హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..! | Chandranna hastal of goods .. .. Haw! | Sakshi
Sakshi News home page

హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..!

Published Thu, Feb 4 2016 1:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM

హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..!

హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..!

విజయనగరం కంటోన్మెంట్: సంక్రాంతి సందర్భంగా నాసిరకం సరుకులు పంపిణీ చేశారన్న అపప్రధను మూటగట్టుకున్న యంత్రాంగం  ఇప్పుడు వాటికి లెక్కలు కూడా చెప్పలేకపోతోంది. అంతే కాదు నాణ్యత లేని సరుకులను మరో నెల రోజులు స్టాకు ఉంచి పలు మార్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు రవాణా చేసి చివరకు వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పంపిణీ కాగా మిగిలిపోయిన చంద్రన్న సరుకులను వసతి గృహాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం  ఠ  మొదటి పేజీ తరువాయి
 నిర్ణయించింది. అసలే సరుకులు బాగాలేవని ప్రజలంతా విమర్శిస్తున్న సమయంలో ఆ సరుకులను వసతి గృహాలకు తరలిస్తే విద్యార్థులేం తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఎందుకంటే జిల్లాలో పంపిణీ చేసిన చంద్రన్న సరుకుల్లో శనగపప్పు, కందిపప్పు, బెల్లం, గోధుమ పిండి వంటివి నాణ్యత బాగాలేవు.  నెల రోజుల కిందటే ఈ సరుకులు బాగాలేని కారణంగా ఎవరూ తీసుకెళ్లలేదు. ఇప్పుడు నెల రోజులు దాటిపోయి ఇంకా సరుకులు డీలర్ల ఇళ్ల వద్ద ఉండిపోయాయి. ఆ సరుకులను ఇప్పుడు జిల్లాలోని వివిధ వసతి గృహాలకు ఇస్తే పరిస్థితి ఏమిటన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
 మిగిలిపోయిన రెండున్నర లక్షల ప్యాకెట్లుసంక్రాంతి సందర్భంగా జిల్లాలోని కొత్త, పాతవి కలిపి 6.84 లక్షల రేషన్ కార్డులకు చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ చేసేందుకు దాదాపు ఏడు లక్షలకు పైగా కిట్లు తీసుకువచ్చారు. ఈ కిట్లను ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా జిల్లాలోని 1388 రేషన్ షాపులకు అందజేశారు. సరుకుల పంపిణీ ప్రారంభంలో అన్నింటికీ ఈపోస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు.  గిరిజన గ్రామాల్లోని 48 షాపులకు మాత్రం మాన్యువల్‌గా పంపిణీ చేశారు.

సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ ఈపోస్ విధానం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మొత్తం అన్ని రేషన్ షాపులకూ మాన్యువల్‌విధానాన్ని అప్పగించింది.   అయితే నాణ్యత బాగాలేవన్న కారణంగా కొంతమంది కొన్ని సరుకులను తీసుకోలేదు. మరికొన్ని చోట్ల సంబంధిత కార్డు దారులు అందుబాటులో లేకపోవడంతో చంద్రన్న సరుకులు మిగిలాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్‌దుకాణాల్లోనూ దాదాపు రెండున్న ర లక్షల ప్యాకెట్లు మిగిలాయి. ఎంఎల్‌ఎస్‌కు చేరిన లక్ష ప్యాకెట్లు
 మిగిలిపోయిన చంద్రన్న సరుకుల ప్యాకెట్లను వెనువెంటనే ఆయా ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లకు చేర్చాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఇంకా సరుకులు చేరలేదు. ప్రతి రోజూ సరుకుల గురించి అడుగుతుండడం కనిపిస్తున్నదే త ప్ప సరుకులు ఇచ్చే డీలర్లు కనిపించడం లేదు. అయితే ఈ రెండున్నర లక్షల ప్యాకెట్లలో కేవలం లక్ష ప్యాకెట్లు మాత్రమే ఎంఎల్‌ఎస్ పాయింల్‌కు మిగతా సరుకులు ఏమయినట్టో ఎవరికీ తెలియదు.   అసలే నాణ్యత లేమి అపై పలుమార్లు రవాణా చంద్రన్న సరుకులు జిల్లాకు చేరి  నెలరోజులకు పైగా అయింది. ఇలా జిల్లాకు చేరిన సరుకులు అప్పటికే నాణ్యతలేమితో ఉండగా  . ఆ తరువాత ఇప్పుడు మళ్లీ ఎంఎల్‌ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. మళ్లీ వాటిని వసతి గృహాలకు పంపిస్తారు. ఇలా పలుమార్లు రవాణాలో పాడైన సరుకులు వసతి గృహాలకు చేరిన తరువాత  ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు.  

అంటే ఆ సరుకులను ఏదో విధంగా వాడేందుకే మొగ్గు చూపుతున్న యంత్రాంగం విద్యార్థుల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎంఎల్‌ఎస్ పాయింట్‌లలో నిల్వ ఉన్న సరుకుల్లో కందిపప్పు  పాకెట్లు 20,690,పామాయిల్ 20,337, శెనగపప్పు10,132,గోధుమ పిండి 19331,బెల్లం 13,418, నెయ్యి 17515 ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా రేషన్ షాపుల నుంచి సుమారు లక్షన్నర ప్యాకెట్లు రావాల్సి ఉందని అంచనా. ఈ ప్యాకెట్లు ఎప్పుడు ఎంఎల్‌ఎస్ పాయింట్లకు చేరుతాయి. ఇంకెప్పుడు వాటిని పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది.  పూర్తి సరుకులు వచ్చాక వాటిని ఉన్నతాధికారులు సూచించిన విధంగా వసతి గృహాలకు తరలిస్తామని పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజర్ శర్మ ‘సాక్షి’కిచెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement