న అనుభూతిని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక భావోద్వేగ కవిత పోస్ట్ చేశారు. దీంతో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, షిబాని దండేకర్, తాహిరా కశ్యప్, మహీప్ కపూర్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా తదితరులతోపాటు అభిమానులనుంచి కూడా దియాకు అభినందనల వెల్లువ కురుస్తోంది. ఇప్పటికే మిలియన్ల లైక్‌లను ఈ పోస్ట్ సొంతం చేసుకోవడం విశేషం. కాగా మొదటి భర్త సాహిల్ సంఘాతో 11 సంవత్సరాల వివాహం బంధానికి స్వస్తి చెప్పి 2019 లో విడిపోయారు దియా. అనంతరం బిజినెస్మే న్ వైభవ్ రేఖీని ఈ ఏడాది ఫిబ్రవరి 15 న వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన దియా ఈ ఫోలోను షేర్ చేశారు. తాజాగా ‘వైల్డ్ డాగ్’ సినిమాతో అక్కినేని నాగర్జునకు జోడీగా దియా మీర్జా నటించిన సంగతి తెలిసిందే. (అత్యున్నత పురస్కారం: తలైవా భావోద్వేగం) View this post on Instagram A post shared by Dia Mirza (@diamirzaofficial) -
'వైల్డ్ డాగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
విజయ్ వర్మ .. ఆన్ మిషన్
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆఫీసర్ విజయ్ వర్మ తన టీమ్‌తో ఏదో మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం మనాలీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. 20 రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అక్కడి రోహ్తంగ్ పాస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ ఆరంభమై ఇప్పటికి వారం అవుతోంది. -
మిషన్ థాయ్‌ల్యాండ్
‘వైల్డ్ డాగ్’ కోసం ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా మారారు నాగార్జున. ఇందులో ఆయన చేయబోయే మిషన్లు సినిమాకు హైలెట్ అని తెలిసింది. తాజాగా థాయ్‌ల్యాండ్‌లో ఓ మిషన్ చేపట్టనున్నారని సమాచారం. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మిర్జా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత తెలుగులో చిత్రీకరణ ప్రారంభించిన పెద్ద సినిమా ఇదే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేస్తున్నారు. మార్చ్‌లోనే జరగాల్సిన షెడ్యూల్ ఇది. కరోనా వల్ల వాయిదా పడింది. అప్పుడు వాయిదా పడిన ఈ షెడ్యూల్‌ను అనుకున్నట్టుగానే పూర్తి చేయాలన్నది తాజా ప్లాన్. ఈ నెలాఖర్లో థాయ్‌ల్యాండ్ ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను
‘‘నేను నిన్ను ప్రేమించాను.. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాను.. ఇప్పుడే కాదు.. నిన్ను ఎప్పటికీ ఎక్కువగా ప్రేమిస్తాను... నా ప్రియమైన సినిమా’’ అంటున్నారు విద్యాబాలన్. ఎన్నో సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్న ఆమె ఇప్పుడు సినిమా మీద తనుకున్న ప్రేమను చెప్పడానికి ఓ కారణం ఉంది. ‘పరిణీత’తో విద్యాబాలన్ హిందీ తెరకు పరిచయమై జూన్ 10తో 15 ఏళ్లయింది. ఈ విషయాన్ని ప్రస్తావించి, సినిమా మీద తనకున్న ప్రేమ గురించి కూడా చెప్పారామె. సంజయ్ దత్, సైఫ్ అలీఖాన్, రైమా సేన్, దియా మీర్జా, విద్యాబాలన్ తదితరులు నటించిన ‘పరిణీత’ విద్యాకి మంచి పేరు తెచ్చింది. బెంగాలీ మహిళగా ఆ చిత్రంలో చక్కగా నటించారు విద్యాబాలన్. నటిగా 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ‘పరిణీత’ షూటింగ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఓ వీడియో షేర్ చేశారు. ‘‘ప్రపంచానికి తెలియక ముందే శేఖర్‌లో లోలిత సగభాగం అయింది. (‘పరిణీత’ చిత్రంలో విద్య, సైఫ్ అలీ పాత్రల పేర్లు). నువ్వు కూడా నా రియల్ లైఫ్ శేఖర్ అయిపోయావు (సినిమా తనలో సగభాగం అనేది విద్యా ఉద్దేశం). ఇంకో విషయం ఏంటంటే.. నా భర్త సిద్ధార్థ్‌రాయ్ కపూర్ యూటీవీలో చేరిన తర్వాత పని చేసిన మొదటి చిత్రం ఇది. మా ఇద్దరి తొలి చిత్రం ‘పరిణీత’ కావడం విశేషం’’ అన్నారామె. -
కోబ్ మరణం: కన్నీళ్లు పెట్టుకున్న దియా మీర్జా
-
ఆయన మరణం కలచివేసింది: దియా మీర్జా
జైపూర్: కన్నీళ్లు కార్చేందుకు భయపడాల్సిన అవసరం లేదని.. బాధను ధైర్యంగా వ్యక్తపరచాలని బాలీవుడ్ భామ దియా మీర్జా అన్నారు. తనివితీరా ఏడ్వటం వల్ల మనసుకు ఉపశమనం కలుగుతుందని పేర్కొన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్‌లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్‌కు సోమవారం ఆమె హాజరయ్యారు. వాతావరణ మార్పు అంశంపై చర్చ సందర్భంగా దియా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ మరణవార్త తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి గురయ్యారు. ‘‘జనవరి 26.. దాదాపు ఉదయం 3 గంటల సమయంలో నా అభిమాన ఎన్బీఏ ఆటగాడు దుర్మరణం పాలయ్యాడనే వార్తకు సంబంధించిన అలెర్ట్‌తో రోజు ప్రారంభమైంది. కాలిఫోర్నియాలో ఆయన విమానం కుప్పకూలిందనే వార్త నన్ను తీవ్ర వేదనకు గురిచేసింది. పూర్తి నిరాశలో కూరుకుపోయాను. బీపీ లెవెల్స్ పడిపోయాయి. మన రోజువారీ జీవితంలో ఇలాంటి ప్రమాదాలు, వివిధ విషయాలు మనల్ని అగాథంలోకి నెట్టేస్తాయి. అయితే మనం మనోనిబ్బరంతో ఉండాలి. అంతేకాదు ఎదుటివారి బాధను మన బాధగా భావించి వారికి అండగా ఉండాలి. వారి స్థానంలో మనల్ని ఊహించుకుని అండగా నిలబడాలి. కన్నీళ్లు కార్చేందుకు ఏమాత్రం వెనుకాడకూడదు’’ అంటూ దియా మీర్జా ఉద్వేగానికి లోనయ్యారు. ఇది నటన కాదని.. ఇలా కన్నీళ్లు కార్చడం ద్వారా భారం తగ్గినట్లుగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు.(కోబ్ బ్రయాంట్ దుర్మరణం.. శోకసంద్రంలో అమెరికా) కాగా అమెరికా లెజండరీ బాస్కెట్‌బాల్ ప్లేయర్, కోచ్ కోబ్ బ్రియాంట్ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన విషయం విదితమే. ఈ ఘటనలో బ్రియాంట్ కుమార్తె గియానా కూడా మృత్యువాత పడింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ విషాదకర ఘటనపై క్రీడాలోకం సహా పలువురు ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
ఖేర్‌తో కేర్‌ఫుల్
సయామీ ఖేర్‌తో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఆమె చాలా డేర్ అండ్ డాషింగ్. మరి.. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నవాళ్లకు ఆ మాత్రం దమ్ము ధైర్యం ఉంటాయి కదా. ఇంతకీ సయామీ ఈ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకున్నారంటే ‘వైల్డ్‌డాగ్’ సినిమా కోసం. 2015లో ‘రేయ్’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ చాలాకాలం తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ఇది. ఇందులో నాగార్జున ఎన్.ఐ.ఏ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన సరసన ఓ హీరోయిన్గా దియా మిర్జా నటిస్తుండగా మరో హీరోయిన్గా సయామీని తీసుకున్నారు. ఈ చిత్రంలో సయామీ పై హై యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించనున్నారట. దీనికోసం ఇప్పటికే ఆమె ముంబైలో శిక్షణ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సయామీ మాట్లాడుతూ– ‘‘ప్రెస్టేజియస్ చిత్రంలో భాగం కావడంతో పాటు నాగార్జునగారితో కలిసి నటించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను’’ అన్నారు. పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి అహిషోర్ సల్మాన్ దర్శకత్వం వహిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. -
విడిపోయి కలిసుంటాం: దియా మీర్జా
ముంబై: బాలీవుడ్ నటి దియామీర్జా సోషల్ మీడియా వేదికగా అసక్తికర ట్వీట్ చేసింది. మాజీ భర్త సాహిల్‌సంగాతో కలిసిన ఉన్న ఫోటోను షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గత వారం వీరు విడిపోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటించి అందరిని షాక్‌కు గురి చేసిన విషయం విదితమే. 2014లో వీరికి వివాహమైన విషయం తెలిసిందే. దియా, సాహిల్ విడిపోయిన తరువాత మొదటిసారి కలుసుకోవడం విశేషం. వారిద్దరు వేర్వేరు కార్లలో ముంబై నగరంలో కలుసుకున్నారు, అయితే తమ బంధం గురించి వారు స్పందిస్తూ మేము విడిపోయినా ఎప్పటికీ స్నేహితులుగా కలిసే ఉంటామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదకొండేళ్లుగా కలిసున్నామని మా ఇద్దరి ప్రయాణాలు వేరవడంతో విడిపోయామని వారు అన్నారు. ఎప్పటికి ప్రేమ, అనురాగాలతో పరస్పరం సహకరించుకుంటామని వారు పేర్కొన్నారు. -
ఆమె వల్ల మేం విడిపోలేదు: దియామిర్జా
సాక్షి, ముంబై: తన భర్త సాహిల్ సంగాతో విడాకులు తీసుకోవడానికి తమ మధ్య మూడో మనిషి కారణం కాదని నటి దియామీర్జా తెలిపింది. ఈ మేరకు మీడియాలో వస్తున్న వార్తలను ఆమె ట్విటర్ ద్వారా ఖండించింది. దాదాపు ఐదేళ్లు దంపతులుగా ఉన్న దియా- సాహిల్‌లు తాము ప్రయాణిస్తున్న దారులు వేర్వేరని, అందుకే విడిపోతున్నట్టు గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విడాకులకి కారణం వీరి మధ్య మూడో మనిషి ఉండటమేనని స్థానిక పత్రిక ఒకటి కథనం ప్రచురించింది. దియా భర్తకు ఇటీవల విడుదలైన కంగనా రనౌత్ సినిమా జడ్జిమెంటల్ హై క్యా?కు రచయిత్రిగా పని చేసిన కనికా ధిల్లాన్‌తో సంబంధం ఉన్నట్లు ఇందులో రాసింది. ఈ వార్తతో మనస్తాపానికి గురైన దియా ఇవి నిరాధారమైనవని కొట్టిపారేసింది. అంతేకాక, కనికా ధిల్లాన్‌కు సారీ చెప్తూ ట్వీట్ చేసింది. మరోవైపు కనికా స్పందిస్తూ.. ఇలాంటి సంబంధం లేని వార్తలను ఎలా రాస్తారంటూ ఆ పత్రికపై మండిపడింది. తన జీవితంలో ఇంతవరకు సాహిల్‌ను గానీ, దియాను గానీ కలవలేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేసింది. కనికా ధిల్లాన్ దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు కోడలు. ఆయన కొడుకు ప్రకాశ్ కోవెలమూడితో వీరి వివాహం 2014లో జరిగింది. అయితే వీరు రెండేళ్ల కిందటే విడిపోయారని ఇండియా టుడేలో వార్త వచ్చింది. ఈ విషయాన్ని వీరు ధృవీకరించకపోయినా జరుగుతున్న పరిణామాలు అవుననే అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్త రావడం గమనార్హం. చదవండి: విడాకులు తీసుకున్న దర్శకేంద్రుడి కుమారుడు!? -
సినిమా ఒక మత్తు మందు లాంటింది:దియా మీర్జా
న్యూఢిల్లీ: సినిమాలు తీయడం మత్తుమందు వంటిది. ఒకసారి ఇందులోకి దూకామంటే బయటికి రావడం కష్టమని బాబీ జసూస్ సినిమా నిర్మాత దియామీర్జా తెలిపింది. త్వరలో విడుదలయ్యే ఈ చిత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుందని ఈ చిత్ర నిర్మాత, హైదరాబాదీ బ్యూటీ మీర్జా హామీ ఇస్తోంది. సాధారణంగా మహిళల ఆధారిత సినిమాల్లో హాస్యం తక్కువగా ఉంటుందని, ఇప్పుడు వినోదాత్మక సినిమాలు కూడా వస్తున్నాయని చెప్పింది. ‘మన సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఉంటుంది కానీ కథలో వాళ్ల ప్రమేయం తక్కువ. గ్లామర్‌పైనే ఎక్కువగా ఆధారపడుతారు. మా బాబీ జసూస్ గూఢచారి సినిమా. ఎప్పుడూ పురుషులే నటించే డిటెక్టివ్ పాత్ర ఇందులో విద్యాబాలన్ చేసింది’ అని దియా వివరించింది. ఈ సినిమాలో గడ్డం, చింపిరి జట్టుతో మగ బిచ్చగాడిలా విద్యాబాలన్ కనిపిస్తున్న ప్రచారం ఫొటోలు గతవారం విడుదలై చాలా మంది దృష్టిని ఆకర్షించాయి. ఇక సినిమా విజయంపై దియా ఎంతో ధీమాగా ఉంది. ఇది పురుషులతోపాటు మహిళలనూ ఆకట్టుకుంటుందని, కుటుంబ సభ్యులంతా కలిసి చూడవచ్చని నమ్మకంగా చెబుతోంది. సమర్ షేక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దియాకు చెందిన బార్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. నిర్మాతను అయిన తరువాత నటనకు కొంచెం దూరం కావడం బాధగానే అనిపిస్తోంది. సినిమాను నిర్మించడమనేది చాలా పెద్ద బాధ్యత’ అని ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. ఢిల్లీలో శుక్రవారం రాత్రి జరిగిన లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రముఖ డిజైనర్ అనితా డోంగ్రే వస్త్రాలతో దియా వేదికపై మెరిసింది. -
నిర్మాతను మాత్రమే : దియా మీర్జా
ముంబై: హైదరాబాదీ అందగత్తె దియా మీర్జా కెమెరా నుంచి కాస్త పక్కకు జరిగి నిర్మాత అవతారం ఎత్తింది. బాబీ జాసూస్ అనే సినిమాను స్వయంగా నిర్మిస్తున్నా అందులో మాత్రం నటించనందుకు బాధేమీ లేదని చెప్పింది. విద్యాబాలన్ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. దియా తన ప్రియుడు సాహిల్ సంఘాతో కలిసి బార్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణసంస్థను నిర్వహిస్తోంది. ఇది తొలిసారిగా 2011లో ‘లవ్ బ్రేకప్స్ జిందగీ’ సినిమాను నిర్మిం చింది. బాబీ జాసూస్‌లో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్నపై స్పందిస్తూ ‘నేను స్వార్థపరురాలిని కాదు. ఎందుకు నటించడం లేదో నాకే తెలియదు. నాకు తెలిసిందల్లా నేను ఈ సినిమాను నిర్మిస్తున్నానని మాత్రమే. ఇది నా సొంత సినిమా కాబట్టి ఇందులో నన్ను కూడా చూసుకోవాలనే కోరికేదీ లేదు. పాత్రల కోసం బార్న్‌ఫ్రీ ఎంటర్టైన్మెంట్ను స్థాపించలేదు. నిర్మాతను అయిన తరువాత సంకుచిత దృక్పథాన్ని వదిలేయాలి. నా ఆకాంక్షలను మరోమెట్టుకు ఎక్కించాలన్నదే నా ఆశ’ అని దియా వివరించింది. నటి అయితే కాసేపు కెమెరా ముందు కనిపించి వెళ్లిపోవాల్సి ఉంటుందని, నిర్మాత అయితే ఎన్నో పనులు చేయవచ్చని ఈ బ్యూటీ వివరించింది. సినిమా అంటే తనకు వ్యామోహం ఉంది కాబట్టి దానిని నటిగా, నిర్మాతగా ఉపయోగించుకుంటున్నానని చెప్పింది. అంతేకాదు మెగాఫోన్ పట్టుకోవడానికి కూడా ఈ అమ్మడు తయారవుతోంది. ‘తప్పకుండా దర్శకురాలిగా మారుతాను. అది ఎప్పుడు అనేది చెప్పలేను గానీ.. మంచి కథ దొరకాలి’ అని చెప్పిన దియా బాబీ జసూస్ పాత్రకు విద్యను మినహా వేరేవరూ సరిపోరని స్పష్టం చేసింది. ఈ సినిమాను ఆమె అంగీకరించడానికి చాలా సమయం తీసుకుంటుందని దియా అనుకున్నా.. కేవలం నెలలోపే విద్య ఓకే చెప్పింది.