కార్తీతోనే మణి సినిమా | Maniratnam Next movie with karthi | Sakshi
Sakshi News home page

కార్తీతోనే మణి సినిమా

Published Wed, Dec 16 2015 10:21 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 PM

కార్తీతోనే మణి సినిమా

కార్తీతోనే మణి సినిమా

ఓకే బంగారం సక్సెస్తో తిరిగి ఫాంలోకి వచ్చిన మణిరత్నం తన నెక్ట్స్ సినిమా విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నా, మణి మాత్రం ఇంతవరకు ఏ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కార్తీ, దుల్కర్ సల్మాన్ల కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా చేస్తాడని భావించినా.. ఆ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు రాలేదు.

తరువాత కార్తీ, నాని కాంబినేషన్ అంటూ, నాని సోలో హీరోగా బైలింగ్యువల్ సినిమా అంటూ రకరకాల వార్తలు వినిపించాయి. తాజాగా మణిరత్నం నెక్ట్స్ సినిమాపై మరో వార్త కోలీవుడ్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. కార్తీ హీరోగా ఓ డిఫరెంట్ ఎంటర్టైనర్ను తెరకెక్కించాలని భావిస్తున్నాడట మణిరత్నం. కార్తీ అయితే తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంటుందని భావించిన మణి, ఈ సినిమానే ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement