మిషన్‌ థాయ్‌ల్యాండ్‌ | Nagarjuna Wild Dog next shoot plans in Thailand | Sakshi
Sakshi News home page

మిషన్‌ థాయ్‌ల్యాండ్‌

Published Mon, Oct 5 2020 12:51 AM | Last Updated on Mon, Oct 5 2020 3:02 AM

Nagarjuna Wild Dog next shoot plans in Thailand - Sakshi

‘వైల్డ్‌ డాగ్‌’ కోసం ఎన్‌ఐఏ ఆఫీసర్‌ విజయ్‌ వర్మగా మారారు నాగార్జున. ఇందులో ఆయన చేయబోయే మిషన్‌లు సినిమాకు హైలెట్‌ అని తెలిసింది. తాజాగా థాయ్‌ల్యాండ్‌లో ఓ మిషన్‌ చేపట్టనున్నారని సమాచారం. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’. నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మిర్జా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

లాక్‌డౌన్‌ తర్వాత తెలుగులో చిత్రీకరణ ప్రారంభించిన పెద్ద సినిమా ఇదే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్‌ చేస్తున్నారు. మార్చ్‌లోనే జరగాల్సిన షెడ్యూల్‌ ఇది. కరోనా వల్ల వాయిదా పడింది. అప్పుడు వాయిదా పడిన ఈ షెడ్యూల్‌ను అనుకున్నట్టుగానే పూర్తి చేయాలన్నది తాజా ప్లాన్‌. ఈ నెలాఖర్లో థాయ్‌ల్యాండ్‌ ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement