గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు.
ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు.
(ఇదీ చదవండి: జీఎస్‌టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!)
మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment