సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పాదయప్ప'. తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేశన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రజినీకాంత్, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి చాలా చిత్రాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన చివరి చిత్రమే పాదయప్ప. అయితే ఈ సినిమాకు అప్పట్లో రెమ్యునరేషన్ విషయాకొస్తే కేవలం లక్షల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడైతే కోట్లలోనే చూస్తున్నాం.
(ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!)
అంతకుముందు సినిమాల వరకు శివాజీ గణేశన్ పారితోషికం రూ.20 లక్షల వరకు తీసుకునేవారట. అయితే పాదయప్ప చిత్రానికి దాదాపు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. కానీ రజినీకాంత్ శివాజీ గణేశన్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా రెమ్యునరేషన్ వచ్చేలా చేశారట. పాదయప్ప సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల పారితోషికం ఇప్పించాడట. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది.
అయితే ఆ సమయంలో కోటిన్నర రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే. శివాజీ గణేశన్ తీసుకున్న అత్యధిక పారితోషికం కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగా.. శివాజీ గణేశన్ 2001లో కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment