ఆయనకు ఫ్యాన్‌ అయిపోయా! | Saiyami Kher Now A Fan Of Nagarjuna Akkineni | Sakshi
Sakshi News home page

ఆయనకు ఫ్యాన్‌ అయిపోయా!

Published Fri, Dec 18 2020 6:10 AM | Last Updated on Fri, Dec 18 2020 6:10 AM

Saiyami Kher Now A Fan Of Nagarjuna Akkineni - Sakshi

‘రేయ్‌’ (2015) సినిమాతో తెలుగుకి పరిచయం అయ్యారు బాలీవుడ్‌ బ్యూటీ సయామీ ఖేర్‌. ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత నాగార్జున ‘వైల్డ్‌ డాగ్‌’లో నటించారామె. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా నటించారు సయామీ. అహిషోర్‌ సోల్మాన్‌ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. నాగార్జున యన్‌ఐఏ (నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ) ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్‌ కథానాయికలు. ఈ సినిమాలో నటించడం గురించి సయామీ మాట్లాడుతూ – ‘‘వైల్డ్‌ డాగ్‌’లో నటించడం అద్భుతమైన అనుభువం. రా ఏజెంట్‌గా స్క్రీన్‌ మీద పర్ఫెక్ట్‌గా కనిపించడం కోసం మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. అలానే ఈ సినిమా కోసం చాలా స్టంట్స్‌ చేశాను. నిజమైన రా ఏజెంట్‌లానే కనిపించాననే అనుకుంటున్నాను. నాగార్జునగారితో పని చేయడం మంచి అనుభవం. ఆయనకు పెద్ద ఫ్యాన్‌ అయ్యాను’’ అన్నారు సయామీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement