tomato cost
-
టమాటా ధరలు ఢమాల్
-
టమాటాలు అమ్మి రూ. 38 లక్షలు.. రైతు పంట పండింది!
గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!) మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. -
టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి..
వారణాసి: యూపీలోని ఓ కాయగూరల వ్యాపారి తన షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను నియమించాడు. ఉన్నట్టుండి టమాటాల ధర ఆకాశాన్నంటడంతో కస్టమర్లతో ఇబ్బంది అవుతోందని బౌన్సర్లను పెట్టుకున్నట్లు చెబుతున్నాడు షాపు యజమాని. ఆ కాయగూరల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160కి చేరింది. దీంతో టమాటాలు కొనడానికి వచ్చేవారు ఇక్కడ ఘర్షణలకు పాల్పడుతున్నారు. కొంత మంధైతే టమాటాలను దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని తెలిపాడు. టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.160గా ఉంది. షాపుకి వచ్చేవారు కూడా 50 గ్రాములు, 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని, మా షాపులో టమాటాలు దండిగా ఉన్నందున ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా చూసేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని తెలిపాడు. కూరగాయల షాపు ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారు. VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. "I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux — Press Trust of India (@PTI_News) July 9, 2023 ఇది కూడా చదవండి: మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా? -
టమాటా ‘ధర’హాసం
లావేరు: టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల కిందట కిలో రూ.20 ఉండగా ఆదివారం నాటికి రూ.60కు చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంతలా ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాము టమాటా పంట పండించిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10వరకు ఉందని, ఇప్పుడు రూ.60కి చేరిన సమయంలో తమ వద్ద పంట లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అవుతుండటం వల్లనే టమాటా పంటకు ధర ఉండటం లేదని, రైతులు వద్ద లేని సమయంలో మంచి ధర ఉంటోందని అంటున్నారు. (చదవండి: పూజించారు.. పట్టుకుపోయారు) -
అక్కడ కిలో టమాట రూ 100
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులను తాజాగా టమాట మంటెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా టమాట ధరలు కొండెక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో టమాట రూ 80 పలికింది.దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టమాట రిటైల్ ధరలు భారమయ్యాయి.మిజోరాంలో కిలో టమాట రూ 100కు పెరిగి జనానికి చుక్కలు చూపుతోంది. ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. మరోవైపు టమాటకు అతిపెద్ద మార్కెట్ అయిన బెంగుళూర్లో టమాట ధరలు కిలో రూ 45 నుంచి రూ 50 వరకూ పలుకుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ 90 శాతం పంట దెబ్బతినడంతో టమాటకు రెక్కలు వచ్చాయని, రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్‌పూర్ మండీలో టమాట మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు. -
ధర ఢమాల్.. రైతు కుదేలు
- నష్టాల బాటలో టమాట రైతులు - కూలిఖర్చులు కూడా గిట్టుబాటు కాని వైనం - పొలాల్లోనే వదిలేస్తున్న రైతులు అనంతపురం రూరల్ : మార్కెట్లో టమాట ధర ఒక్కసారిగా పడిపోయింది. ప్రస్తుతం కిలో రూ.2 మాత్రమే పలుకుతోంది. దీంతో 90రోజుల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన రైతు కంట కన్నీరు ఉబుకుతోంది. ఎకరా పంట సాగుకు రైతులు రూ.40వేలు పెట్టుబడి పెడుతున్నారు. దీనికి తోడు కూలీ, రవాణ ఖర్చులు అదనంగా రూ.15వేలు కలిపి మొత్తం రూ. 55వేలు వెచ్చిస్తున్నారు. పంట ఆశాజనకంగా ఉంటే 25టన్నుల మేర ఎకరాకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టమాట కేజీ రూ.2 ధర పలుకుతోంది. ఈలెక్కన 25టన్నుల టమాటను రైతు అమ్మితే ఆయనకు వచ్చేది రూ.50వేలు కాగా అన్నీ పోనూ రూ.ఐదువేల నష్టం వాటిల్లుతోంది. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత రబీలో 15వేల ఎకరాల్లో రూ.83 కోట్లు వెచ్చించి బోరు బావులున్న 10వేల మంది రైతులు టమాట పంటను సాగు చేస్తున్నారు. చీడ పీడల నుంచి పంటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. తీరా పంటను విక్రయించుకోవడానికి మార్కెట్‌కు తీసుకువస్తే గిట్టుబాటు ధరలేక కుదేలవుతున్నారు. కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో వ్యవసాయమే దండగా అనే పరిస్థితికి వచ్చారు. మద్దతు ధర కల్పించి రైతులకు చేదోడు వాదోడుగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో టమాట రైతులు నిలువునా నష్టపోతున్నారు. వెంటనే అధికారులు, పాలకులు స్పందించి రైతుకు గిట్టుబాటయ్యేలా మద్దతు ధర కల్పించాలని కోరుతున్నారు. రవాణ, కూలీ ఖర్చులకే సరి .. రూ.2లక్షలు పెట్టుబడి పెట్టి నాలుగెకరాల్లో టమాట పంట సాగు చేశా. ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. ప్రస్తుతం 152 టమాట బాక్సులను మార్కెట్‌కు తీసుకొచ్చా. గిట్టుబాటు ధర లేక ఒక్కో బాక్స్‌ను కేవలం రూ.30కే వదులుకోవాల్సి వచ్చింది. వచ్చిన సొమ్ము కాస్తా రవాణ ఖర్చులు కమీషన్‌కే సరిపోయింది. – నారాయణ, పిల్లలపల్లి, బ్రహ్మసముద్రం మండలం టమాటకు గిట్టుబాటు ధర కల్పించాలి టమాటకు గిట్టుబాటు ధరలేక కిలో రూ.2 నుంచి 3కే అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ప్రస్తుతం ఈ సీజన్లోనే ఎక్కువ మంది రైతులు టమాట పంట సాగు చేస్తారు. రైతుకు గిట్టుబాటు అయ్యేలా ధరను మార్కెటింగ్ శాఖ అధికారులు నిర్ణయించి టమాట రైతును ఆదుకోవాలి. –రామకృష్ణా, హంపాపురం వచ్చిన కాటికి ముకోవాల్సిందే మార్కెట్‌కు తీసుకువచ్చిన టమాట పంటను గిట్టుబాటు ధర ఉన్న లేకపోయిన పంటను మాత్రం అమ్ముకోవాల్సిందే. గిట్టుబాటు ధరలేదని వెనుక్కు తీసుకెళ్లే పరిస్థితి లేదు. – శ్రీనివాసులు, గంగంపల్లి, రామిగిరి మండలం