dormitories
-
తిరుమలలో వసతి గదుల ముందస్తు బుకింగ్ రద్దు
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్డ్స్ రిజర్వేషన్‌ను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ ఆ నాలుగు రోజులు తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. ► ఎమ్‌బీసీ–34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్, ఏఆర్పీ కౌంటర్లలో 2022 జనవరి 10వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 14వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయించబడవు. ► జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపులో ఎలాంటి ప్రివిలేజ్ వర్తించదు. ► శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకటకళా నిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు. ► స్వయంగా వచ్చిన ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయిస్తారు. ► సామాన్య భక్తులకు సీఆర్వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు. -
భక్తులకు మరింత సులభంగా వసతి గదులు
తిరుమల: తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన నూతన కౌంటర్లను అదనపు ఈవో శనివారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సీఆర్వో వద్ద మాత్రమే వసతి గదుల రిజిస్ట్రేషన్, కేటాయింపు చేసేవారన్నారు. ఇక్కడ రద్దీ అధికంగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసి, గదులు కేటాయించేందుకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నూతన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీటిల్లో సీఆర్వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జీఎన్సీ టోల్గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ వద్ద రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్ఎమ్ఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామన్నారు. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చని ధర్మారెడ్డి తెలిపారు. -
వసతి లేని గృహాలు !
ఖమ్మంమయూరిసెంటర్: రెండు రోజుల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను సైతం ప్రారంభించి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. రెండు నెలలుగా విద్యార్థులు లేక మూసి ఉన్న హాస్టళ్లను శుభ్రం చేయడంతో పాటు వసతిగృహాల్లో నెలకొన్న ఇతర సమస్యలను పరిష్కరించాలి. అయితే జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. వాటి పరిష్కారానికి అధికారులు చేపడుతున్న చర్యలు శూన్యం. ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతులకు అంచనాలు రూపొందించాలని ఆ శాఖ అధికారులు ఇంజనీరింగ్ శాఖకు లేఖలు రాసి, తమ పని అయిపోయిందన్నట్టుగా చేతులు దులుపుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్యా గుర్తించలేదు. బీసీ వసతిగృహాల్లోనూ సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. గతంలో ‘సాక్షి’ నిర్వహించిన హాస్టళ్ల సందర్శనలో బీసీ వసతి గృహాల్లో.. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలోని వసతిగృహాల్లోనే అత్యధిక సమస్యలు దర్శనమిచ్చాయి. వాటిని పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేస్తున్నామని అధికారులు చెపుతున్నా.. ఇప్పటి వరకు ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు పనులు చేపట్టినప్పటికీ కొన్ని కూడా పూర్తి కాలేదు. హాస్టళ్ల కిటికీలకు తలుపులు కూడా లేవు. మరో రెండు రోజుల్లో విద్యార్థులు వసతిగృహాలకు వస్తున్నా.. పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో సమస్యలు పరిష్కారమవుతాయా అనే ప్రశ్న విద్యార్థి సంఘాల్లో తలెత్తుతోంది. ప్రారంభం కాని మరమ్మతులు.. విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు రోజులే సమయం ఉండడం, వేసవి సెలవులు ముగించుకొని నూతనోత్సాహంతో ఇంటి నుంచి వసతిగృహాలకు వచ్చే విద్యార్థులకు సమస్యలే స్వాగతం పలుకనున్నాయి. ప్రతి ఏడాది వేసవిలోనే హాస్టళ్లలో సమస్యలను గుర్తించి, మరమ్మతుల కోసం ఆయా శాఖల అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక పంపించి అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఎస్సీ వసతిగృహాల్లో సమస్యలను గుర్తించాలని ఇంజనీరింగ్ అధికారులకు లేఖలు పెట్టినా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం లేకపోవడంతో వసతిగృహాల్లో సమస్యలు తప్పేలా లేవు. బీసీ హాస్టళ్లలో సమస్యలను గుర్తించినా.. ఇంతవరకు మరమ్మతు చర్యలేమీ చేపట్టలేదు. ఇక గిరిజన వసతిగృహాల్లో సైతం సమస్యలకు కొదవలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు మరమ్మతు పనులు ప్రారంభించినప్పటికీ ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ఈ మూడు శాఖల వసతిగృçహాలు, ఆశ్రమ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య ప్రధానంగా ఉంది. అద్దె భవనాల్లో ఉన్న వసతిగృహాల పరిస్థితి మరీ దారుణంగా ఉందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఆయా శాఖల సంక్షేమాధికారులు శ్రద్ధ చూపించకపోవడంతో మరమ్మతుల ప్రక్రియ ముందుకు సాగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయం పొడిగించినా ఫలితం లేదు.. 2019 – 20 విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ.. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రభుత్వం ఈనెల 12న పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. దీంతో వసతిగృహాల్లో సమస్యల పరిష్కారానికి కొద్ది సమయం దొరికిందని అధికారులు భావించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వసతిగృహాల్లో సమస్యలివే.. వసతిగృహాల ప్రారంభంలో విద్యార్థులకు ఎదురయ్యే సమస్యల్లో మొదటిది మరుగుదొడ్ల శుభ్రత. వసతిగృహాలు ప్రతి రోజు నిర్వహించే సమయంలోనే వీటిని శుభ్రం చేసే వారు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు రెండు నెలలు మూసి ఉంచిన అనంతరం తెరుస్తుండడంతో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. మరో ప్రధాన సమస్య తాగునీరు. గత్యంతరం లేని స్థితిలో విద్యార్థులు స్నానాలకు ఉపయోగించే నీటినే తాగిన విషయం గతంలో అనేక సార్లు బహిర్గతం అయింది. ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయకపోవడంతో ఈ సమస్య మళ్లీ ఉత్పన్నమయ్యేలా ఉంది. ఇక వాడుకునే నీరు సైతం అపరిశుభ్రంగానే ఉంది. జిల్లాలో వసతిగృహాల సంఖ్య ఇలా.. జిల్లాలో ఎస్సీ వసతిగృహాలు 50 ఉండగా వాటిలో కళాశాల స్థాయి 11 ఉన్నాయి. ఇందులో బాలురు 6, బాలికలకు 5 ఉన్నాయి. పాఠశాల స్థాయి వసతిగృహాలు 39 ఉండగా వీటిలో బాలురకు 25, బాలికలకు 14 కేటాయించారు. ఇందులో నేలకొండపల్లి బారుల వసతి గృహం ప్రైవేటు భవనంలో కొనసాగుతోంది. బీసీ వసతిగృహాలు 33 ఉండగా కళాశాల స్థాయి 10 ఉన్నాయి. ఇందులో బాలురవి 5, బాలికలవి 5. పాఠశాల స్థాయి వసతిగృహాలు 23 ఉండగా బాలురకు 18, బాలికలకు 5 కేటాయించారు. ఇందులో 10 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 19 వసతిగృహాలు ఉండగా కళాశాల స్థాయి 12 ఉన్నాయి. వీటిలో బాలురకు 6, బాలికలకు 6 కేటాయించారు. పాఠశాల స్థాయిలో 7 ఉండగా బాలురకు 5, బాలికలకు 2 ఉన్నాయి. ఇక ఆశ్రమ పాఠశాలలు 11 ఉండగా బాలురకు 4, బాలికలకు 7 కేటాయించారు. వీటిలో 4 అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. సమస్యలు గుర్తించడంలో నిర్లక్ష్యం.. వసతిగృహాల్లో సమస్యలను గుర్తించడంలో సంక్షేమశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యా సంవత్సరం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏ వసతిగృహంలో చూసినా ఏదో ఒక సమస్య విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంది. గత కొన్ని రోజులుగా అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోవడం లేదు. – ఎన్.ఆజాద్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి సమస్యలు గుర్తించినా మరమ్మతులు లేవు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వసతిగృహాల సందర్శన నిర్వహించి సమస్యలను గుర్తించాం. వాటిని నివేదిక రూపంలో తయారు చేసి ఆయా శాఖల అధికారులకు అందించాం. సమస్యలను వారికి విన్నవించినా పరిష్కరించకుండా చోద్యం చూస్తున్నారు. గుర్తించిన సమస్యలను మరమ్మతులు చేసి పరిష్కరించడంలో అధికారులు విఫలమవుతున్నారు. – టి.నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి -
నిర్మించి నిరుపయోగం చేశారు..!
వివిధ డిగ్రీ కళాశాలల్లో వసతిగృహాలకు భవనాల నిర్మాణం మూడేళ్లయినా హాస్టల్స్ ఏర్పాటు చేయని అధికారులు నిరుపయోగంగా భవనాలు.. ప్రైవేట్ కార్యకలాపాలకు వినియోగం నిడదవోలు :జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నాలుగేళ్ల క్రితం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నిధులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం నిర్మించిన వసతిగృహాల భవనాలు నిరుపయోగంగా మారాయి. లక్షల రూపాయలతో భవనాలను నిర్మించినా వాటిలో హాస్టల్స్ నిర్వహించకపోవడంతో అవి విద్యార్థులకు అక్కరకు రాకుండా పోయాయి. దీంతో ఆ భవనాలు ప్రైవేట్ వ్యక్తుల కార్యకలాపాలకు ఉపయోగపడుతున్నాయి. వాటిని వినియోగంలోకి తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖల అధికారులు పట్టించుకోకపోవడంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2012లో నిధులు మంజూరు జిల్లాలో నిడదవోలు, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సంక్షేమ వసతి గృహాల నిర్వహించేందుకు భవనాల నిర్మాణానికి యూసీజీ నిధులు మంజూరు చేసింది. నిడదవోలు పట్టణంలో వెలగపూడి దుర్గాంబ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో రూ. 58.75 లక్షలతో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రెండు అంతస్తుల భవనాన్ని నిర్మించారు. కింద నాలుగు విశాలమైన గదులు, పై అంతస్తులో రెండు గదులతో పాటు డైనింగ్ హాలును నిర్మించారు. 2013లో అప్పటి రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఈ భవనాన్ని ప్రారంభించారు. ఈ కళాశాలలో 500 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పట్టణ చుట్టుపక్కల 48 గ్రామాల నుంచి దాదాపు 400 మంది విద్యార్థులు ఈ కళాశాలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి హాస్టల్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావించారు. అయితే అప్పటి నుంచి భవనంలో హాస్టల్ ఏర్పాటు చేయలేదు. నిడదవోలు పట్టణ శివారున ఉన్న ఎస్వీఆర్కే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా 2010లో యూజీసీ నిధులు రూ.20 లక్షల వ్యయంతో వసతిగృహం నిర్మించారు. కానీ ఇప్పటికి కూడా హాస్టల్ ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. పాలకొల్లు, తాడేపల్లిగూడెంలో.. ఇదే విధంగా జిల్లాలోని పాలకొల్లు దాసరి నారాయణరావు మహిళా డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో వసతి గృహ భవనం నిర్మించారు. ఇదే పట్టణంలోని అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.60 లక్షలతో నిర్మించిన వసతి గృహ భవనం కూడా నిరుపయోగంగా మారింది. తణుకు చిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తాడేపల్లిగూడెం డీఆర్జీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కూడా నిర్మించిన హాస్టల్ భవనాలు నిరుపయోగంగానే మారాయి. దాదాపుగా ఈ భవనాలన్నింటిలో ప్రస్తుతం ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం గమనార్హం. భవనాలు ఖాళీగా ఉండడంతో యోగా, వ్యాయామం క్లాసులు, ఇతర కార్యక్రమాలకు వివిధ సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కనీసం తాళాలు కూడా వేయకపోవడంతో రాత్రి సమయాల్లో అసాంఘిక కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. భవనాల కిటికీలు ఇప్పటికే ధ్వంసమయ్యాయి. అద్దె భవనాల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్స్మరోవైపు ఇవే పట్టణాల్లో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండడం గమనార్హం. నిడదవోలు పట్టణంలో చాలా కాలం నుంచి ఎస్సీ సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖకు చెందిన ఇంటర్ విద్యార్థుల వసతి గృహలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. పట్టణంలోని రాయిపేటలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టల్‌ను 2008 నుంచి అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఇంటర్, డిగ్రీ, బీఈడీ విద్యార్థులు కూడా ఉంటున్నారు. నెలకు రూ.20 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. కనీసం ఆ హాస్టల్‌ను డిగ్రీ కళాశాలలో నిర్మించిన భవనానికి తరలిస్తే ప్రభుత్వానికి అద్దె మిగలడంతో పాటు కళాశాల విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని పట్టణ ప్రజలు సూచిస్తున్నారు. హాస్టల్ ప్రారంభించేందుకు చర్యలు కళాశాలలో మూడేళ్ల క్రితం యూజీసీ నిధులతో హాస్టల్ భవనం నిర్మించారు. ఏడాది క్రితం కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదాకు యూజీసీ అధికారులకు నివేదిక పంపించాం. అనుమతులు రాగానే హాస్టల్ ప్రారంభించేందుకు కృషి చేస్తాం. - డాక్టర్ ఎస్కే ఇమాంఖాసీం, ప్రిన్సిపల్, ఎస్వీడీ డిగ్రీ కళాశాల, నిడదవోలు -
గుంటూరు, విశాఖ జిల్లాలకు మన బియ్యం
విజయనగరం: జిల్లాలోని బియ్యాన్ని గుంటూరు, విశాఖ జిల్లాలకు తరలించేందుకు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జిల్లాలో 2.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. ఇంకా సేకరిస్తున్నారు. అయితే వీటిని మిల్లర్లు మరపట్టి ఆడించి ఇస్తే 2లక్షల మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం వస్తాయి. జిల్లాలో మాత్రం కేవలం 96,983 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాములు మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని 118 మిల్లుల ద్వారా లక్ష మెట్రిక్ టన్నులకు పైగా బియ్యం వచ్చి చేరాయి. సామర్థ్యం సరిపోక పోవడంతో గోదాములకు చేరిన లారీలు అన్‌లోడింగ్‌కు అవకాశం లేకపోవడంతో రోడ్లపైనే నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల సంస్థ కమిషనర్‌ను సంప్రదించిన జిల్లా అధికారులు పదివేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విశాఖలోని పెందుర్తి గోదాముకు తరలించి ఆమేరకు మాత్రమే ఖాళీ చేయించగలిగారు. ప్రతి రోజూ బియ్యం నిల్వలు పది నుంచి 15 వేల మెట్రిక్ టన్నుల వరకూ వస్తూనే ఉన్నాయి. వర్షం వస్తే బియ్యం పాడయి భారీ నష్టం ఏర్పడే ప్రమాదమున్నందున మార్కెటింగ్, వేర్ హౌస్, సివిల్‌సప్లైస్ అధికారులతో జాయింట్‌కలెక్టర్ గురువారం సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ధాన్యం ఉత్పత్తులు తక్కువగా ఉన్న గుంటూరు, చిత్తూరు జిల్లాలకు సుమారు 12,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని విజయనగరం నుంచి రైల్వే వ్యాగన్ల ద్వారా శుక్రవారం నుంచి తరలించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని ప్రజాపంపిణీ, వసతిగృహాలు, మధ్యాహ్న భో జనం వంటి అవసరాలకు ప్రతినెలా దాదాపు 12వేల మెట్రిక్ టన్నులు ఖాళీ అవు తాయి కనుక సమస్య తీరుతుందని భావిస్తున్నారు. -
హా.. స్టల్స్‌కు చంద్రన్న సరుకులు..!
విజయనగరం కంటోన్మెంట్: సంక్రాంతి సందర్భంగా నాసిరకం సరుకులు పంపిణీ చేశారన్న అపప్రధను మూటగట్టుకున్న యంత్రాంగం ఇప్పుడు వాటికి లెక్కలు కూడా చెప్పలేకపోతోంది. అంతే కాదు నాణ్యత లేని సరుకులను మరో నెల రోజులు స్టాకు ఉంచి పలు మార్లు అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు రవాణా చేసి చివరకు వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థుల నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో పంపిణీ కాగా మిగిలిపోయిన చంద్రన్న సరుకులను వసతి గృహాలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఠ మొదటి పేజీ తరువాయి నిర్ణయించింది. అసలే సరుకులు బాగాలేవని ప్రజలంతా విమర్శిస్తున్న సమయంలో ఆ సరుకులను వసతి గృహాలకు తరలిస్తే విద్యార్థులేం తింటారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో పంపిణీ చేసిన చంద్రన్న సరుకుల్లో శనగపప్పు, కందిపప్పు, బెల్లం, గోధుమ పిండి వంటివి నాణ్యత బాగాలేవు. నెల రోజుల కిందటే ఈ సరుకులు బాగాలేని కారణంగా ఎవరూ తీసుకెళ్లలేదు. ఇప్పుడు నెల రోజులు దాటిపోయి ఇంకా సరుకులు డీలర్ల ఇళ్ల వద్ద ఉండిపోయాయి. ఆ సరుకులను ఇప్పుడు జిల్లాలోని వివిధ వసతి గృహాలకు ఇస్తే పరిస్థితి ఏమిటన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మిగిలిపోయిన రెండున్నర లక్షల ప్యాకెట్లుసంక్రాంతి సందర్భంగా జిల్లాలోని కొత్త, పాతవి కలిపి 6.84 లక్షల రేషన్ కార్డులకు చంద్రన్న సంక్రాంతి సరుకులు పంపిణీ చేసేందుకు దాదాపు ఏడు లక్షలకు పైగా కిట్లు తీసుకువచ్చారు. ఈ కిట్లను ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా జిల్లాలోని 1388 రేషన్ షాపులకు అందజేశారు. సరుకుల పంపిణీ ప్రారంభంలో అన్నింటికీ ఈపోస్ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. గిరిజన గ్రామాల్లోని 48 షాపులకు మాత్రం మాన్యువల్‌గా పంపిణీ చేశారు. సంక్రాంతి పండగ దగ్గరపడుతున్న కొద్దీ ఈపోస్ విధానం వల్ల సరుకుల పంపిణీ ఆలస్యమవుతోందని గుర్తించిన ప్రభుత్వం మొత్తం అన్ని రేషన్ షాపులకూ మాన్యువల్విధానాన్ని అప్పగించింది. అయితే నాణ్యత బాగాలేవన్న కారణంగా కొంతమంది కొన్ని సరుకులను తీసుకోలేదు. మరికొన్ని చోట్ల సంబంధిత కార్డు దారులు అందుబాటులో లేకపోవడంతో చంద్రన్న సరుకులు మిగిలాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రేషన్దుకాణాల్లోనూ దాదాపు రెండున్న ర లక్షల ప్యాకెట్లు మిగిలాయి. ఎంఎల్‌ఎస్‌కు చేరిన లక్ష ప్యాకెట్లు మిగిలిపోయిన చంద్రన్న సరుకుల ప్యాకెట్లను వెనువెంటనే ఆయా ప్రాంతాల్లోని స్టాక్ పాయింట్లకు చేర్చాల్సి ఉంది. కానీ చాలా చోట్ల ఇంకా సరుకులు చేరలేదు. ప్రతి రోజూ సరుకుల గురించి అడుగుతుండడం కనిపిస్తున్నదే త ప్ప సరుకులు ఇచ్చే డీలర్లు కనిపించడం లేదు. అయితే ఈ రెండున్నర లక్షల ప్యాకెట్లలో కేవలం లక్ష ప్యాకెట్లు మాత్రమే ఎంఎల్ఎస్ పాయింల్కు మిగతా సరుకులు ఏమయినట్టో ఎవరికీ తెలియదు. అసలే నాణ్యత లేమి అపై పలుమార్లు రవాణా చంద్రన్న సరుకులు జిల్లాకు చేరి నెలరోజులకు పైగా అయింది. ఇలా జిల్లాకు చేరిన సరుకులు అప్పటికే నాణ్యతలేమితో ఉండగా . ఆ తరువాత ఇప్పుడు మళ్లీ ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపిస్తున్నారు. మళ్లీ వాటిని వసతి గృహాలకు పంపిస్తారు. ఇలా పలుమార్లు రవాణాలో పాడైన సరుకులు వసతి గృహాలకు చేరిన తరువాత ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. అంటే ఆ సరుకులను ఏదో విధంగా వాడేందుకే మొగ్గు చూపుతున్న యంత్రాంగం విద్యార్థుల ఆరోగ్యాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఎంఎల్ఎస్ పాయింట్లలో నిల్వ ఉన్న సరుకుల్లో కందిపప్పు పాకెట్లు 20,690,పామాయిల్ 20,337, శెనగపప్పు10,132,గోధుమ పిండి 19331,బెల్లం 13,418, నెయ్యి 17515 ప్యాకెట్లు ఉన్నాయి. ఇంకా రేషన్ షాపుల నుంచి సుమారు లక్షన్నర ప్యాకెట్లు రావాల్సి ఉందని అంచనా. ఈ ప్యాకెట్లు ఎప్పుడు ఎంఎల్ఎస్ పాయింట్లకు చేరుతాయి. ఇంకెప్పుడు వాటిని పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. పూర్తి సరుకులు వచ్చాక వాటిని ఉన్నతాధికారులు సూచించిన విధంగా వసతి గృహాలకు తరలిస్తామని పౌరసరఫరాల సంస్థ సహాయ మేనేజర్ శర్మ ‘సాక్షి’కిచెప్పారు. -
హా...స్టలా...! వద్దులే!
వసతుల్లేక ఆసక్తి చూపని విద్యార్థులు సీట్ల భర్తీకి వార్డెన్లు, మేట్రిన్ల పాట్లు యలమంచిలి/యలమంచిలి రూరల్ : కనీస వసతులు లేని ప్రభుత్వ వసతి గృహాలపై విద్యార్థులకు ఆసక్తి తగ్గుతోంది. ఫలితంగా విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ కావడం లేదు. వసతి గృహాల్లో పూర్తిస్థాయిలో విద్యార్థులను చేర్చుకోవడానికి వార్డెన్లు, మేట్రిన్లు పాఠశాలల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏదోవిధంగా వసతి గృహాల్లో విద్యార్థులను చేర్చాలంటూ ఉన్నతాధికారులు ఆదేశాలతో వార్డెన్లు, మేట్రిన్లు గ్రామాల బాట పట్టారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో విద్యార్థులను వసతి గృహాల్లో చేర్చడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. జిల్లాలో 78 ఎస్సీ వసతి గృహాల్లో 8,200 ఖాళీలు ఉండగా ఇప్పటివరకు 5,500 ఖాళీలు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో 22 వేల మంది ఎస్సీ విద్యార్థులు చదువుతున్నారు. శిథిల భవనాలకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులు అంతంతమాత్రంగా ఉండడంతో పూర్తిస్థాయిలో మరమ్మతులు జరగడం లేదు. శిథిల భవనాల్లో.... యలమంచిలి ఎస్సీ నం.1,2 వసతి గృహాల్లో 100 మంది విద్యార్థులు రెండు గదుల్లో ఉంటున్నారు. భోజనాలు, చదువులు, పడక అన్నీ ఆ గదిలోనే. ఇరుకు గదుల్లో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. రెండు వసతి గృహాల్లో 200 మంది విద్యార్థులను చేర్చుకోవలసి ఉంది. విద్యార్థుల కొరత కారణంగా నం.1 ఎస్సీ వసతి గృహాన్ని కార్యాలయంగా వినియోగిస్తున్నారు. రెండు వసతి గృహాల విద్యార్థులను ఒకే వసతిగృహంలో ఉంచారు. స్నానాలు, మరుగుదొడ్ల ఇబ్బందులు వసతి గృహాల్లో విద్యార్థులు స్నానాలు, మరుగుదొడ్లకు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరుగుదొడ్లు తక్కువగా ఉండడంతో పలువురు విద్యార్థులు వసతి గృహాల పరిసరాలను మరుగుదొడ్లుగా వినియోగిస్తున్నారు. ఇక స్నానాలకు గదులు చాలక ఆరుబయటే స్నానాలు చేయవలసి వస్తోంది. విద్యా ప్రమాణాల్లేవు...వసతి గృహాల్లో విద్యార్థులకు విద్యాప్రమాణాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. పాఠశాల నుంచి వసతి గృహాలకు చేరుకుంటున్న విద్యార్థులకు ఉదయం సాయంత్రం పాఠ్యాంశాలపై సరైన శిక్షణ లేకపోవడంతో విద్యలో మిగిలిన విద్యార్థులకంటే వెనుకబడుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థులకు సాయంత్రం పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులను నియమించేవారు. అయితే వీరికి నెలకు రు.1000 మాత్రమే ఇస్తుండడంతో ఉపాధ్యాయులు ఆసక్తి కనబరచడంలేదు. దీంతో విద్యార్థులు పాఠశాలలో బోధించిన పాఠ్యాంశాలతో సరిపెట్టుకోవలసి వస్తోంది. రుచిలేని ఆహారం వసతి గృహాల్లో ఉదయం అల్పాహారంతో పాటు రాత్రి భోజనం పెడుతున్నారు. పలు వసతి గృహాల్లో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వార్డెన్లు, మేట్రిన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అల్పాహారం, భోజనాల్లో నాణ్యత లేకపోయినా విద్యార్థులు పెదవి విప్పడం లేదు. తల్లిదండ్రులకు, అధికారులకు ఫిర్యాదు చేయవద్దని వార్డెన్లు, మేట్రిన్లు విద్యార్థులకు హుకుం జారీ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నా పాఠశాల డైరీ... ప్రభుత్వ వసతి గృహాల్లో ఖాళీలను పూర్తిచేయడానికి సాంఘిక సంక్షేమ శాఖ ఈ ఏడాది నా పాఠశాల డైరీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. కార్యక్రమంలో వసతి గృహాల్లో విద్యార్థుల విద్యా ప్రగతిని తెలిపే డైరీని విద్యార్థులకు అందజేశారు. విద్యార్థి వ్యక్తిగత సమాచారంతో పాటు వసతిగృహాల్లో ప్రవేశ మార్గదర్శక సూచనలు, విద్యార్థులకు కల్పించబడే సదుపాయాల గురించి వివరించారు.