తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు రావాలంటే.. 'మ్యూచువల్ ఫండ్స్' (Mutual Funds) ఉత్తమ ఎంపిక. ఇప్పటికే రోజుకు 50 రూపాయల పెట్టుబడితే.. కోటి రూపాయలు ఎలా సంపాదించాలి? నెలకు రూ. 10వేలు పెట్టుబడిగా పెడుతూ.. రూ.7 కోట్లు ఎలా పొందాలి? అనే విషయాలను తెలుసుకున్నాం. ఈ కథనంలో నెలకు రూ.7,000 పెట్టుబడి పెడితే.. రూ.32 లక్షలు ఎలా వస్తాయి? దీని కోసం ఎన్ని సంవత్సరాలు వేచి చూడాలి అనే విషయాలు తెలుసుకుందాం.
రూ.7వేలుతో.. 32 లక్షల రూపాయలు
నెలకు రూ.7000 చొప్పున 15 సంవత్సరాలు పెట్టుబడి పెడితే.. మీ ఇన్వెస్ట్మెంట్ (Investment) రూ. 12,60,000 అవుతుంది. దీనికి 11 శాతం రాబడిని ఆశిస్తే.. రిటర్న్స్ రూ. 19,52,003 వస్తాయి. పెట్టుబడి, రిటర్న్స్ కలిపితే 15 ఏళ్లలో మీకు వచ్చే మొత్తం రూ. 32,12,003.
మీరు ఎక్కువ లాభాలను పొందాలంటే.. తప్పకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు (Long Term Investment) పెట్టడానికి ప్లాన్స్ వేసుకోవాలి. అంతే కాకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు ఎంత తొందరగా ప్రారంభిస్తే.. మీకు లాభాలు కూడా అంత వేగంగానే వస్తాయి. ఉదాహరణకు, మీరు 20 ఏళ్ల వయసులో పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే.. 35 సంవత్సరాలకు రూ.32 లక్షలు వస్తాయి.
పెట్టుబడులు ఆలస్యం చేస్తే.. లాభాలను పొందటానికి కొంత ఎక్కువ సమయం వేచి చూడాల్సి ఉంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా ఇన్వెస్ట్మెంట్స్ ప్రారంభించాలి.
ఇదీ చదవండి: రోజుకు రూ.50 పెట్టుబడి: ఆదాయం రూ.కోటి
గమనిక: పెట్టుబడి పెట్టేవారు, ముందుగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే పెట్టుబడి అనేది ఒకరు ఇచ్చే సలహా కాదు. అది పూర్తిగా మీ వ్యక్తిగతం. కాబట్టి మీ ఆర్థిక ప్రణాళిక కోసం తప్పకుండా నిపుణులను సంప్రదించండి. ఆ తరువాత ఎక్కడ పెట్టుబడి పెట్టాలో నిర్ణయించుకోండి. అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే వచ్చే డబ్బు రాబడుల మీద ఆధారపడి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment