supplies
-
గోనె సంచుల సమస్యకు చెక్
సాక్షి, అమరావతి: ఖరీఫ్ 2023–24 ధాన్యం సేకరణకు ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రా (ఆర్బీకే)ల ద్వారా 40 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు సమాయత్తం అవుతోంది. ఇందులో 5 లక్షల టన్నుల వరకు బాయిల్డ్ రకాలను కొనుగోలు చేసేలా లక్ష్యం నిర్దేశించింది. ముఖ్యంగా ధాన్యం తరలింపులో గోనె సంచుల సమస్యను అధిగమించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, చౌక దుకాణాలతో పాటు మిల్లర్ల నుంచి పెద్దఎత్తున గోనె సంచులను సేకరించి.. ముందస్తుగా ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రూపొందించింది. వాస్తవానికి ప్రభుత్వం రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ కోసం మిల్లులకు తరలిస్తోంది. ఇక్కడ మిల్లులు తమ సామర్థ్యానికి అనుగుణంగా చేసిన ధాన్యం కేటాయింపులకు తగినన్ని గోనె సంచులను ముందుగానే ఆర్బీకేలకు సమకూర్చాలంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్దేశపూరకంగా మిల్లర్లు సహకరించకుంటే వారిని కస్టమ్ మిల్లింగ్ నుంచి తొలగించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. వినియోగ చార్జీలు చెల్లింపు కేంద్ర ప్రభుత్వ నిబంధల ప్రకారం గోనె సంచుల (ఇప్పటికే ఒకసారి వినియోగించినవి) వినియోగానికి అయ్యే చార్జీలను సైతం మిల్లర్లకు ఇవ్వనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక మిల్లర్లు ఇచ్చే గోనె సంచుల నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వాటిని ధాన్యం నింపడానికి వినియోగించనున్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సబ్ కలెక్టర్/ఆర్డీవోలు తమ పరిధిలోని మొత్తం కొనుగోళ్ల ప్రక్రియ, రైస్ మిల్లర్ల నుంచి గోనె సంచుల సేకరణను పర్యవేక్షించనున్నారు. ఆయా సీజన్లలో కొనుగోళ్లు పూర్తయిన తర్వాత మిల్లర్లు సరఫరా చేసిన గోనె సంచులను తిరిగి అప్పగించనున్నారు. -
ఆటుపోట్లలో ఆటో పరిశ్రమ
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమ సరఫరా వైపు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆటోమొబైల్ ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు వాహనాల సరఫరా 4 శాతం తక్కువగా ఏప్రిల్‌లో నమోదైంది. పరిశ్రమకు సరఫరా వైపు సవాళ్లు నెలకొని ఉన్నట్టు ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) తెలిపింది. ఏప్రిల్‌లో దేశీయ హోల్‌సేల్ ప్యాసింజర్ హోల్‌సేల్ వాహన విక్రయాలు 2,51,581 యూనిట్లుగా ఉంటే, అంతక్రితం ఏడాది ఇదే నెలలో 2,61,633 యూనిట్లుగా ఉన్నాయి. ప్యాసింజర్ కార్ల విక్రయాలు గత నెలలో 1,12,857 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో ప్యాసింజర్ కార్ల విక్రయాలు 1,41,194 యూనిట్లుగా ఉండడం గమనించాలి. యుటిలిటీ వాహన హోల్‌సేల్ విక్రయాలు 1,27,213 యూనిట్లు, వ్యాన్ డిస్పాచ్‌లు 11,568 యూనిట్లుగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల్లో వృద్ధి ప్యాసింజర్ వాహనాలకు భిన్నంగా ద్విచక్ర వాహనాల విక్రయాలు ఏప్రిల్‌లో పెరిగాయి. 15 శాతం అధికంగా 11,48,696 వాహనాలు ఫ్యాక్టరీల నుంచి డీలర్లకు సరఫరా అయ్యాయి. 2021 ఏప్రిల్‌లో ఇవి 9,95,115 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఇందులో మోటారుసైకిళ్ల అమ్మకాలు 6,67,859 యూనిట్ల నుంచి 7,35,360 యూనిట్లకు పెరిగాయి. స్కూటర్ల డిస్పాచ్‌లు 3,01,279 యూనిట్ల నుంచి 3,74,556 యూనిట్లకు పెరిగాయి. త్రిచక్ర వాహనాల అమ్మకాలు ఏప్రిల్‌లో 20,938 యూనిట్లుగా ఉన్నాయి. 2021 ఏప్రిల్‌లో తిచక్ర వాహన అమ్మకాలు 13,856 యూనిట్లుగా ఉన్నాయి. 2017 కంటే తక్కువే.. ‘‘ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ 2017 ఏప్రిల్ నెల గణాంకాల కంటే తక్కువగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 2012 ఏప్రిల్ నెల కంటే తక్కువగా ఉన్నాయి’’ అని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. తిచక్ర వాహనాల విక్రయాలు సాధారణ స్థాయికి చేరుకోవాల్సి ఉందని, 2016 ఏప్రిల్‌లో నమోదైన గణాంకాల కంటే ఇంకా 50 శాతం తక్కువగా ఉన్నట్టు చెప్పారు. సరఫరా వైపు సమస్యలు ఉన్నా.. అధిగమించేందుకు శ్రమిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల రెపో రేటు పెంపుతో రుణ రేట్లు పెరగనున్నాయని, డిమాండ్‌పై దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందో చూడాల్సి ఉందని రాజేష్ మీనన్ తెలిపారు. చదవండి: జొమాటో సీఈవో దీపిందర్ గోయల్‌కు భారీ షాక్, బెడిసి కొట్టిన మాస్టర్ ప్లాన్! -
ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కరోనా ముప్పు విషయంలో వాస్తవ క్షేత్రస్థాయి పరిస్థితులను గుర్తించకుండా భ్రమల్లో జీవిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పుత్నిక్ వీ టీకాను భారత్‌లో పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడాన్ని ఒక మంచి అవకాశంగా గుర్తించడం లేదని వ్యాఖ్యానించింది. దేశంలో కరోనా బారినపడని కుటుంబం ఒకటి కూడా లేదని పేర్కొంది. ఈ దేశాన్ని ఇక దేవుడే రక్షించాలని కఠిన వ్యాఖ్యలు చేసింది. కరోనా మహమ్మారిని సరిగ్గా ఎదుర్కోవడం లేదని కేంద్రంపై జస్టిస్ మన్మోహన్, జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఎవరూ తెలివిగా వ్యవహరించడం లేదు. లక్షలాది డోసుల టీకాలను దేశీయంగా ఉత్పత్తి చేసే అవకాశంపై తక్షణమే స్పందించాల్సి ఉన్నా.. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటి విషయాల్లో అత్యున్నత స్థాయి నుంచి 30 నిమిషాల్లోగా ఆదేశాలు వచ్చేలా చూడాలి. ఇలాగే వ్యవహరిస్తే మరణాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రతీరోజు ఏదో ఒక కోర్టు మిమ్మల్ని చీల్చి చెండాడుతూనే ఉంది. అయినా మీలో చలనం లేదు. మీకు ఆదేశాలు ఇస్తున్న అధికారులు ఎవరు? వారికి విచక్షణ ఉందా? ఈ దేశాన్ని ఇక దేవుడే రక్షించాలి’ అని కోర్టు మండిపడింది. స్పుత్నిక్ వీ టీకా ఉత్పత్తి కోసం తక్షణమే నిధుల విడుదల కోరుతూ పానసీయా బయోటెక్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్బంగా ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే ఈ టీకా ట్రయల్ బ్యాచ్‌లను ఉత్పత్తి చేశామని ఆ సంస్థ కోర్టుకు తెలిపింది. దీనిపై కోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. వారంలోగా జవాబివ్వాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
యాసంగి అంచనా.. 77.73 లక్షల టన్నులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది యాసంగి సీజన్లో వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం 77.73లక్షల టన్నుల ధాన్యం మార్కెట్‌కు వస్తుందని, ఈ ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరంభమయ్యే కొనుగోళ్లకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని సూచించింది.2019–20 యాసంగి కార్యాచరణపై సోమవారం హాకా భవన్లో మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల ఏర్పాటు, గన్నీ సంచులు, స్టోరేజ్ సదుపాయం, రవాణా అంశాలపై చర్చించారు. గోదాముల్లో నిల్వ సమస్యపై ప్రధానంగా దృష్టి సారించాలని మంత్రులు సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర, కేంద్ర గిడ్డంగుల సంస్థలతో పాటు కేంద్ర ఆహార సంస్థ,, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేసి స్టోరేజ్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఇతర రాష్ట్రాల దళారులు రాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ సరిహద్దు ల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
సెప్టెంబర్ 1 నుంచి ఇంటికే రేషన్
ప్రజాపంపిణీలో సమూల మార్పులు చోటుచేసుకోనున్నాయి. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా వంట సరుకులు డోర్ డెలివరీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రతి కార్డుదారుకీ బియ్యంతోపాటు చక్కెర, కంది పప్పు, ఉప్పు, పామాయిల్, గోధుమ పిండి ప్యాకెట్ల రూపంలో అందించాలని యోచిస్తోంది. ఈ విధానాన్ని సెప్టెంబర్ ఒకటి నుంచి అమలు చేసేందుకు ప్రణాళిక రచించింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి, చిత్తూరు రూరల్: ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు కళ్లెం వేసి.. లబ్ధి దారుల ఇంటి వద్దకే రేషన్ అందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సంకల్పించింది. అదే సమయంలో నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. జిల్లాలో 2,877 చౌక దుకాణాలు ఉన్నాయి. ఈ షాపుల కింద మొత్తం 11,07,886 రేషన్‌కార్డులు ఉన్నాయి. 2016లో అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ–పాస్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. అయితే ఈ విధానం ద్వారా అక్రమాలకు చెక్ పడలేదు. పైగా కార్డుదారులను ఇబ్బందులకు గురిచేశారు. ఆధార్ లింక్, వేలిముద్రలు, ఐరిష్ ఇలా సవాలక్ష సమస్యల పేరుతో కార్డుదారులకు సరుకులు అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్డుదారులు ప్రతినెలా సరుకులు తీసుకునేందుకు అవస్థలు పడుతున్నారు. జిల్లాలో రేషన్‌కార్డుల వివరాలు మొత్తం చౌకదుకాణాలు : 2,877 రేషన్‌కార్డులు : 11,07,886 ఎంఎల్ఎస్ పాయింట్లు : 28 ప్రతినెలా సరఫరా అవుతున్న బియ్యం : 18,864.95 మెట్రిక్ టన్నులు చక్కెర : 600.22 మెట్రిక్ టన్నులు గోధుమపిండి : 1,113.67 మెట్రిక్ టన్నులు రాగులు : 3,315.81 మెట్రిక్ టన్నులు కందిపప్పు : 2,227.35 మెట్రిక్ టన్నులు సమస్యలు ఇలా.. జిల్లాలోని మొత్తం కార్డుదారుల్లో 1.10 లక్షల మంది మాన్యువల్‌గా రేషన్ తీసుకుంటున్నారు. 90 శాతం మంది కార్డుదారులు తీసుకుంటుండగా, 10 శాతం మంది రేషన్ తీసుకోవడానికి రావడం లేదు. 8 వేల మంది కార్డుదారులకు వివిధ కారణాల వల్ల వారి వేలిముద్రలు ఈ–పాస్ యంత్రం తీసుకోవడం లేదు. సింగిల్ కార్డు ఉన్న వారి వేలిముద్రలు యంత్రంలో సరిపోవడం లేదు. ఇలా సుమారు 8 వేల మంది కార్డుదారులకు నెలనెలా సమస్యలు వస్తున్నాయి. వృద్ధులు, బయోమెట్రిక్ నమోదు కానీ వారికోసం సంబంధిత ఎన్ఫోర్సుమెంట్ డిప్యూటీ తహసీల్దార్లు, ఆహార తనిఖీ అధికారులు, ఏఎస్ఓలు దుకాణం పరిధిలో ఈ తరహా కార్డుదారులందరినీ ఒక విడతలో పిలిచి వారికి సంబంధిత అధికారి వేలిముద్ర వేసి సరుకులను ఇస్తున్నారు. ఈ విధానంలో అధికారికి తీరిక దొరికినప్పుడు మాత్రమే సరుకులను తీసుకెళ్లాలి. అధికారికి ఎప్పు డు ఖాళీ దొరుకుతుందో సమాచారాన్ని సంబంధిత చౌక ధరల దుకాణదారునికి తెలియజేస్తారు. కొందరు వృద్ధులు సరుకులను తీసుకెళ్లడానికి ఓపిక లేక దుకాణాల వైపు రావడం లేదు. ఈ తరహా సమస్యలతో 10 శాతం కార్డుదారులు జిల్లా వ్యా ప్తంగా సరుకులను తీసుకెళ్లడం లేదని అధికారుల రికార్డులతో తెలుస్తోంది. ఎన్నికల వేళ డీఎస్ఓ పర్యవేక్షణలో వృద్ధులకు బయోమెట్రిక్ పడని వారికి సరుకులను వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేశారు. ఒకటి, రెండు రోజులు తూతూమంత్రంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అందుకు భిన్నంగా కార్డుదారుని ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు వచ్చే విధంగా వ్యవస్థను రూపకల్పన చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సరఫరాలో లోటుపాట్లు జిల్లాలో 28 ఎంఎల్ఎస్ పాయింట్లకు ప్రతి నెలా 18,864.90 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తోంది. అదే చక్కెర 600.22, రాగులు 3,315.81, కందిపప్పు 2,227.35 మెట్రిక్ టన్నులు సరఫరా చేస్తోంది. బియ్యం ఇలా బస్తాల్లో చేరుతున్నాయి. అక్కడ తూకాలు వేసి కార్డుదారులకు తలసరి ఐదు కిలోల లెక్కన కంది పప్పు రెండు కిలోలు, చక్కెర అరకిలో ఇస్తున్నారు. ఇందులోనూ కోత విధిస్తున్నారు. ఎంఎల్ఎస్ పాయింట్లలో, దుకాణాల్లో తూకాల్లో తేడాలు వస్తున్నాయి. వినియోగదారులు బాగా నష్టపోతున్నారు. బియ్యం పక్కదారి పడుతోంది. సరుకుల అక్రమ తరలింపు జరుగుతోంది. వీటిని అడ్డుకోవడానికి విజిలెన్స్ తనిఖీలు చేయాల్సి వస్తోం ది. మరోవైపు దుకాణదారులు, ఎన్ఫోర్సుమెంట్ విభాగం లాలూచీ పడి సబ్సిడీ సరుకుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. వీటిని నిరోధించేందుకు ప్రభుత్వం ప్రజా పంపిణీలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టనుంది. రేషన్ సరుకులన్నీ ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. నాణ్యమైన బియ్యం అందేలా కార్డుదారులకు ఇస్తున్న బియ్యంలో నాణ్యత ఉండాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. జగన్మోహన్రెడ్డి మంత్రి మండలిలో చర్చించి నిర్ణయాన్ని తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి రకరకాల బియ్యం చౌక దుకాణాల నుంచి పంపిణీ చేస్తున్నారు. కొత్త బియ్యం, స్వల్పకాలిక పంటలు కావడంతో అన్నం పిండి అవుతోంది. అందుకే కొందరు ఈ రకాలను ఇష్టపడం లేదు. ఈ బియ్యమే తిరిగి రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో నాణ్యమైన బియ్యం కార్డుదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం తలచింది. తలుపు తట్టి.. రేషన్ బియ్యాన్ని ఇక నుంచి 5, 10, 20 కిలోల ప్యాకెట్లుగా తయారుచేసి పౌరసరఫరాల శాఖ పంపిణీ చేయనుంది. గ్రామ వాలంటీర్ల ద్వారా ఈ ప్యాకెట్లను సరఫరా చేస్తారు. కార్డులో ఒక లబ్ధిదారుడే ఉంటే ఐదు కిలోలు, ఇద్దరు ఉన్న కార్డుకు 10 కిలోలు, ముగ్గురు ఉన్న కార్డులకు 15 కిలోల ప్యాకెట్లు, నలుగురు సభ్యులుంటే 20 కిలోల ప్యాకెట్లు పంపిణీ చేస్తారు. వీటితో పాటు ఐదు రకాల నిత్యావసర సరుకులు అందజేస్తారు. చక్కెర, కందిపప్పు, ఉప్పు, పామాయిల్, గోధుమ పిండి ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాగులు, జొన్నల పంపిణీ పరిశీలనలో ఉంది. యంత్రాల ద్వారా తూకాలు వేసి ప్యాకెట్ల రూపంలో ప్రజలకు పంపిణీ చేస్తారు. బియ్యం ప్యాకెట్లు తయారు చేయడానికి 35 కేంద్రాలను నెలకొల్పాలని ప్రాథమికంగా అంచనా వేశారు. సెప్టెంబర్ ఒకటి నుంచి ఈ విధానంలో సరుకులను పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. -
అక్కడ కిలో టమాట రూ 100
సాక్షి,న్యూఢిల్లీ: ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్న సామాన్యులను తాజాగా టమాట మంటెత్తిస్తోంది. గత కొద్దిరోజులుగా టమాట ధరలు కొండెక్కాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కిలో టమాట రూ 80 పలికింది.దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ టమాట రిటైల్ ధరలు భారమయ్యాయి.మిజోరాంలో కిలో టమాట రూ 100కు పెరిగి జనానికి చుక్కలు చూపుతోంది. ఇక టమాట ఎక్కువగా పండే కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో ఇటీవలి వర్షాలతో పంట దెబ్బతినడంతో సరఫరాలు తగ్గి ధరలు పెరిగాయని వర్తకులు చెబుతున్నారు. మరోవైపు టమాటకు అతిపెద్ద మార్కెట్ అయిన బెంగుళూర్లో టమాట ధరలు కిలో రూ 45 నుంచి రూ 50 వరకూ పలుకుతున్నాయి. మధ్యప్రదేశ్‌లోనూ 90 శాతం పంట దెబ్బతినడంతో టమాటకు రెక్కలు వచ్చాయని, రైతులు మళ్లీ సాగు చేస్తున్న టమాట మరో 20 రోజుల్లో మార్కెట్‌కు వస్తే పరిస్థితిలో కొంత మార్పు ఉంటుందని అజాద్‌పూర్ మండీలో టమాట మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కౌశిక్ చెప్పారు. -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
కాకినాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ చార్జిలదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌భవన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పౌరసరఫారాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడానికి కేంద్రాల ఇన్ చార్జిలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాల్లో రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పారు. ధాన్యం సాధరణ రకం 75కిలోలు రూ.1102.50పైసలు, వంద కిలోలు రూ.1470, గ్రేడ్–ఎ రకం 75కిలోలు రూ.1132.50పైసలు, వంద కిలోలు రూ.1510 మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 251 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు, గణేష్‌కుమార్, విశ్వేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ డీఎం కె.కృష్ణారావు, డీఎస్ఓ ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్ఎన్ కిషోర్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం కాకినాడ సిటీ: కాట¯ŒS కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా(గుంటూరు) ఆధ్వర్యంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కనీస మద్దతు ధర, ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండోవారంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని ఇందుకు మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర రూ.4160 ఉందన్నారు. అలాగే ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్, కెనాల్‌రోడ్ భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్లో సమీక్షించారు. రాజానగరం– సామర్లకోట ఏడీబీరోడ్డు భూసేకరణకు సర్వే పూర్తయిందని, వారం రోజుల్లో ప్రిలిమినరీ నోటిఫికేష¯ŒS జారీ చేయాలని పెద్దాపురం ఆర్డీఓను ఆదేశించారు. -
అమెరికా ఫస్ట్, భారత్ సెకండ్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి గతేడాదికిగాను 1760 కోట్ల డాలర్ల సరకులను, సేవలను వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. ఎప్పటిలాగే ఈ విషయంలో అమెరికానే అగ్రస్థానంలో నిలవగా భారత్ రెండో స్థానంలో నిలవడం విశేషం. అమెరికా 160 కోట్ల డాలర్ల సరకులను, సేవలను ఐక్యరాజ్యసమితికి అందించగా, భారత్ 120 కోట్ల డాలర్ల సరకులను, సేవలను అందించింది. ఈ విషయంలో తొలి పది స్థానాల్లో అమెరికా, యూరప్ దేశాలు ఉండడం సహజమే అయినప్పటికీ భారత్ లాంటి వర్ధమాన దేశాలు, కెన్యా, లెబనాన్, అఫ్ఘానిస్థాన్, టర్కీ, ఇథియోపియా లాంటి వెనకబడిన దేశాల నుంచి సమితికి ఎగుమతులు పెరగడం ఆశ్చర్యకరం. 2005లో ప్రారంభమైన ఈ కొత్త ట్రెండ్ 2015 నాటికి కూడా కొనసాగింది. ఎక్కువ సరకులను, సేవలను అందించిన టాప్ పది దేశాల్లో అమెరికా, భారత్ ప్రథమ, ధ్వితీయ స్థానాల్లో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, స్విడ్జర్లాండ్, బెల్జియం, అఫ్ఘానిస్థాన్, డెన్మార్క్, ఫ్రాన్స్, యుకె, కెన్యా దేశాలు నిలిచాయి. ముడి సరుకులు కాకుండా 13 సెక్టార్లలో ఐక్యరాజ్య సమితి సరకులను, సేవలను దిగుమతి చేసుకుంటుంది. ఆరోగ్యం, రవాణా, అడ్మినిష్ట్రేషన్, ఆపరేషన్, భవన నిర్మాణం, ఇంజనీరింగ్, ఆహారం, విద్యా, సురక్షిత నీరు, పారిశుద్ధ్యం, మానవతా సాయంచ, సరకులు, ఇతర సేవలు ఈ సెక్టార్లలో ఉన్నాయి. సమితి దిగుమతి చేసుకునే ఎగుమతుల్లో ఆరోగ్య రంగానిదే పెద్ద పీట. మొత్తం దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో 23 శాతం ఆరోగ్య రంగానిదే (ఔషధాలు, వైద్య పరికరాలు). -
సామాజిక వనాల్లో కాసుల వేట
♦ మొక్కలన్నీ లెక్కల్లోనే.. ♦ ఏడాదికి కోటి మొక్కల పంపిణీ లక్ష్యం ♦ మూడో వంతు కూడా సరఫరా కాని వైనం ♦ అన్నీ కాకి లెక్కలు ♦ మొక్కల పెంపకం పేరుతో నిధుల స్వాహా ♦ నేడు ప్రపంచ అటవీ దినోత్సవం సామాజిక వనాల్లో మొక్కల పెంపకం పేరుతో లక్షలు కాజేస్తున్నారు. రికార్డుల్లో లక్షలాది మొక్కలు నాటినట్లు చూపుతున్నా..వాస్తవ పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉంది. సరైన పర్యవేక్షణ లేక నర్సరీల్లో అరకొరగా పెంచినవీ ఎండుముఖం పట్టారుు. కోటి మొక్కలు పెంచాలన్నది లక్ష్యం కాగా..పట్టుమని 30 లక్షల మొక్కలు కూడా పంపిణీ కాలేదంటే అవినీతి ఏ స్థారుులో ఉందో అర్థమవుతుంది. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని సామాజిక వనాలపై కథనం.. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఒంగోలు క్రైం: అటవీ శాఖలో సామాజిక వనాల పెంపకం ప్రహసనంగా మారుతోంది. లెక్కల్లో కోట్ల మొక్కలు నాటినట్లు చూపుతున్నా రోడ్లపై మొక్కలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పటి వరకూ జిల్లాలో నాటిన మొక్కల్లో సగం బతికినా జిల్లా మొత్తం పచ్చదనం పరుచుకునేది. ఒకపక్క విలువైన వృక్ష సంపదను నరికి యథేచ్ఛగా మార్కెట్‌కు తరలిస్తూనే, మరోపక్క సామాజిక వనాల అభివృద్ధి పేరుతో లక్షలు కాజేస్తున్నారు. వేల హెక్టార్లలో మొక్కలు నాటినట్లు కాగితాలపై లెక్కలు చూపిస్తున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉంటున్నాయి. జిల్లాలో 50 నర్సరీలు ఏర్పాటు చేసి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పాటు 13వ ఆర్ధిక సంఘం నిధులు భారీగా కేటాయించారు. కోటి మొక్కల పెంపకం పథకం కింద సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. జరుగుతోంది ఇదీ... అధికారులు మాత్రం తూ తూ మంత్రంగా మొక్కలు పెంచి అక్రమాలకు పాల్పడుతున్నారు. కనీసం ఏడాదికి 30 లక్షల మొక్కలు కూడా పంపిణీ కావడం లేదన్న విమర్శలున్నాయి. లక్షల నిధులు ఖర్చయినా నర్సరీ నుంచి మొక్క బయటకు పోతే ఒట్టు. రికార్డుల్లో మాత్రం మొక్కలు పంపిణీ చేసినట్లు చూపిస్తూ మొలకెత్తని బెడ్లను పాలిథిన్ కవర్లను ట్రాక్టర్‌తో తొలగించి మొక్కలు పంపిణీ చేసినట్లు అధికారులను వేధించటం పరిపాటిగా మారింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పంచాయతీ కార్యాలయాలు, దేవాలయాల ఆవరణ, ఎస్సీల పొలాల్లో మొక్కలు పెంచుకునేందుకు పంపిణీ చేశారు. అయితే మొక్కలు నాటిన తరువాత వర్షాలు లేక పోవటం, నీరు అందకపోవటం, రక్షణ లేక అక్కడక్కడా కొన్ని మొక్కలే బతికి ఉన్నాయి. మిగిలినవన్నీ అక్కడ మొక్కలు నాటారంటే నమ్మే పరిస్థితి కూడా లేదు. ♦ కనిగిరి నియోజకవర్గంలో అటవీ శాఖ ఆధ్వర్యంలోని కొన్ని చోట్ల మొక్కలు పచ్చగా ఉన్నా, సామాజిక అటవీశాఖ ఆధ్వర్యంలోని నర్సరీల్లో మొక్కల పెంపకం కాగితాలకే పరిమితమైంది. 15 రకాల మొక్కలను ప్రతి ఏడాది ఒక్కో నర్సరీలో 3 వేల చొప్పున ఏడాదికి మూడు లక్షలు పెంచుతున్నట్లు లెక్కలు చూపిస్తూ అధికారులు నిధులు దిగమింగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కనిగిరి నుంచి హనుమంతునిపాడు, వేములపాడు ఘాట్ వరకు నాటిన మొక్కలు నిలువునా ఎండిపోయాయి. హాజీపురం సోషల్ ఫారెస్టులో మొక్కలు పెంచేందుకు ఏర్పాటు చేసిన సిమెంటు బెడ్లు పిచ్చి మొక్కలు, గడ్డి పెరిగి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణంగా మారాయి. ♦ సంతనూతలపాడు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఒక్క చీమకుర్తి మండలంలో మాత్రమే అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చీమకుర్తి మండలం దేవరపాలెం రేంజ్ దాదాపు 5 వేల హెక్టార్ల భూములుంటే కేవలం పల్లామల్లి ఏరియాలోని 50 హెక్టార్లలో మాత్రమే జామాయిల్ మొక్కలు వేసినట్లు అటవీ రేంజర్ వెంకటరావు చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపుగా 70 వేల మొక్కలు నాటినట్లు చూపుతున్నా పదిశాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. ♦ గిద్దలూరు నియోజకవర్గంలోని 65 పాఠశాలల్లో 12,500 మొక్కలు పంపిణీ చేశారు. అరకొర పాఠశాలల్లో మినహా ఎక్కువ పాఠశాలల్లో మొక్కలు జీవం పోసుకోలేదు. కంభం పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా గతేడాది ఒక్కో విద్యార్థికి ఒకటి చొప్పున 310 మొక్కలు నాటారు. 80 మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో అసలు మొక్కలే కనిపించవు. ఒక్కో మొక్కకు సుమారు రూ.15 నుంచి రూ.25ల వరకు ఖర్చు చేశారని దాదాపు రూ.2.50 లక్షల వరకు నిధులు వృథా చేసినట్లు ఆరోపణలున్నాయి. ♦ మార్కాపురం నియోజకవర్గంలో తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువులో ఏర్పాటు చేసిన నర్సరీలో 50 వేల మొక్కలు పెంచినట్లు ఎన్ఆర్ఈజీఎస్ అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు. మొదటి విడతగా 50 వేల మొక్కలు నాటాల్సి ఉండగా 20 వేల ఎర్రచందనం మొక్కల స్టమ్స్ను ప్రభుత్వం పంపిణీ చేసింది. అవి నాసిరకంగా ఉండటంతో నాటిన కొద్ది రోజులకే చనిపోయాయి. అదే కవర్లలో వాటి స్థానంలో అధికారులు హడావుడిగా బొప్పాయి, మునగ విత్తనాలు నాటారు. అవి బతకలేదు. దీంతో లక్షల ధనం వృథా అయింది. కొనకనమిట్ల మండలంలో పాతపాడు- కనిగిరి మండలం బడుగులేరు వరకు మొక్కలు నాటేందుకు రూ.47 లక్షలు, పెదారికట్ల- ఇరసలగుండం వరకు మొక్కలు నాటేందుకు రూ. 27 లక్షలు వెచ్చించారు. అవి కాక స్థానిక నర్సరీ కేంద్రాల నుంచి మొక్కలు నాటారు. లక్షలు ఖర్చు పెట్టి నాటారు కాని 10 శాతం మొక్కలు ఉపయోగంలోకి రాలేదు. ♦ అద్దంకి నియోజకవర్గం బల్లికురవ, సంతమాగులూరు, కొరిశపాడు, జే పంగులూరు మండలాల్లోని గ్రామాల్లో ఉన్న వ్యవసాయ భూముల్లో, రోడ్ల వెంట, చెరువు గట్లు, పొలం గట్ల వెంట నిమ్మ, మామిడి, బత్తాయి, ఖర్జూర, మలబారు వేప, సపోట లాంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టారు. గత సంవత్సరం నాటిని మొక్కల పరిస్థితిని గమనిస్తే అద్దంకి మినహా మిగిలిన మండలాల్లో ఎక్కువ శాతం మొక్కలు మరణించినట్లు క్షేత్ర స్థాయి పరిశీలనలో తేలింది. కాలం కాని కాలంలో నాటడం వలన మొక్కలు చనిపోయాయని అధికారులు చెబుతున్నారు. ♦ దర్శి నియోజకవర్గంలో దొనకొండ, కురిచేడు, దర్శి, ముండ్లమూరు, తాళ్లూ రు మండలాల్లో 20 వేల మొక్కలు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, పంచాయతీల్లో పంపిణీ చేశారు.మొక్క లు నాటిన వారు వాటి సంరక్షణను విస్మరించారు. ఫలితంగా అవి పెరుగుదలకు నోచుకోలేదు. వన మహోత్సవం సందర్భంగా అటవీశాఖ టేకు, వేప, కానుగ, మునగ, బొప్పాయి, గోరింట, శీతాఫలం మొక్కలను అందజేసింది. అందుకు సంబంధించిన నిధులను డ్రా చేశారు. ఈ మొక్కల్లో పది శాతం కూడా బతకలేదు. ♦ కొండపి నియోజకవర్గం మర్రిపూడి 14 పంచాయతీల్లో 6 రకాల మొక్కలైన మామిడి, జామ, నిమ్మ, బత్తాయి, సపోట, సీతాఫల్ తదితర 14 వేల మొక్కలు ఇచ్చారు. అయితే సంరక్షణ లేకపోవడంతో చాలా వరకు మొక్కలు చనిపోయాయి. కొండపి మండలం వావిలేటిపాడు, మర్లపాడు, కొత్తపట్నం, టపాచెట్టు నర్సరీల నుంచి మండలానికి 1600 నీడ మెక్కలను అందించారు. కడియం నర్సరీ నుంచి 10 వేల పండ్ల మొక్కలను తెప్పించారు. ♦ కందుకూరు నియోజకవర్గంలో ప్రధానంగా గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లో అటవీ భూములు విస్తరించి ఉన్నాయి. చుండి, మాలకొండ గ్రామాల వద్ద 25 హెక్టార్ల చొప్పున మొత్తం 50 హెక్టార్లలో 60 వేల జామాయిల్ మొక్కలు నాటినట్లు రేంజర్ చెబుతున్నారు. అయితే వీటిలో కొంత వరకు మొక్కలు ఎండిపోయాయి. అలాగే ఉలవపాడు మండలంలో 20,800 మొక్కలు పాఠశాలలో నాటినట్లు లెక్కలు చూపిస్తున్నా వీటిలో 10 శాతం మొక్కలు కూడా బతికిన దాఖలాలు లేవు. పాకలరోడ్డు, పాజర్ల, ఊళ్లపాలెం రోడ్డుల్లో 1800 మొక్కలు నాటినట్లు చెప్తున్నారు. వీటి ఆనవాళ్ల ప్రస్తుతం కానరావడం లేదు. లక్ష్యం ఇదీ... జిల్లాలో ఏడాదికి కోటి మొక్కలు నాటాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఉద్దేశం నీరుగారుతోంది. ఎన్ఆర్ఈజీఎస్ పథకంతో పాటు నీరు-చె ట్టు పథకాల కింద జిల్లాలో మొత్తం 50 నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. అవి సామాజిక అటవీ శాఖతో పాటు టెర్రిటోరియల్, వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ విభాగాల్లోనూ నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి. వాటిని గ్రామాల్లో నాటడానికి అవసరం అని అడిగిన వెంటనే వాటిని సరఫరా చేయాలి. సామాజిక అటవీ శాఖ పరిధిలో నాలుగు రేంజ్ కార్యాలయాలున్నాయి. ఒంగోలు, మేదరమెట్ల, పొదిలి, మార్కాపురం రేంజ్ కార్యాలయాల పరిధిలో రేంజర్లు నర్సరీల నిర్వహణ చేపట్టాల్సి ఉంది. వీటితో పాటు గిద్దలూరు రెగ్యులర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలో 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. అదేవిధంగా మార్కాపురం వైల్డ్‌లైఫ్ ఫారెస్ట్ పరిధిలోనూ 10 నర్సరీల్లో మొక్కలు పెంచాలి. మొత్తం మీద ప్రతి ఏడాది కోటి మొక్కల చొప్పున పెంచి లక్ష్యాన్ని చేరుకోవాలన్నది అధికారుల లక్ష్యం. ప్రధానంగా నర్సరీల్లో టేకు, ఎర్రచందనం మొక్కలతో పాటు దాదాపు 12 రకాల మొక్కలు పెంచి ప్రజలకు అవసరమైన మేరకు అందించాలి. -
హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..!
విజయనగరం కంటోన్మెంట్: సంక్రాంతి సందర్భంగా నాసిరకం సరుకులు పంపిణీ చేశారన్న అపప్రధను మూటగట్టుకున్న యంత్రాంగం ఇప్పుడు వాటికి లెక్కలు కూడా చెప్పలేకపోతోంది. అంతే కాదు నాణ్యత లేని సరుకులను మరో నెల రోజులు స్టాకు ఉంచి పలు మార్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు రవాణా చేసి చివరకు వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పంపిణీ కాగా మిగిలిపోయిన చంద్రన్న సరుకులను వసతి గృహాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఠ మొదటి పేజీ తరువాయి నిర్ణయించింది. అసలే సరుకులు బాగాలేవని ప్రజలంతా విమర్శిస్తున్న సమయంలో ఆ సరుకులను వసతి గృహాలకు తరలిస్తే విద్యార్థులేం తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో పంపిణీ చేసిన చంద్రన్న సరుకుల్లో శనగపప్పు, కందిపప్పు, బెల్లం, గోధుమ పిండి వంటివి నాణ్యత బాగాలేవు. నెల రోజుల కిందటే ఈ సరుకులు బాగాలేని కారణంగా ఎవరూ తీసుకెళ్లలేదు. ఇప్పుడు నెల రోజులు దాటిపోయి ఇంకా సరుకులు డీలర్ల ఇళ్ల వద్ద ఉండిపోయాయి. ఆ సరుకులను ఇప్పుడు జిల్లాలోని వివిధ వసతి గృహాలకు ఇస్తే పరిస్థితి ఏమిటన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మిగిలిపోయిన రెండున్నర లక్షల ప్యాకెట్లుసంక్రాంతి సందర్భంగా జిల్లాలోని కొత్త, పాతవి కలిపి 6.84 లక్షల రేషన్ కార్డులకు చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ చేసేందుకు దాదాపు ఏడు లక్షలకు పైగా కిట్లు తీసుకువచ్చారు. ఈ కిట్లను ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా జిల్లాలోని 1388 రేషన్ షాపులకు అందజేశారు. సరుకుల పంపిణీ ప్రారంభంలో అన్నింటికీ ఈపోస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లోని 48 షాపులకు మాత్రం మాన్యువల్‌గా పంపిణీ చేశారు. సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ ఈపోస్ విధానం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మొత్తం అన్ని రేషన్ షాపులకూ మాన్యువల్విధానాన్ని అప్పగించింది. అయితే నాణ్యత బాగాలేవన్న కారణంగా కొంతమంది కొన్ని సరుకులను తీసుకోలేదు. మరికొన్ని చోట్ల సంబంధిత కార్డు దారులు అందుబాటులో లేకపోవడంతో చంద్రన్న సరుకులు మిగిలాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్దుకాణాల్లోనూ దాదాపు రెండున్న ర లక్షల ప్యాకెట్లు మిగిలాయి. ఎంఎల్‌ఎస్‌కు చేరిన లక్ష ప్యాకెట్లు మిగిలిపోయిన చంద్రన్న సరుకుల ప్యాకెట్లను వెనువెంటనే ఆయా ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లకు చేర్చాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఇంకా సరుకులు చేరలేదు. ప్రతి రోజూ సరుకుల గురించి అడుగుతుండడం కనిపిస్తున్నదే త ప్ప సరుకులు ఇచ్చే డీలర్లు కనిపించడం లేదు. అయితే ఈ రెండున్నర లక్షల ప్యాకెట్లలో కేవలం లక్ష ప్యాకెట్లు మాత్రమే ఎంఎల్ఎస్ పాయింల్కు మిగతా సరుకులు ఏమయినట్టో ఎవరికీ తెలియదు. అసలే నాణ్యత లేమి అపై పలుమార్లు రవాణా చంద్రన్న సరుకులు జిల్లాకు చేరి నెలరోజులకు పైగా అయింది. ఇలా జిల్లాకు చేరిన సరుకులు అప్పటికే నాణ్యతలేమితో ఉండగా . ఆ తరువాత ఇప్పుడు మళ్లీ ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. మళ్లీ వాటిని వసతి గృహాలకు పంపిస్తారు. ఇలా పలుమార్లు రవాణాలో పాడైన సరుకులు వసతి గృహాలకు చేరిన తరువాత ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. అంటే ఆ సరుకులను ఏదో విధంగా వాడేందుకే మొగ్గు చూపుతున్న యంత్రాంగం విద్యార్థుల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న సరుకుల్లో కందిపప్పు పాకెట్లు 20,690,పామాయిల్ 20,337, శెనగపప్పు10,132,గోధుమ పిండి 19331,బెల్లం 13,418, నెయ్యి 17515 ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా రేషన్ షాపుల నుంచి సుమారు లక్షన్నర ప్యాకెట్లు రావాల్సి ఉందని అంచనా. ఈ ప్యాకెట్లు ఎప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతాయి. ఇంకెప్పుడు వాటిని పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తి సరుకులు వచ్చాక వాటిని ఉన్నతాధికారులు సూచించిన విధంగా వసతి గృహాలకు తరలిస్తామని పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజర్ శర్మ ‘సాక్షి’కిచెప్పారు. -
పింఛన్‌కు ఆధార్ గ్రహణం
గుడ్లవల్లేరు : ఆధార్ కార్డు లేదనే సాకుతో ఇప్పటికే రేషను సరుకుల పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం సెప్టెంబరు నెల నుంచి పింఛనుదారులకు పింఛన్లనూ నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ పింఛనుదారులందరికీ ఆధార్ జారీ చేయడం లేదు. ముఖ్యంగా బరువైన పనులు చేయడం వలన వృద్ధుల చేతి వేలిముద్రలు అరిగిపోతున్నాయి. ఇలాంటి వృద్ధులకు ఆధార్ కార్డును జారీ చేసేందుకు ఆయా కేంద్రాల వారు ససేమిరా అంటున్నారు. ఇప్పటివరకూ ఇద్దరేసి వృద్ధులకు ఒక్కో ఆధార్ నంబరుపై పింఛన్లను ఇస్తూ వచ్చిన ప్రభుత్వం సెప్టెంబరు నుంచి ఖచ్చితంగా ఆధార్‌కార్డులు లేకపోతే ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది. ఆధార్ మంజూరు కాలేదు పెనుమూడి కోటేశ్వరరావు, శేరీ కల్వపూడి ప్రమాదంలో చేతి వేళ్లు పోవడంతో వేలిముద్రలు వేయలేకపోవడం వలన నాకు ఆధార్ కార్డు మంజూరు కాలేదు. రేషను సరుకులు ఇవ్వనని మా డీలరు చెప్పేశాడు. ఇపుడు పింఛను రావడం లేదు. ఇప్పటికైనా నాకు ఆధార్ కార్డును ప్రభుత్వం కల్పించాలి.