‘‘నా కెరీర్‌లో కొన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి కావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టింది. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇతర భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను. ఈ కారణంగా తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను’’ అన్నారు హీరోయిన్ సయామీ ఖేర్. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్ చెప్పిన విశేషాలు...
► ‘వైల్డ్ డాగ్’లో నేను ఆర్యా పండిట్ అనే ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తాను. ‘రా’ ఏజెంట్ అయిన నేను నాగ్ సార్ లీడ్ చేస్తున్న ‘ఎన్‌ఐఏ’ టీమ్‌లో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
► నాగార్జున ‘శివ’ సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు. కానీ ఆయన సినిమాల్లో నా ఫేవరెట్ ‘గీతాంజలి’ మూవీ. అంత పెద్ద స్టార్‌తో కలిసి నటించేందుకు నేను మొదట నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన సెట్‌లో సరదాగా ఉంటారు. ఓ సారి నాగ్ సార్ ఇంటి నుంచి బిర్యానీ తెస్తే, ఓ పట్టుపట్టాను.
► సాధారణంగా హీరోయిన్ పాత్రలకు పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. కానీ ఈ సినిమాలో నాకు చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. నాగ్ సార్‌తోనూ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఫిట్‌గా ఉంటాను. ఆ ఫిట్‌నెస్ నాకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చేసేందుకు ఉపయోగపడింది. ఈ సినిమా కోసం మార్షల్స్ ఆర్ట్స్‌లో నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను.
► ప్రతి యాక్టర్‌కూ కొందరితో వర్క్ చేయాలని ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్ నా ఫేవరెట్స్. వారితో సినిమాలు చేయాలని ఉంది. అలాగే డైరెక్టర్స్‌లో మణిరత్నం, రాజమౌళిగారు అంటే నాకు ఇష్టం. ప్రస్తుతం రెండు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను.
Comments
Please login to add a commentAdd a comment