lakhs
-
నెలకు రూ. 7వేలతో.. ₹32 లక్షలు: ఎలా అంటే?
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలునెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటిగమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది. -
ఆ ప్రాజెక్టుకు పది లక్షల చెట్ల బలి!
అండమాన్, నికోబార్ దీవులలో ‘అండమాన్, నికోబార్ ఐలాండ్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొ రేషన్’ (ఏఎన్ఐఐడీసీఓ) అనే పాక్షిక–ప్రభుత్వ ఏజెన్సీ ఉంది. ‘ఈ ప్రాంత సమతుల్య పర్యావరణ అనుకూల అభివృద్ధి కోసం సహజ వనరులను వాణిజ్యపరంగా ఉప యోగించుకోవడానికీ, అభివృద్ధి చేయడానికీ’ దీనిని కంపెనీల చట్టం కింద 1988లో స్థాపించారు. దాని ప్రధాన కార్యకలాపాలలో పెట్రోలియం ఉత్పత్తుల వర్తకంతో సహా, భారతదేశంలో తయారయ్యే విదేశీ మద్యం, పాలు, పర్యాటక రిసార్ట్‌ల నిర్వహణ; పర్యాటకం కోసం, మత్స్య సంపద కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటివీ ఉన్నాయి. అంతవరకు పెద్దగా తెలియని ఈ సంస్థకు 2020 ఆగస్టులో రాత్రికి రాత్రే గ్రేట్ నికోబార్ ద్వీపంలో 72 వేల కోట్ల భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అమలు చేసే బాధ్యతను అప్పగించారు. ఇందులో భారీ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్, పవర్ ప్లాంట్, విమానాశ్రయం, టౌన్షిప్ నిర్మాణంతో పాటు, 130 చదరపు కిలోమీటర్లకు పైగా అటవీ భూమిలో విస్తరించే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమై ఉన్నాయి. రెండు సంవత్సరాల తరువాత, ఏఎన్ఐఐడీసీఓ సంస్థ ఈ ప్రాజెక్ట్ కోసం పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఓఈఎఫ్సీసీ) నుండి రెండు కీలకమైన అనుమతులను పొందింది. మొదటిది, అక్టోబర్ 2022లో చోటు చేసుకుంది. మంత్రిత్వ శాఖకు చెందిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ (ఎఫ్ఏసీ) అటవీ భూమిని ఇతర అవసరాలకోసం మళ్లించేందుకు అనుమతించింది. అత్యంత సహజమైన, జీవవైవిధ్యం కలిగిన ఉష్ణమండల అడవులలో 130 చదరపు కి.మీ. (ముంబైలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ కంటే పెద్దది) విస్తీర్ణం కల భూమి మళ్లింపుపై ఈ కమిటీ సంతకం చేసింది. దాదాపు ఒక నెల తర్వాత, నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) కీలకమైన పర్యావరణ అనుమతిని మంజూరు చేసింది. ఈ ఒక్క ప్రాజెక్ట్ కోసం దాదాపు పది లక్షల చెట్లను నరికివేయనున్నారన్న విషయంపై తీవ్రమైన ఆందోళనలు తలెత్తాయి. ప్రభుత్వం పార్లమెంటులో చేసిన ప్రకటనలో ప్రాజెక్ట్ డాక్యుమెంట్లలో దాదాపు 8.5 లక్షల నుండి 9.64 లక్షల వరకు చెట్లు నరికివేయడంపై ప్రాథమిక అంచనాలు మారాయి. వాతావరణ సంక్షోభం వేగవంతమైన ఈ యుగంలో బలి ఇవ్వాల్సిన చెట్ల సంఖ్యను చూసి చాలా మంది నివ్వెరపోయారు. ఒక జాతీయ పత్రికలో నివేదించి నట్లుగా, నిజానికి మనం కనీసం 30 లక్షల చెట్లను కోల్పో వలసి ఉంటుంది. ఇది చాలా చాలా ఎక్కువ అనే చెప్పాలి.ఇది వాస్తవమైతే అందుబాటులో ఉన్న డేటాను బట్టి కొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి. ప్రాజెక్ట్, అటవీ భూమి మళ్లింపు కోసం అనుమతి కోరినప్పుడు, ఈ ప్రాజెక్ట్ ప్రతి పాదకుడు మంత్రిత్వ శాఖకు ఏ సమాచారాన్ని అందించారు? ద్వీపంలో రూ. 72 వేల కోట్ల పెట్టుబడి పెట్టాలని ఈ ఏజెన్సీని కోరినప్పుడు, నరికివేయాల్సిన చెట్ల సంఖ్య ఎవరికీ తెలియదా? పాలు, ఆల్కహాల్, పెట్రోలియం అమ్మకంలో ప్రధాన వ్యాపార అనుభవం ఉన్న సంస్థను ఈ వ్యవహారంలో ఎవరైనా క్షమించవచ్చు. కానీ మంత్రిత్వ శాఖలోని శాస్త్రీయ, పర్యావరణ సంస్థల మాట ఏమిటి? పైగా పర్యావరణం, అటవీ అనుమతుల మాట ఏంటి?అన్ని వనరులూ, అధికారం తమ వద్దే ఉన్నందున, ఈఏసీ, ఎఫ్సీఏ సరైన ప్రశ్నలను ఎందుకు అడగలేదు? ప్రాజెక్ట్‌కు పర్యావరణ అనుమతిని మంజూరు చేసేటప్పుడు ఈఏసీ స్థానం కేసి అంతర్ దృష్టితో చూస్తే శాస్త్రీయ సామర్థ్యం, భాషలో నైపుణ్యం అనేవి ఈఏసీ నిర్దేశించిన ప్రమాణాల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ రెండు ఉదాహరణలు ఉన్నాయి: ‘ఏ చెట్లూ ఒకేసారి నరికివేయబడవు. వార్షిక ప్రాతిపదికన పని పురోగతిని బట్టి దశలవారీగా ఈ పని జరుగుతుంది. అసాధారణంగా పొడవుగానూ, వయ స్సులో పెద్దగా ఉన్న అన్ని చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ ‘అసాధారణంగా పొడవైన చెట్టు’ అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే? చెట్టు పాతదిగా పరిగణించ బడటానికి సరైన వయస్సును ఎలా నిర్ణయిస్తారు? ప్రారంభించడానికి, మీరు చెట్టు వయస్సును ఎలా అంచనా వేస్తారు? అలాగే ‘సాధ్యమైనంత వరకు’ వాటిని రక్షించడం అంటే అర్థం ఏమిటి? రెండవ ఉదాహరణ మరింత మెరుగైనది– ‘స్థానిక గుడ్లగూబల గూడు రంధ్రాలు ఉన్న చెట్లను ఎస్ఏసీఓఎన్ (సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచర్) సహాయంతో గుర్తించి జియో–ట్యాగ్ చేయాలి. అటువంటి చెట్లను వీలైనంత వరకు రక్షించాలి.’ పక్షి ప్రవర్తన, రాత్రిపూట దాని అలవాట్లను పరిగణ నలోకి తీసుకుని, గుడ్లగూబను (ఏదైనా గుడ్లగూబ) చూడటం ఎంత కష్టమో తెలియనిది కాదు. నిజానికి, నికోబార్ వర్షాటవిలోని చెట్లు ఆకాశంలోకి 100 అడుగుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఒక్కో చెట్టుకు కేవలం ఐదు నిమిషాలు కేటాయించినట్లయితే, ఒక మిలియన్ చెట్లకు గూడు రంధ్రాలు వెతకడానికి మొత్తం 83,000 గంటల సమయం పడుతుంది. మన ఉత్తమ పక్షి వీక్షకు లలో 10 మంది ఏకకాలంలో రోజుకు 8 గంటలు సర్వే చేసినా, అది పూర్తి కావడానికి దాదాపు ఆరేళ్లు పడుతుంది.ఇప్పుడు ఈ ఆమోదిత షరతును మళ్లీ చదవండి. మీరు దీని గురించి ఏ భావాన్ని పొందగలరో చూడండి. ఈ చెట్లను లెక్కించడానికి, కత్తిరించడానికి రవాణా చేయ డానికి ఇప్పటికే ఏఎన్ఐఐడీసీఓ కాంట్రాక్టర్లను ఆహ్వానించింది. గొడ్డళ్లు చెట్లను నేలకూల్చుతుంటే వాటిని రక్షించడం మాని... భూమికి వంద అడుగుల ఎత్తులో ఉన్న గుడ్లగూబల గూడు రంధ్రాల కోసం మన ఎస్ఏసీఓఎన్ మిత్రులు వెతుకుతూ ఉండరని ఆశిద్దాం.-పంకజ్ సేఖసరియావ్యాసకర్త ఐఐటీ బాంబే అసోసియేట్ ప్రొఫెసర్(‘ది హిందుస్థాన్ టైవ్స్ సౌజన్యంతో) -
బాప్రే.. పార్కింగ్ జరిమానా రూ.11 లక్షలా?
లండన్: మూడేళ్ల నుంచి నిత్యం తాను పార్కింగ్ చోటే కదా అనుకుంది. ఎప్పటిలాగే ఆరోజూ తన వాహనాన్ని నిలిపింది. తీరా చూస్తే అధికారులు.. కొత్త రూల్ పేరుతో ఆమెకు పెద్ద షాకిచ్చారు. వాళ్లు పంపిన జరిమానా చూసి ఆమె కళ్లు బయర్లు కమ్మాయి. యూకేలోని కౌంటీ దుర్హంలో హెన్నా రాబిన్సన్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీథమ్స్ లీజర్ సెంటర్లో ఐదు నిమిషాల పార్కింగ్ రూల్ కారణంగా.. ఆమె 11 వేల పౌండ్లు(మన కరెన్సీలో రూ.11 లక్షలు) చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే పర్మిట్ కోసం తాను డబ్బులు చెల్లించినప్పటికీ.. ఈ జరిమానాను అందుకోవాల్సి వచ్చిందని ఆమె వాపోతున్నారు. 2021 నుంచి ఆమె ఆ పార్కింగ్ సేవల్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే కొత్త రూల్ అమలయ్యాక.. అప్పటి నుంచి ఆమె కారు కదలికలను అధికారులు లెక్కేశారు. అలా మొత్తం 67 చలాన్లకు.. ఒక్కో చలాన్‌కు 170 పౌండ్లు(1,800రూ.) చొప్పున ఇప్పుడు జరిమానా విధించారు. యూకేలో ఎక్సెల్ పార్కింగ్ సర్వీసెస్(EPS) తాజాగా ఈ ఐదు నిమిషాల నిబంధనను అమల్లోకి తెచ్చింది. కొందరు డ్రైవర్లు పార్కింగ్ ఏరియాల దగ్గర ఉత్తపుణ్యానికి వెయిట్ చేయడం, డబ్బులు చెల్లించకుండా కార్ పార్కింగ్‌లను పికప్ ఏరియాలుగా ఉపయోగించుకుంటుండడంతోనే ఈ రూల్‌ను తేవాల్సి వచ్చిందని ఈపీఎస్ చెబుతోంది. ఐదు నిమిషాల రూల్ ప్రకారం.. కార్క్ పార్కింగ్ దగ్గర ఏర్పాటు చేసే ఏఎన్పీఆర్ కెమెరాలు ఎంట్రీని, ఎగ్జిట్‌ను రికార్డు చేసి.. ఛలానాను జనరేట్ చేస్తాయి. అయితే.. కస్టమర్స్ అక్కడికి చేరుకున్న ఐదు నిమిషాల్లోపే టికెట్ కొనాల్సి ఉంటుంది. కానీ, కార్ పార్క్ వద్ద ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో ట్రాన్జాక్షన్స్ తాను చేయలేకపోయానని హెన్నా రాబిన్సన్ చెబుతోంది. ఆమె మాత్రమే కాదు.. ఇలా పార్కింగ్ వద్ద ఐదు నిమిషాల నిబంధన కారణంగా తామూ చలాన్లు అందుకున్నామంటూ పలువురు వాపోతున్నారు ఇప్పుడు. -
ఆరున్నర లక్షల కరెంటు బిల్లు.. అవాక్కైన ఇంటి యజమాని!
సాక్షి, యాదాద్రి జిల్లా: ఇంట్లో రెండు బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నప్పుడు, సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందో ఆలోచించండి. మహా అయితే.. రేయింబవలు వేసిన 400 నుంచి 500 మించి రాదు. మహా అయితే వెయ్యి రూపాయలు వస్తుందేమో. కాకపోతే ఓ ఇంటికి ఎంత బిల్ వచ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. మండుటెండలో ఇంటి కరెంట్ బిల్లు చూసిన యజమానికి చెమటలు పట్టడమే కాకుండా.. ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగు చూసింది.జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలం రహీంఖాన్‌పేట గ్రామానికి చెందిన డీ పరశురాములు ఇంటికి విద్యుత్తు బిల్లు రీడింగ్ తీసేందుకు సోమవారం ట్రాన్స్‌కో సిబ్బంది వచ్చారు. ప్రతి నెలా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు సబ్సిడీ వర్తించే సర్వీస్ నంబర్.. సోమవారం మీటర్ రీడింగ్‌ను స్కాన్ చేస్తుండగా ఒక్కసారిగా రూ.6,72,642 బిల్లు వచ్చింది.రీడింగ్ ఒక్కసారిగా 5,40,927 యూనిట్లు వాడినట్టు రావడంతో ఇంటి యాజమాని అవాక్కయ్యాడు. గృహజ్యోతి కింద సబ్సిడీ వస్తున్న విద్యుత్తు బిల్లు ఏకంగా రూ.6,72,642 రావడం ఏంటని ట్రాన్స్‌కో సిబ్బందిని ప్రశ్నించాడు. ఈ విషయమై ట్రాన్స్‌కో ఏఈ ప్రభాకర్‌రెడ్డిని వివరణ కోరగా.. రీడింగ్ తీస్తున్న సమయంలో హై ఓల్టేజ్ వచ్చినట్టయితే రీడింగ్ జంప్ అయ్యి పెద్ద మొత్తంలో బిల్లు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. అధిక బిల్లు వచ్చిన మీటర్‌ను టెస్టింగ్ కోసం పంపినట్టు ఆయన పేర్కొన్నారు. -
దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్.. ఆ బుల్లితెర నటి ఎవరంటే?
సినిమా ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటోంది. ఎందుకంటే స్టార్ హీరోల విషయాకొనిస్తే ఆ పదం కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్లో వంద కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు కూడా ఉన్నారు. అలాగే సినిమాలతో పాటు బుల్లితెరపై కనిపించే నటీనటులు సైతం కోట్లలో కాకపోయినా.. లక్షల్లో తీసుకునేవారు ఉన్నారు. బుల్లితెరపై నటీనటుల విషయంలో రెమ్యునరేషన్ తక్కువే అయినా.. అందులోనూ అత్యధిక పారితోషికం అందుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో ఎపిసోడ్‌కు లక్షల రూపాయలు వసూలు చేస్తున్న క్రేజీ నటి గురించి తెలుసుకుందాం. ఇంతకీ ఆమె ఎవరో మీరు కూడా ఓ లుక్కేయండి. ఏడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన నటి ప్రస్తుతం బుల్లితెరపై నటించేవారిలో అత్యధిక పారితోషికం అందుకుంటోంది. ప్రముఖ సీరియల్స్‌లో నటిస్తూ ఒక్కో ఎపిసోడ్‌కు హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఆమె దాదాపు 22 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ బుల్లితెర భామ రూపాలీ గంగూలీ. దర్శకుడు, స్క్రీన్ రైటర్ అనిల్ గంగూలీ కుమార్తెగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆమె సోదరుడు విజయ్ గంగూలీ కూడా కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. రూపాలి గంగూలీ 1985లో ఏడేళ్ల వయసులో తన తండ్రి చిత్రం సాహెబ్‌లో నటించింది. ఆ తర్వాత ఆమె 2000లో సుకన్య అనే సీరియల్‌తో బుల్లితెర రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత సారాభాయ్ వర్సెస్ సారాభాయ్‌లో మోనిషా పాత్రకు ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 2006లో ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్- 1లో పాల్గొంది. ఆ తర్వాత కూడా పలు రియాలిటీ షోస్‌లో కూడా పాల్గొంది. ఆమెకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో సన్నిహితమైన సంబంధాలు కూడా ఉన్నాయి. అక్షయ్ కుమార్‌ను కుటుంబ సభ్యుడిలా భావిస్తామని గతంలో రూపాలీ చాలాసార్లు చెప్పుకొచ్చారు. సీరియల్స్‌లో నటిస్తూ ఉండగానే రూపాలి గంగూలీ ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ కె. వర్మను వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అనుపమ-నమస్తే అమెరికా, బతేన్ కుచ్ అంకాసీ అనే సీరియల్స్‌లో నటిస్తోంది. ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన బుల్లితెర నటిగా పేరు సంపాదించుకున్న రూపాలీ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న బుల్లితెర నటిగా నిలిచింది. ప్రస్తుతం ఆమె ఒక్కో ఎపిసోడ్‌కి రూ. 3 లక్షలు తీసుకుంటోంది. కేవలం సీరియల్స్ ద్వారానే దాదాపు రూ. 20 కోట్ల వరకు ఆస్తులు సంపాదించారు. బుల్లితెర పరంగా చూస్తే ప్రస్తుతం అత్యధిక రెమ్యునరేషన్ రూపాలీ గంగూలీ అందుకుంటున్నారు. ఓవరాల్‌గా ఇండియాలో ఈ స్థానం మాత్రం కమెడియన్ కపిల్ శర్మదే. అతడు ఒక్కో ఎపిసోడ్ కు ఏకంగా రూ.50 లక్షలు వసూలు చేస్తుండటం విశేషం. బాలీవుడ్ లోనూ అతడు పలు సినిమాల్లో కనిపించాడు. ది కపిల్ శర్మ షో మాత్రం చాలా ఫేమస్ అయ్యారు. సంపద పరంగా చూస్తే రూపాలీ గంగూలీ కంటే హీనా ఖాన్ నెట్ వర్త్ చాలా ఎక్కువ. ఆమె రూ.52 కోట్లతో దేశంలో అత్యధిక సంపద కలిగిన బుల్లితెర నటిగా నిలిచింది. View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) -
సూపర్ హిట్ మూవీ.. శివాజీ గణేశన్‌కు రజినీ కళ్లు చెదిరే గిఫ్ట్!
సూపర్ స్టార్ రజినీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పాదయప్ప'. తెలుగులో నరసింహా పేరుతో రిలీజ్ చేశారు. ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాలో రజినీకాంత్ తండ్రిగా శివాజీ గణేశన్ నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో రజినీకాంత్, శివాజీకి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరు కలిసి చాలా చిత్రాల్లో కనిపించారు. వీరి కాంబినేషన్లో వచ్చిన చివరి చిత్రమే పాదయప్ప. అయితే ఈ సినిమాకు అప్పట్లో రెమ్యునరేషన్ విషయాకొస్తే కేవలం లక్షల్లోనే ఉండేవి. కానీ ఇప్పుడైతే కోట్లలోనే చూస్తున్నాం. (ఇది చదవండి: 'మీకు దమ్ముంటే హౌస్‌లోకి వెళ్లండి'.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన అఖిల్!) అంతకుముందు సినిమాల వరకు శివాజీ గణేశన్ పారితోషికం రూ.20 లక్షల వరకు తీసుకునేవారట. అయితే పాదయప్ప చిత్రానికి దాదాపు రూ.30 లక్షల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేశారట. కానీ రజినీకాంత్ శివాజీ గణేశన్‌కు జీవితాంతం గుర్తుండిపోయేలా రెమ్యునరేషన్ వచ్చేలా చేశారట. పాదయప్ప సినిమాకు ఏకంగా రూ.1.5 కోట్ల పారితోషికం ఇప్పించాడట. దీంతో వీరిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పదో అర్థమవుతోంది. అయితే ఆ సమయంలో కోటిన్నర రెమ్యునరేషన్ అంటే చాలా ఎక్కువే. శివాజీ గణేశన్ తీసుకున్న అత్యధిక పారితోషికం కూడా అదేనట. అయితే 1999లో ఈ సినిమా రిలీజ్ కాగా.. శివాజీ గణేశన్ 2001లో కన్నుమూశారు. -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్‌లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్‌లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్‌ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
టమాటాలు అమ్మి రూ. 38 లక్షలు.. రైతు పంట పండింది!
గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!) మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. -
నా సొంత డబ్బు 25 లక్షలు పెట్టి సెట్ వేస్తే ఆ పెద్ద ప్రొడక్షన్ వాళ్ళు కూల్చేశారు...
-
జీవితంలో ఒక్కసారైనా ఇలాంటి ఐస్‌క్రీమ్ తినగలమా..! ఎందుకంటే?
ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుని చూసుంటారు, బైకుని చూసుంటారు.. అంతెందుకు ఖరీదైన దుస్తులను కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ గురించి తెలుసుకోబోతున్నారు. ఐస్‌క్రీమ్ ఏంటి.. ఖరీదైనదేంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా, దీని ధర వెయ్యో, పదివేలో అనుకుంటే పొరపాటే. అక్షరాలా రూ. 5 లక్షల కంటే ఎక్కువ. జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఒకటైన 'సిలాటో' దీనిని తయారు చేసింది. ఇది బైకుయా అనే ప్రోటీన్ కలిగిన ఐస్‌క్రీమ్ కావడం విశేషం. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఐస్‌క్రీమ్'గా రికార్డుకెక్కింది. ఇంత ఖరీదైన ఐస్‌క్రీమ్ కూడా పాలతోనే తయారవుతుంది. కానీ ఇది వెల్వెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో చీజ్, గుడ్డులోని పచ్చ సోన వంటివి కలుపుతారని సమాచారం. వీటితో పాటు ఇందులో పర్మిజియానో చీజ్, వైట్ ట్రఫుల్, ట్రఫుల్ ఆయిల్, గోల్డ్ లీఫ్ ఉంటాయి. ఈ మొత్తం ఐస్‌క్రీమ్ ఒక స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో ప్యాక్ చేస్తారు. ఇది చూడటానికి సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీనిని తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం. దీనిని క్యోటోకి చెందిన హస్తకళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు. (ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!) కేవలం 130ml ఐస్‌క్రీమ్ ధర కంపెనీ వెబ్సైట్లో అక్షరాలా 8,80,000 యెన్స్ అంటే అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 6వేల డాలర్ల కంటే ఎక్కువ, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5 లక్షలకంటే ఎక్కువ. ఈ ఐస్‌క్రీమ్ తినటానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమి ఉండదు, కావున దీనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ధర ఎక్కువ కావడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. -
ఏం తెలివిరా నాయనా! ఏకంగా రూ. 64 లక్షలు..
విమానాశ్రయంలో తరుచుగా అక్రమంగా బంగారం, జంతువులు, డబ్బులు తరలిస్తున్న ఘటనలు గురించి విని ఉన్నాం. అదీకూడా వాళ్లకు ఊహకందని విధంగా భలే విచిత్రమైన రీతిలో తరలించిన ఉదంతాలను చూశాం. వాటన్నింటికి మించి అన్నట్లుగా ఇక్కడొక వ్యక్తి ట్రాలీ బ్యాంగ్ హ్యండిల్లో నగదును తరలించాలని చూసి పట్టుబడ్డాడు. వివరాల్లోకెళ్తే...ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుందర్ సింగ్ రిహాల్ అనే వ్యక్తి చెకింగ్ సమయంలో అతని వద్ద సరైన విధంగా డాక్యుమెంట్స్ లేకపోవడంతో అతన్ని ఆపారు. ఆ తర్వాత అతన్ని తనిఖీ చేస్తుండగా అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో.. అధికారుల కస్టమ్స్ అధికారుల వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ స్కాన్ చేయగా ట్రాలీ బ్యాగులో ఏదో ఉన్నట్లు చూపించడంతో ఇంకా క్షుణ్ణంగా తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలో ట్రాలీ హ్యండిల్లో దాచిన విదేశీ కరెన్సీని నెమ్మదిగా బయటకు తీశారు. ఏకంగా మొత్తం రూ. 65 లక్షలు తరలించేందకు యత్నించినట్లు అధికారులు వెల్లడించారు. అందులో సుమారు రూ. 60 లక్షలకు సంబంధించి సుమారు 68 వేల యూరోల కరెన్సీ, రూ. 4లక్షలకు సంబంధించిం న్యూజిలాండ్‌కి చెందిన 5 వేల డాలర్లు ఉన్నాయని చెప్పారు. ఐతే నిందితుడు భారీ మొత్తంలో అంత నగదు తరలించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించడంలో విఫలమయ్యాడని కస్టమ్స్ అధికారులు తెలిపారు. దీంతో అతని వద్ద నుంచి భారీ మొత్తంలో ఉన్న ఆ నగదును స్వాధీనం చేసుకోవడమే గాక అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాస్తవానికి ఆ ప్రయాణికుడు థాయ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టీహెచ్-332లో బ్యాంకాక్‌కు వెళ్లాల్సి ఉంది. #CISF personnel detected foreign currency (Euro & New Zealand Dollars) worth approx INR 64 lakh concealed inside handle of Trolley Bag at IGI Airport.@CISFHQrs @HMOIndia @PMOIndia @UpendrraRai @BhaaratExpress @AAI_Official @DelhiAirport pic.twitter.com/ERRNZjRCVl — Mitalli Chandola 🇮🇳 (@journomitalli1) January 29, 2023 (చదవండి: చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన రాహుల్) -
చదివింది ఎనిమిదో తరగతి..డజను మంది మహిళలకు టోకరా
న్యూఢిల్లీ: ఎనిమిదో తరగతి చదివిన వ్యక్తి ఏకంగా డజను మంది మహిళలను మోసం చేసి లక్షల్లో డబ్బు కాజేశాడు. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వికాస్ గౌతమ్ అనే మధ్యప్రదేశ్‌లోని గాల్వియర్ నివాసి వికాస్ యాదవ్ అనే పేరుతో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్‌గా ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ ట్విట్టర్లలో ఐడీ క్రియేట్ చేశాడు. ఆఖరికి ప్రోఫైల్ పోటో కూడా ఒక గవర్నమెంట్ కారు పక్కన నిలబడి తీసుకున్న ఫోటోను పెట్టడంతో పలువురు సులభంగా అతని చేతిలో మోసపోయారు. ఈ మేరకు ఢిల్లీలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఒక మహిళ వైద్యురాలు ఆన్లైన్లో అతడితో ఒక రోజు చాటింగ్ చేసింది. ఆ తర్వాత అతడిపై నమ్మకం ఏర్పడటంతో తన వివరాలన్ని చెప్పింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకుని ఏకంగా రూ. 25 వేలు బ్యాంకు నుంచి డ్రా చేశాడు. దీన్ని గమనించిన సదరు మహిళా డాక్టర్ ఆ వ్యక్తిని ఫ్రాడ్‌గా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకుంది. ఐతే ఆ వ్యక్తి తాను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పడంతో రాజకీయనాయకుల అండదండ ఉండి ఉంటుందని భావించి తొలుత వెనక్కు తగ్గింది. ఎట్టకేలకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వికాస్ గౌతమ్ అరెస్టు అయ్యాడు. ఆ తర్వాత అతను విచారణలో డజను మంది మహిళల నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు తేలింది. అతను ఎనిమిదో తరగతి మాత్రమే చదివాడని, ఆ తర్వాత అతను ఇండస్ట్రీయల్ కోర్సు కూడా పూర్తి చేసినట్లు పోలీసులుల తెలిపారు. నిందితుడు వికాస్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో కూడా పనిచేసేవాడని తెలిపారు. అది సివిల్ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన ప్రాంతం అని, అక్కడ కోచింగ్ తీసుకునే విద్యార్థులను చూసి ఈ నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ అవతారం ఎత్తాడని చెప్పారు. పోలీసులు వికాస్ నేర చరిత్రను తిరగదోడారు. అతడు గతంలో ఉత్తప్రదేశ్, గాల్వియర్లలో పలు ఆరోపణలపై జైలుకు కూడా వెళ్లినట్లు తెలిపారు. (చదవండి: ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలంటే..హిందీతోనే వర్క్ ఔట్ అవ్వదు! రాహుల్ కీలక వ్యాఖ్యలు) -
అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష
సాక్షి, యశవంతపుర: చెక్‌బౌన్స్ కేసులో కోలారు జిల్లా మాలూరు ఎమ్మెల్యే కెవై నంజేగౌడకు బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టు రూ.49.65 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. మలూరుకు చెందిన జి రామచంద్ర అనే వ్యక్తి నుంచి నంజేగౌడ రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఎన్నేళ్లయినా అప్పు చెల్లించలేదు. దీంతో బెంగళూరులోని ప్రజాప్రతినిధుల 24వ ఎసీఎంఎం కోర్టులో ఆయన వ్యాజ్యం వేశారు. కేసు విచారణ చేసిన న్యాయమూర్తి జె ప్రీతి అసలు, వడ్డీ కలిసి రూ. 49.65 లక్షలు ఎమ్మెల్యే నంజేగౌడ చెల్లించాలని తీర్పు చెప్పారు. లేని పక్షంలో ఆరు నెలలు జైలుశిక్ష అనుభవించాలని ఆదేశించారు. (చదవండి: వయసులో మూడేళ్లు చిన్నోడితో లివ్ ఇన్ రిలేషన్.. పెళ్లి చేసుకోమని అడిగితే దారుణంగా..) -
12.15 లక్షల మందికి ఎంఆర్ వ్యాక్సిన్లు
–కలెక్టర్ కార్తికేయ మిశ్రా కంబాలచెరువు (రాజమహేంద్రవరం సిటీ): జిల్లాలో 12.15 లక్షల మందికి రుబెల్లా, మీజిల్స్ (ఎంఆర్) వ్యాక్సిన్స్ వేసేందుకు రంగం సిద్ధం చేశామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. రాజమహేంద్రవరంలోని హోటల్ లాహాస్పిన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శుక్రవారం మాట్లాడుతూ జిల్లాలో తొమ్మిది నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు 12 లక్షల 15 వేల మంది ఉన్నారన్నారు. రాజమహేంద్రవరం, కాకినాడతో పాటు ఏడు మున్సిపాల్టీల్లో ఆగస్టు ఒకటి నుంచి ఐదో తేదీ వరకు వ్యాక్సిన్లు వేస్తారని, సెప్టెంబర్ ఎనిమిదో తేదీ వరకు జిల్లా అంతటా ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 8 లక్షల 15 వేల 327 మంది, నగర పట్టణ ప్రాంతాల్లో 3 లక్షల తొమ్మిదివేల 543 మంది, ఏజన్సీల్లో లక్షా మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసేందుకు ప్రణాళిక రూపొందించామన్నారు. దీన్ని వేసేందుకు జిల్లావ్యాప్తంగా 5 వేల 500 మంది అంగన్వాడీ సిబ్బంది, 4 వేల 600 మంది ఆశావర్కర్లు, 3 వేల 500 మంది సూపర్‌వైజర్స్‌ను నియమించామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జ్వరం వచ్చినా కంగారు పడనవసరంలేదని, దీనిపై వీఆర్వోలు, వీఆర్ఏలు, గ్రామ కార్యదర్శులు, కమ్యూనిటీ హెల్త్‌వర్కర్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాక్సిన్‌ను అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు, జిల్లా ఆరోగ్యశాఖాధికారి కె.చంద్రయ్య, ఎం.మల్లిక, డాక్టర్ పి.కోమల పాల్గొన్నారు. ప్రణాళికా బద్ధంగా లబ్ధిదారుల ఎంపిక – ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ కార్పొరేషన్ల సమీక్షలో కలెక్టర్ కాకినాడ సిటీ : వివిధ కార్పొరేషన్లకు సంబంధించి 2017–18 సంవత్సారానికి ఉపాధి యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ఆగస్టు ఒకటి నుంచి 11వ తేదీ వరకు బ్యాంకుల బ్రాంచీల వారీగా ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కోర్టు హాలులో బ్యాంకర్లు, సంక్షేమ కార్పోరేషన్ల అధికారులతో సమావేశం నిర్వహించారు. 2016–17 లక్ష్యాల ప్రగతి, 2017–18 సంవత్సర లబ్ధిదారుల ఎంపికకు ఇంటర్వ్యూల నిర్వహణ, ప్రణాళిక అంశాలపై సమీక్షించారు. సంక్షేమ కార్పొరేషన్ రుణాల పంపిణీలో ప్రస్తుతం జిల్లా 6వ స్థానంలో ఉందని, ఈ నెలాఖరులోపు మరిన్ని యూనిట్లకు రుణాలు జారీ చేసి జిల్లాను 2వ స్ధానంలో నిలపాలని సూచించారు. ఈ ఎంపికలకు బ్రాంచి మేనేజర్లు గైరుహాజరైనా, సహకరించకపోయినా చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ డేవిడ్‌రాజు, బీసీ కార్పోరేషన్ ఈడీ జ్యోతి, ఎల్డీఎం సుబ్రహ్మణ్యం, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. -
సత్యదేవుని ఆదాయానికి ‘క్షవరం’
- అన్నవరం దేవస్థానంలో రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయం - రూ.1.28 కోట్లకు వేలం పాడిన టీడీపీ నేత - షరతుల ప్రకారం సగం సొమ్ము చెల్లించకుండానే మూడు నెలల తలనీలాల తరలింపు - కుమ్మక్కైన సిబ్బంది - ఆలస్యంగా గుర్తించిన అధికారులు - గుమస్తా సస్పెన్షన్.. ఇద్దరికి ఛార్జ్ మెమోలు అన్నవరం : బీహార్‌లో పశువుల దాణాను మేసేసిన ప్రబుద్ధుల గురించి విన్నాం. రాష్ట్రంలో ఇసుక బుక్కేస్తున్న బకాసురుల బాగోతాలను రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుని ఆదాయానికి కొంతమంది సిబ్బంది క్షవరం చేసేశారు. 18 రోజుల కాలానికి భక్తులు సమర్పించిన రూ.7 లక్షల విలువైన తలనీలాలు మాయమయ్యాయి. దాదాపు ఆరు నెలల కిందట జరిగిన ఈ వ్యవహారం బయటకు వెల్లడి కాకుండా కొందరు అధికారులు గోప్యత పాటించారు. ఎట్టకేలకు ఆ బాగోతం బయట పడడంతో కేశఖండన శాల గుమస్తాను సస్పెండ్ చేసి, సంబంధిత సూపరింటెండెంట్, ఏఈఓలకు మెమోలు జారీ చేసినట్లు ఈఓ కె.నాగేశ్వరరావు ఆదివారం విలేకర్లకు తెలిపారు. అసలేం జరిగిందంటే.. పలువురు భక్తులు సత్యదేవునికి తలనీలాలు సమర్పిస్తూంటారు. అలా వచ్చిన తలనీలాలను దేవస్థానం ఏడాది ముందే టెండర్ కం వేలంపాట ద్వారా విక్రయిస్తుంది. పాటదారు ఆ ఏడాదంతా ఆ తలనీలాలను సేకరించుకోవాలి. గత ఏడాది ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి ఈ ఏడాది జూలై 31 వరకూ తలనీలాలు పోగు చేసుకుని, తీసుకునే హక్కును తుని మునిసిపాలిటీలో కీలక పదవిలో ఉన్న ఓ టీడీపీ నాయకుడు రూ.1.28 కోట్లకు దక్కించుకున్నారు. టెండర్ షరతుల ప్రకారం సగం మొత్తం అంటే రూ.64 లక్షలు చెల్లించాలి. అనంతరం తలనీలాలు తీసుకోవాలి. దీని ప్రకారం ఆ పాటదారు డిపాజిట్ రూపంలో రూ.10 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తంలో రూ.18 లక్షలు నగదు, మిగిలిన మొత్తానికి చెక్కులు ఇచ్చాడు. అయితే ఆ చెక్కులు మారలేదు. దీంతో టెండర్ నిబంధనల ప్రకారం సగం సొమ్ము చెల్లించనందున, భక్తులు సమర్పించిన తలనీలాలను ఒక గదిలో దాచి ఉంచారు. దీనికి అటు దేవస్థానం అధికారులు, ఇటు పాటదారుని వద్ద పని చేసేవారు రెండు తాళాలు వేసి జాయింట్ కస్టడీలో ఉంచుకున్నారు. అయితే పాట పాడిన వ్యక్తి అధికార టీడీపీ నాయకుడు కావడంతో ఏ ఒత్తిళ్లు వచ్చాయో ఏమో కానీ నిబంధనలకు విరుద్ధంగా తలనీలాలు తీసుకువెళ్లడానికి సంబంధిత అధికారులు అనుమతించారు. దీంతో గదిలో భద్రపరచిన మూడు నెలల తలనీలాలను అక్టోబర్ 29న పాటదారుకు అప్పగించారు. ఆ మర్నాటి నుంచి భక్తులు సమర్పించిన తలనీలాలను పాటదారుకు ఇవ్వకుండా ప్రతి రోజూ కేశఖండన శాల సిబ్బంది గ్రేడింగ్ చేసి భద్రపర్చాలి. అయితే అధికారుల నుంచి తమకు అటువంటి ఆదేశాలు లేనందున తలనీలాలు ఉన్న గదికి తాళం వేయలేదని సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. మొత్తానికి ఏం జరిగిందో కానీ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకూ వచ్చిన తలనీలాలు మాయమయ్యాయి. ఏ రోజు ఎంత మొత్తంలో తలనీలాలు వచ్చాయన్న ఆధారాలు కూడా లేవు. దీంతో పాటదారు తరఫు మనుషులతో సిబ్బంది కుమ్మక్కై తలనీలాలను తరలించేసి, సొమ్ము చేసుకున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విచారణకు ఆదేశించాం తలనీలాలు మాయమైన వ్యవహారంలో కేశఖండన శాల గుమస్తా ఎం.రామకృష్ణను సస్పెండ్ చేశాం. ఈ వ్యవహారంపై సంజాయిషీ ఇవ్వాల్సిందిగా సూపరింటెండెంట్ జి.సత్యనారాయణ, ఏఈఓ సాయిబాబాలకు ఛార్జి మెమోలు జారీ చేశాం. పెద్ద పెద్ద స్కామ్‌లు కూడా చాలా కాలం తరువాతే వెలుగు చూస్తాయి. ఇదీ అంతే. ఆరు నెలల క్రితం జరిగినా అందుకే మా దృష్టికి రాలేదు. పాటదారు చెల్లించిన సొమ్ము మేరకే తలనీలాలు తీసుకువెళ్లేందుకు అనుమతించాం. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించాం. నవంబర్ 17 నుంచి తలనీలాలను భద్రపరుస్తున్నాం. పూర్తి సొమ్ము కట్టని పాటదారుపై కేసు వేశాం. పాత వేలం రద్దు చేసి కొత్తగా వేలం నిర్వహిస్తాం. - కె.నాగేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం -
పాపా! నీ శ్వాసకు మేమిస్తాం భరోసా!
-ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తకు అభయహస్తం -రూ.1.7 లక్షల సాయం అందించిన చినమిల్లి సోదరులు పి.గన్నవరం : అణువణువునా ఉత్సాహం తొణుకుతూ, అనాయాసంగా ఆటలాడాల్సిన ఈడులోనే ఆ పాపకు నాలుగడుగులు నడిస్తేనే రొప్పు తప్పడం లేదు. చిన్నవయసులోనే పెద్ద సమస్య వచ్చిపడ్డ ఆమె బతుకుకు కొత్త ఊపిరినిచ్చేందుకు ముందుకు వచ్చారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న చినమిల్లి వెంకట రామకృష్ణ (అమెరికా), కొండయ్యనాయుడు (హైదరాబాద్) సోదరులు. కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న పి.గన్నవరం శివారు బోడపాటివారిపాలేనికి చెందిన ఏడేళ్ల సారిక హారికాప్రియకు ఆమె తల్లిదండ్రులు ఇప్పటికే మూడు లక్షల అప్పుచేసి వైద్యం చేయించారు. మరో నాలుగు లక్షలు అవసరం కావడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. విషయం తెలిసిన రామకృష్ణ, కొండయ్యనాయుడు హృదయం కదిలి వైద్యం నిమిత్తం తమ తల్లిదండ్రులు భుజంగరావు, అనంతలక్ష్మిల ద్వారా శుక్రవారం రూ.1.7 లక్షల సాయం అందించారు. ఈ సందర్భంగా వారికి బాలిక తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలపగా పలువురు అభినందించారు. అనంతరం భుజంగరావు, అనంతలక్ష్మి పి.గన్నవరం సీహెచ్‌సీకి సైకిలును బహూకరించారు. మాజీ సర్పంచ్ యడ్లపల్లి పెద్దబ్బులు, రుద్రా సుబ్బారావు, సాధనాల శ్రీనివాసరావు, గణేశుల చినకొండలరావు, సుబ్బారాయుడు, అడ్డగళ్ల నానాజీ, సాధనాల ఎస్పీ, కాళీకృష్ణ, నల్లా పెదకాపు, సుంకర రాంబాబు, యడ్లపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
మార్చి లోగా 1.5లక్షల ఉద్యోగాలు
► పరిశ్రమల స్థాపనలో సమస్యలకు నెల రోజుల్లో పరిష్కారం ► జనవరి 27 నుంచి భాగస్వామ్య సదస్సు ► 4 జిల్లాల పారిశ్రామిక వేత్తల సమావేశంలో సీఎస్ టక్కర్ సాక్షి, విశాఖపట్నం: రానున్న రెండేళ్లలో ఐటీ, ఫార్మాస్యూటికల్స్, ఎన్నారై కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టబోతున్నాయని, తద్వారా 15 శాతం వృద్ధిరేటును ఏపీ సాధించబోతోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పి టక్కర్ వెల్లడించారు. వచ్చే మార్చి కల్లా లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించే దిశగా కృషిచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన భాగస్వామ్య సదస్సులో ఎంవోయూ చేసుకున్న పరిశ్రమల స్థాపనలో ఎదురవుతున్న సమస్యల్ని నెల రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఉత్తరాంధ్ర, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో గురువారం విశాఖలోని ఓ హోటల్లో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పరిశ్రమల స్థాపనలో భూ సంబంధ, విద్యుత్, అగ్నిమాపక, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక, సేల్స్‌టాక్స్ శాఖల నుంచి ఎదురవుతున్న సమస్యల పరిష్కారంలో ఆయా శాఖలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని పలువురు పారిశ్రామిక వేత్తలు సీఎస్ దృష్టికి తీసు కొచ్చారు. మీ వల్ల పారిశ్రామికీకరమ మందగించే ప్రమాదం ఉందని సీఎస్ సంబంధిత అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన 150 దరఖాస్తులు సీఐఐ వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, ముఖ్యంగా అగ్నిమాపక శాఖ అభ్యంతరాలే ఎక్కువగా ఉన్నాయన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే అగ్నిమాపక శాఖ అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వచ్చే వారంలో విజయవాడలో మరో సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, అగ్నిమాపక శాఖాధికారులంతా విధిగా హాజరు కావాలని ఆదేశించారు. పర్యాటక రంగానికి సంబంధించి 23 కంపెనీలతో ఎంవోయూలు జరగ్గా మూడు మాత్రమే ఇప్పటివరకు తుదిరూపు దాల్చాయన్నారు. వచ్చే నెల 27 నుంచి 29 వరకు మూడ్రోజుల పాటు విశాఖలో మరోసారి సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. విశాఖలో 94 పరిశ్రమలకు ఆడిట్ చేయగా, కేవలం 12 పరిశ్రమలు తప్ప మిగిలిన పరిశ్రమలేవీ ప్రమాణాలకనుగుణంగా నడవడం లేదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టంచేశారు. కేవలం 16 కంపెనీలు మాత్రమే ఇప్పటివరకు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చాయన్నారు. ఉత్తరాంధ్రలో ఉన్న 3300 కంపెనీలను ఒకే ప్లాట్‌ఫారంపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ డీఎం ఎం.నాయక్ అన్నారు. వారంతా కైజాలా యాప్ ద్వారా ఒకే గ్రూపులోనికి రావాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య, సీఐఐ చైర్మన్ శివకుమార్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుమెంబర్ సెక్రటరీ బీఎస్ఎస్ ప్రసాద్, నాలుగు జిల్లాల పరిశ్రమల శాఖల అధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. -
పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు స్వాధీనం
బాసర: ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న క్లబ్‌పై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు, 100 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మహారాష్ట్రలోని నాయిగాం గ్రామంలోని క్లబ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన 100 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
గుంటూరులో ఘరానా మోసం