Sayami Kher
-
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా థియేటర్లలోకి వచ్చిన నెల నెలన్నర గ్యాప్‌లో ఓటీటీలోకి వచ్చేస్తోంది. కొన్నిసార్లయితే నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతుంది. అలాంటిది ఓ మూవీ దాదాపు ఏడాది తర్వాత డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. బాలీవుడ్ సినిమా అయినప్పటికీ దీన్ని తీసింది తెలుగు దర్శకుడు కావడం విశేషం.(ఇదీ చదవండి: సంజయ్‌లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ రివ్యూ)ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన 'మల్లేశం' సినిమాతో రాజ్ రాచకొండ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత టాలీవుడ్ లో మరో మూవీ చేయలేదు. మధ్యలో ఓ మలయాళ మూవీ నిర్మించాడు. కానీ '8 ఏఎమ్ మెట్రో' మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. గతేడాది మే 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ అందుకుంది. కానీ ఓటీటీ రిలీజ్ ఊసే లేదు. ఇన్నాళ్లకు స్ట్రీమింగ్ ఫిక్స్ అయింది.దాదాపు ఏడాది తర్వాత అంటే మే 10 నుంచి '8 ఏఎమ్ మెట్రో' మూవీ జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. మహారాష్ట్ర చెందిన ఐరావతి (సయామీ ఖేర్).. సోదరి ప్రసవం కోసం హైదరాబాద్ వస్తుంది. చిన్నప్పడు జరిగిన కొన్ని సంఘటనల వల్ల అప్పుడప్పుడు పానిక్ ఎటాక్‌కి గురవుతూ ఉంటుంది. అలాంటి ఈమెకు మెట్రోలో ప్రీతమ్ (గుల్షన్ దేవయ్య) పరిచయమవుతాడు. వీళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేదే మెయిన్ పాయింట్.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఈనెలలో ఓటీటీలోకి 100 సినిమాలు/ సిరీస్‌లు) -
'వైల్డ్ డాగ్' భామ సయామీ ఖేర్ ఫొటోలు
-
నాగ్ సార్ బిర్యాని తెస్తే.. ఓ పట్టుపట్టా: హీరోయిన్
‘‘నా కెరీర్లో కొన్ని సినిమాల షూటింగ్స్ పూర్తి కావడానికి కాస్త ఎక్కువ టైమ్ పట్టింది. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయాను. ఇతర భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేశాను. ఈ కారణంగా తెలుగు సినిమాలు ఎక్కువ చేయలేకపోయాను’’ అన్నారు హీరోయిన్ సయామీ ఖేర్. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా సయామీ ఖేర్ చెప్పిన విశేషాలు... ► ‘వైల్డ్ డాగ్’లో నేను ఆర్యా పండిట్ అనే ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా కనిపిస్తాను. ‘రా’ ఏజెంట్ అయిన నేను నాగ్ సార్ లీడ్ చేస్తున్న ‘ఎన్ఐఏ’ టీమ్‌లో ఎందుకు జాయిన్ కావాల్సి వచ్చిందన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ► నాగార్జున ‘శివ’ సినిమాతో ట్రెండ్ సెట్ చేశారు. కానీ ఆయన సినిమాల్లో నా ఫేవరెట్ ‘గీతాంజలి’ మూవీ. అంత పెద్ద స్టార్‌తో కలిసి నటించేందుకు నేను మొదట నెర్వస్‌గా ఫీలయ్యాను. కానీ ఆయన సెట్లో సరదాగా ఉంటారు. ఓ సారి నాగ్ సార్ ఇంటి నుంచి బిర్యానీ తెస్తే, ఓ పట్టుపట్టాను. ► సాధారణంగా హీరోయిన్ పాత్రలకు పెద్దగా యాక్షన్ సీక్వెన్స్ ఉండవు. కానీ ఈ సినిమాలో నాకు చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. నాగ్ సార్‌తోనూ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. నాకు స్పోర్ట్స్‌లో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకే ఫిట్‌గా ఉంటాను. ఆ ఫిట్నెస్ నాకు ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు చేసేందుకు ఉపయోగపడింది. ఈ సినిమా కోసం మార్షల్స్ ఆర్ట్స్‌లో నెల రోజులు ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. ► ప్రతి యాక్టర్‌కూ కొందరితో వర్క్ చేయాలని ఉంటుంది. ప్రభాస్, అల్లు అర్జున్ నా ఫేవరెట్స్. వారితో సినిమాలు చేయాలని ఉంది. అలాగే డైరెక్టర్స్‌లో మణిరత్నం, రాజమౌళిగారు అంటే నాకు ఇష్టం. ప్రస్తుతం రెండు ఓటీటీ ప్రాజెక్ట్స్‌తో పాటు ఓ హిందీ సినిమా చేస్తున్నాను. -
అప్పుడు డిప్రెస్ అయ్యా!
‘‘వైల్డ్ డాగ్’ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కావాల్సింది. అయితే ఈ సినిమాను డీటీఎస్ సౌండ్‌లో పెద్ద తెరపై చూస్తే ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందుతారు. పైగా థియేటర్లు తెరవడం, ప్రేక్షకులు కూడా వస్తుండటంతో మా సినిమాను కూడా థియేటర్లలో విడుదల చేస్తున్నాం’’ అని నాగార్జున అన్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటించిన చిత్రం ‘వైల్డ్ డాగ్’. దియా మీర్జా, సయామీ ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా, రుద్ర ప్రదీప్ ఇతర పాత్రల్లో నటించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున మాట్లాడుతూ– ‘‘వైల్డ్ డాగ్’ సినిమాను ఏప్రిల్ 2న విడుదల చేస్తున్నాం. 37 ఏళ్లుగా షూటింగ్‌లతో బిజీగా ఉండేవాణ్ణి. లాక్డౌన్ వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి ఉండే సమయం దొరికింది. కానీ షూటింగ్‌లు లేకపోవడంతో డిప్రెషన్ గా అనిపించింది. నా జీవితంలో నుంచి 2020 తీసేశాను. ‘ఊపిరి’ చిత్రం సమయంలో సాల్మన్ ప్రతిభను గుర్తించాను. సాల్మన్ తో సినిమా చేద్దామని నిరంజన్ రెడ్డి అనగానే ఓకే అన్నాను. హైదరాబాద్‌లో జరిగిన పేలుళ్ల నేపథ్యంలో ‘వైల్డ్ డాగ్’ సినిమా ఉంటుంది. ‘బంగార్రాజు’ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు సినిమాలో ‘వైల్డ్ డాగ్’ ఓ కొత్త ప్రయత్నం.. హిట్ అవుతుందనే నమ్మకంతో థియేటర్లలో విడుదల చేస్తున్నాం. 45 రోజుల తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోనూ విడుదలవుతుంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. -
గొప్ప కథ కనిపించింది!
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డ మీదే ఓడించి భారత్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజయం అందరికీ చాలా మంచి జ్ఞాపకాన్ని మిగిల్చింది. ఇప్పుడు ఈ టెస్ట్ సిరీస్‌పై ఓ పుస్తకాన్ని రాస్తున్నట్లు ప్రకటించారు బాలీవుడ్ నటి సయామీ ఖేర్. ఈ పుస్తకం రాయడం వెనక ఉన్న కారణం గురించి సయామీ మాట్లాడుతూ – ‘‘క్రికెట్ అభిమానిగా నాకిదో బెస్ట్ మూమెంట్. క్రికెట్ చరిత్రలో ఇదో బెస్ట్ కమ్‌బ్యాక్. ఇందులో గొప్ప అండర్ డాగ్ కథ కనిపించింది. ఎలాంటి కష్టం ఎదురైనా సరే, లేచి నిలబడి విజయం సాధించొచ్చు అని ఈ సిరీస్ చెప్పింది. అందుకే పుస్తకం రాయాలనుకున్నాను. ఈ పుస్తకం రాయడం చాలా ఎగ్జయిటింగ్‌గా, ఎమోషనల్‌గా ఉంది’’ అని అన్నారు. ఆ సిరీస్ ఆడిన పలువురి క్రికెటర్స్ అనుభవాలను కూడా పుస్తకంలో పొందుపరచాలనుకుంటున్నారు. -
వైల్డ్ డాగ్ ఎటు వెళ్తుంది?
నాగార్జున హీరోగా నూతన దర్శకుడు అహిషోర్ సల్మాన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ‘వైల్డ్ డాగ్’. అన్వేష్ రెడ్డి నిర్మించారు. దియా మిర్జా, సయామీ ఖేర్ కథానాయికలుగా నటించారు. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెంట్) ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున కనిపిస్తారు. లాక్డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి పెద్ద చిత్రమిది. ఇటీవలే షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా ఓటీటీలో విడుదల చేస్తారనే వార్త ప్రచారంలో ఉంది. ఈనెల 26న ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేయనున్నారన్నది ఆ వార్త సారాంశం. అయితే ఈ సినిమా థియేటర్స్‌లోనే విడుదల అవుతుందని కూడా వినిపిస్తోంది. మరి వైల్డ్ డాగ్ ఎటు వెళ్తుంది? వేచి చూడాలి. -
ఆయనకు ఫ్యాన్ అయిపోయా!
‘రేయ్’ (2015) సినిమాతో తెలుగుకి పరిచయం అయ్యారు బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్. ఐదేళ్ల గ్యాప్ తర్వాత నాగార్జున ‘వైల్డ్ డాగ్’లో నటించారామె. ఈ సినిమాలో రా ఏజెంట్‌గా నటించారు సయామీ. అహిషోర్ సోల్మాన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు. నాగార్జున యన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) ఆఫీసర్‌గా కనిపించనున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ కథానాయికలు. ఈ సినిమాలో నటించడం గురించి సయామీ మాట్లాడుతూ – ‘‘వైల్డ్ డాగ్’లో నటించడం అద్భుతమైన అనుభువం. రా ఏజెంట్‌గా స్క్రీన్ మీద పర్ఫెక్ట్గా కనిపించడం కోసం మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అలానే ఈ సినిమా కోసం చాలా స్టంట్స్ చేశాను. నిజమైన రా ఏజెంట్‌లానే కనిపించాననే అనుకుంటున్నాను. నాగార్జునగారితో పని చేయడం మంచి అనుభవం. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయ్యాను’’ అన్నారు సయామీ. -
హిమాలయాలకు వీడ్కోలు
ఏసీపీ విజయ్‌వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్న చిత్రం ’వైల్డ్ డాగ్’. దియా మిర్జా హీరోయిన్ గా కీలక పాత్రలో సయామీ ఖేర్ నటిస్తున్నారు. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ చిత్రం షూటింగ్ మనాలీలో జరిగింది. నాగార్జున పాత్రకు సంబంధించిన సన్నివేశాలు పూర్తి కావడంతో హైదరాబాద్ వచ్చేశారు. ’’నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాలకు వీడ్కోలు చెప్తుంటే బాధగా అనిపించింది’’ అంటూ తన తోటి నటీనటులతో హిమాలయాల బ్యాక్‌డ్రాప్‌లో దిగిన ఫోటోను షేర్ చేశారు నాగార్జున. ఇతర నటీనటులతో మనాలీలో షూటింగ్ జరుగుతోంది. అక్కడి షెడ్యూల్ పూర్తి చేశాక, హైదరాబాద్‌లో నిర్మాణానంతర కార్యక్రమాలు ఆరంభిస్తారు. ఈ చిత్రానికి మాటలు: కిరణ్ కుమార్, కెమెరా: షానీల్ డియో. -
విజయ్ వర్మ .. ఆన్ మిషన్
నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో ఈ సినిమాను నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మ పాత్రలో నాగార్జున నటిస్తున్నారు. ఆఫీసర్ విజయ్ వర్మ తన టీమ్‌తో ఏదో మిషన్ మీద ఉన్నట్లు కనిపిస్తున్న ఒక ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. ప్రస్తుతం మనాలీలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. 20 రోజుల షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. అక్కడి రోహ్తంగ్ పాస్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ షెడ్యూల్ ఆరంభమై ఇప్పటికి వారం అవుతోంది. -
ఏడు నెలల తర్వాత...
నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వైల్డ్ డాగ్’. అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో ఇటీవలే మొదలైంది. ఈ షూటింగ్లో జాయిన్ అయిన నాగార్జున అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోయి ప్రేక్షకులతో తన ఆనందాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నారు. ‘‘హాయ్.. ఇది రోహ్తంగ్ పాస్ (రోహ్తంగ్ కనుమ)లోని అందమైన ఉదయం. సముద్ర మట్టానికి పదమూడు వేల అడుగుల ఎత్తు. ఇది చాలా ప్రమాదకరమైన కనుమ. నవంబర్ నుంచి మే నెల వరకు దీన్ని మూసేస్తారు. ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ ఇక్కడ చాలా బాగా జరుగుతోంది. అందమైన పర్వతాలు, నీలాకాశం, జలపాతాలు.. ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. ఏడు నెలల తర్వాత ఇటువంటి ప్లేస్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. 21 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. ఆ తర్వాత (హైదరాబాద్) వచ్చేస్తాను. లవ్ యు ఆల్. సీ యు’’ అని పేర్కొన్నారాయన. ఈ షెడ్యూల్లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజయ్ వర్మగా నాగార్జున నటిస్తున్నారు. దియా మీర్జా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ఎ¯Œ .ఎం. పాషా, జగన్మోహన్ వంచా, కెమెరా: షానీల్ డియో. -
మిషన్ థాయ్‌ల్యాండ్
‘వైల్డ్ డాగ్’ కోసం ఎన్ఐఏ ఆఫీసర్ విజయ్ వర్మగా మారారు నాగార్జున. ఇందులో ఆయన చేయబోయే మిషన్లు సినిమాకు హైలెట్ అని తెలిసింది. తాజాగా థాయ్‌ల్యాండ్‌లో ఓ మిషన్ చేపట్టనున్నారని సమాచారం. నూతన దర్శకుడు అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘వైల్డ్ డాగ్’. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సయామీ ఖేర్, దియా మిర్జా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత తెలుగులో చిత్రీకరణ ప్రారంభించిన పెద్ద సినిమా ఇదే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేస్తున్నారు. మార్చ్‌లోనే జరగాల్సిన షెడ్యూల్ ఇది. కరోనా వల్ల వాయిదా పడింది. అప్పుడు వాయిదా పడిన ఈ షెడ్యూల్‌ను అనుకున్నట్టుగానే పూర్తి చేయాలన్నది తాజా ప్లాన్. ఈ నెలాఖర్లో థాయ్‌ల్యాండ్ ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..!
భారతీయ సినీ అభిమానులు గర్వించే స్థాయి చిత్రాలను తెరకెక్కించిన దక్షిణాది దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు ఘనవిజయాలు అందించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మధ్యలో చాలా రోజుల పాటు తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వలేకపోయాడు. చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు మణి. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే ఓ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశాడు. ద్విభాష చిత్రంగా కార్తీ, నాని, నిత్యామీనన్, సయామీ ఖేర్‌లతో సినిమాను ప్లాన్ చేశాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లటమే అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో కార్తీ, అదితి రావ్ల కాంబినేషన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. కాట్రు వెళదిలై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే గతంలో ప్రకటించిన మణిరత్నం మల్టీ స్టారర్ సినిమా కూడా ఈ ఏడాది చివరకు సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ విషయాన్ని చిత్ర హీరోయిన్ సయామీ ఖేర్ స్వయంగా ప్రకటించింది. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సయామి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ... మణిరత్నం దర్శకత్వంలో చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది. -
పవన్ కల్యాణ్‌ని చూసి ఆశ్చర్యపోయాను!
తెలుగు తెరపైకి రానున్న మరో ఉత్తరాది భామ ‘సయామీ ఖేర్’. ఈ బ్యూటీది సాదాసీదా నేపథ్యం కాదు. ప్రసిద్ధ హిందీ నటి షబానా ఆజ్మీకి స్వయానా మేనకోడలు. వైవీయస్ చౌదరి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రేయ్’ ద్వారా తెలుగు తెరకు పరిచయం కానున్న సయామీ చెప్పిన కబుర్లు... నేను పుట్టి, పెరిగింది ముంబయ్‌లోనే. మా నానమ్మ ఉషా ఖేర్ హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 50 చిత్రాల్లో నటించారు. మా అమ్మా, నాన్నలకు కూడా గ్లామర్ ప్రపంచంతో అనుబంధం ఉంది. మా అత్తయ్య షబానా ఆజ్మీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నా బ్లడ్‌లోనే నటన ఉందనుకుంటున్నా. ముందు మోడల్‌గా పలు ఉత్పత్తులకు చేశాను. కింగ్‌ఫిషర్ క్యాలెండర్ చూసి, వైవీయస్ చౌదరిగారు ‘రేయ్’ కోసం అడిగారు. అప్పుడు మా అత్తయ్య నాతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ‘ఒకవేళ నువ్వు కథానాయికగా చేయాలనుకుంటే ముందు దక్షిణాది చిత్రాలతో మొదలుపెట్టు’ అని. అందుకే చౌదరిగారికి వెంటనే ఓకే చెప్పేశా. ‘రేయ్’ అంటే అర్థం తెలుసు. కోపంగానూ ఆ మాట అనొచ్చు.. ఆత్మీయంగానూ అనొచ్చు. కానీ, నా మటుకు నాకు ఈ పదంలో ఏదో ఆత్మీయత ఉందనిపిస్తుంది. ‘షౌట్ ఫర్ సక్సెస్’ అని ఉపశీర్షిక పెట్టారు. మేం కచ్చితంగా సక్సెస్ కొడతాం. అందులో డౌటే లేదు. ఈ చిత్రంలో నాది పది నిమిషాలు అలా వచ్చి, ఇలా వెళ్లిపోయే పాత్ర కాదు. చాలా శక్తిమంతమైన పాత్ర. ఈ చిత్రాన్ని చౌదరిగారు తెరకెక్కించిన విధానం సూపర్బ్. పాటలైతే ఎంత బాగా తీశారంటే.. కదలకుండా చూసేస్తారు. నేనీ సినిమా ఒప్పుకున్నప్పుడు సాయిధరమ్ తేజ్ ఎవరో తెలియదు. ఆ తర్వాత చిరంజీవిగారి మేనల్లుడని తెలిసి, భయపడ్డాను. పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నాడు.. ఎలా ఉంటాడో అనుకున్నాను. కానీ, తను చాలా నిరాడంబరంగా ఉంటాడు. ఆ మాటకొస్తే, సాయిధరమ్ ఇంకో బాబాయ్ (పవన్ కల్యాణ్)ని చూసి ఆశ్చర్యపోయాను. అంత పెద్ద స్టార్ అయ్యుండి ఎంతో డౌన్ టు ఎర్త్లా ఉంటారు. రామ్‌చరణ్, బన్నీ (అల్లు అర్జున్) అందరూ కూడా అంతే. తన మేనమామల్లానే సాయి కూడా ఉంటాడు. అందర్నీ ఒకచోట చూసినప్పుడు వాళ్ల హావభావాలు దాదాపు ఒకే విధంగా ఉండటం చూసి, భలే అనిపించింది. పవన్ కల్యాణ్, మహేశ్‌బాబు, బన్నీ నటించిన చిత్రాలు చూశాను. నాకైతే తెలుగు హీరోలందరితో నటించాలని ఉంది. గ్లామర్, డీ-గ్లామర్ రెండు రకాల పాత్రలూ చేయాలనుకుంటున్నా. కథానుగుణంగా పెదవి ముద్దు సన్నివేశాలు చేయడానికి వెనకాడను. ప్రస్తుతం హిందీలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ‘మీర్జా సాహిబా’ అనే చిత్రంలో నటిస్తున్నా.