సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులను తాజాగా టమాట మంటెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా టమాట ధరలు కొండెక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో టమాట రూ 80 పలికింది.దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టమాట రిటైల్ ధరలు భారమయ్యాయి.మిజోరాంలో కిలో టమాట రూ 100కు పెరిగి జనానికి చుక్కలు చూపుతోంది.
ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. మరోవైపు టమాటకు అతిపెద్ద మార్కెట్ అయిన బెంగుళూర్‌లో టమాట ధరలు కిలో రూ 45 నుంచి రూ 50 వరకూ పలుకుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోనూ 90 శాతం పంట దెబ్బతినడంతో టమాటకు రెక్కలు వచ్చాయని, రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్‌పూర్ మండీలో టమాట మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment