నాని ఆ సినిమా చేస్తున్నాడట | Nani hasnt out of maniratnam film | Sakshi
Sakshi News home page

నాని ఆ సినిమా చేస్తున్నాడట

Published Fri, Oct 30 2015 10:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

నాని ఆ సినిమా చేస్తున్నాడట

నాని ఆ సినిమా చేస్తున్నాడట

మణిరత్నం చేయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్కు సంబంధించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మొదట ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, కార్తీ హీరోలుగా నటిస్తారన్న వార్త వినిపించింది. తరువాత దుల్కర్ స్థానంలో నాని నటించే అవకాశం ఉందటూ మరో వార్త, తరువాత నాని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడంటూ రకరకాల కథనాలు సౌత్ ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టేశాడు యంగ్ హీరో నాని.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నం సినిమాలో నాని నటిస్తున్నట్టు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్తీ ఇతర ప్రాజెక్ట్స్లో బిజీగా ఉన్న కారణంగా ఈ సినిమా వాయిదాపడింది. త్వరలోనే మణిరత్నం, కార్తీ, నానీ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలిపాడు. మణిరత్నం సినిమాలో నటించటం నాని కల అని.. ఆ అవకాశం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోడని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement