మణి సినిమాలో నాని | Nani Acting in Maniratnam next film | Sakshi
Sakshi News home page

మణి సినిమాలో నాని

Published Wed, Oct 7 2015 2:52 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 AM

మణి సినిమాలో నాని

మణి సినిమాలో నాని

సౌత్ హీరోలకే కాదు, నార్త్ స్టార్ హీరోలకు కూడా మణిరత్నం సినిమాలో నటించడం ఒక కల.. హీరోయిజం, స్టార్డంతో సంబంధం లేకుండా తన కథకు ఎవరైతే సరిపోతారో వారిని వెతికి పట్టుకునే మణిరత్నం, ఓ టాలీవుడ్ యంగ్ హీరోకు ఛాన్స్ ఇస్తున్నాడు. మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్లో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు నాని.

టాలీవుడ్లో నాచురల్ ఆర్టిస్ట్గా పేరున్న నాని ... ఈగ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మణిరత్నం తెరకెక్కించిన 'ఓకె బంగారం' సినిమా తెలుగు వర్షన్కు డబ్బింగ్ చెప్పిన నాని, మణిరత్నం దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు.  అదే జోష్లో ఇప్పుడు మణిరత్నం నెక్ట్స్ ప్రాజెక్ట్లో నటించే ఛాన్స్ చేజిక్కించుకున్నాడు.

ప్రస్తుతం దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా రీవేంజ్ డ్రామాను తెరకెక్కించే పనిలో ఉన్నాడు మణిరత్నం. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఆయన ఒకేసారి తెరకెక్కించనున్నాడు. మరి నానీని తెలుగు వర్షన్లో హీరోగా సెలెక్ట్ చేశాడా..? లేక వేరే ఏదైనా పాత్రకు తీసుకున్నాడా..? అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. ఇప్పటి వరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ లేకపోయినా మణిరత్నం నెక్ట్స్ సినిమాలో నాని నటించటం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement