'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు హీరోలు.. | Jr NTR And Nani As Cameo In Kalki 2898 AD Movie | Sakshi
Sakshi News home page

'కల్కి'లో మరో ఇద్దరు తెలుగు హీరోలు..

Jan 30 2024 9:33 AM | Updated on Jan 30 2024 10:08 AM

JR NTR And Nani As Cameo In Kalki Movie - Sakshi

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్‌- నాగ్‌ అశ్విన్ కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD). దీని కోసం ప్రభాస్‌ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అందుకే దీనికి సంబంధించిన చిన్న అప్‌డేట్‌ బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరలవుతోంది. గతేడాది వచ్చిన సలార్‌ చిత్రం విజయంతో మంచి జోష్‌లో ఉన్న ప్రభాస్‌ మార్కెట్‌ కల్కి సినిమాతో మరోస్థాయికి చేరుకోవడం ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఇప్పటికే భారీ స్టార్స్‌ నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్,  కమల హాసన్, దీపిక పదుకొణె, దిశాపటానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.

వీరందరితో పాటుగా  క్యామియో రోల్స్‌లో మలయాళ స్టార్​ దుల్కర్ సల్మాన్,  విజయ్ దేవరకొండ కూడా కల్కి చిత్రంలో కనిపించనున్నారని గతంలో భారీగానే ప్రచారం జరిగింది. 'కింగ్‌ ఆఫ్‌ కోథా' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దుల్కర్‌ కల్కి గురించి పలు విషయాలు పంచుకున్నాడు. ఆ సినిమా సెట్స్‌ ఎంతో అద్భుతంగా ఉన్నాయిని చెప్పిన ఆయన కల్కిలో భాగం అవుతున్నారా అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం ఇవ్వలేదు. కానీ ఆయన మాటలను బట్టి కల్కిలో దుల్కర్‌ నటిస్తున్నారనే ప్రచారం మాత్రం గట్టిగానే జరిగింది. 

కల్కి సినిమా ఎండింగ్‌లో వచ్చే కీలకమైన సన్నివేశాల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌,  నాని కూడా కనిపించబోతున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరల్‌ అవుతుంది. కల్కి చిత్రంలో కృపాచార్యగా నాని కనిపిస్తే పరశురాముడిగా ఎన్టీఆర్​ కనిపించనున్నారని సమాచారం. ఇప్పటికే ‘కల్కి’లో ఎంతోమంది ఇతర భాషలకు చెందిన అగ్ర నటీనటులు ఉన్నారు. అలాంటిది నాని, తారక్‌ పేర్లు తెరపైకి రావడంతో సినిమా మార్కెట్‌ మరింత పెరిగే ఛాన్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ వార్తల్లో ఎంతమేరకు నిజం ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం భారీగా ప్రచారం జరుగుతుంది.

మే 9న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌కీ ఈ తేదీతో ఎంతో అనుబంధం ఉంది. ఈ సంస్థ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి, మహర్షి చిత్రాలు మే 9నే విడుదలై ఘన విజయాన్ని అందుకున్నాయి. 'కల్కి 2898 ఎ.డి' చిత్రాన్ని కూడా అదే రోజునే విడుదల చేస్తున్నట్టు  నిర్మాణ సంస్థ గతంలో అధికారికంగా ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement