మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..! | mani ratnams bilingual to flag off from year end | Sakshi
Sakshi News home page

మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..!

Published Sat, Jul 23 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..!

మణిరత్నం, నానిల సినిమా ఆగిపోలేదట..!

భారతీయ సినీ అభిమానులు గర్వించే స్థాయి చిత్రాలను తెరకెక్కించిన దక్షిణాది దర్శకుడు మణిరత్నం. ఒకప్పుడు ఘనవిజయాలు అందించిన ఈ క్రియేటివ్ డైరెక్టర్ మధ్యలో చాలా రోజుల పాటు తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వలేకపోయాడు. చాలా కాలం తరువాత ఓకె బంగారం సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చాడు మణి. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో వెంటనే ఓ మల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేశాడు.

ద్విభాష చిత్రంగా కార్తీ, నాని, నిత్యామీనన్, సయామీ ఖేర్లతో సినిమాను ప్లాన్ చేశాడు. ఇక సెట్స్ మీదకు వెళ్లటమే అనుకున్న సమయంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో కార్తీ, అదితి రావ్ల కాంబినేషన్లో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నాడు మణిరత్నం. కాట్రు వెళదిలై పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే గతంలో ప్రకటించిన మణిరత్నం మల్టీ స్టారర్ సినిమా కూడా ఈ ఏడాది చివరకు సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ విషయాన్ని చిత్ర హీరోయిన్ సయామీ ఖేర్ స్వయంగా ప్రకటించింది. ఇటీవల ఓ ప్రైవేట్ ఈవెంట్లో పాల్గొన్న సయామి తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ... మణిరత్నం దర్శకత్వంలో చేయబోయే సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement