పింఛన్‌కు ఆధార్ గ్రహణం
గుడ్లవల్లేరు : ఆధార్ కార్డు లేదనే సాకుతో ఇప్పటికే రేషను సరుకుల పంపిణీ నిలిపేసిన ప్రభుత్వం సెప్టెంబరు నెల నుంచి పింఛనుదారులకు పింఛన్లనూ నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. కానీ పింఛనుదారులందరికీ ఆధార్ జారీ చేయడం లేదు. ముఖ్యంగా బరువైన పనులు చేయడం వలన వృద్ధుల చేతి వేలిముద్రలు అరిగిపోతున్నాయి. ఇలాంటి వృద్ధులకు ఆధార్ కార్డును జారీ చేసేందుకు ఆయా కేంద్రాల వారు ససేమిరా అంటున్నారు. ఇప్పటివరకూ ఇద్దరేసి వృద్ధులకు ఒక్కో ఆధార్ నంబరుపై పింఛన్లను ఇస్తూ వచ్చిన ప్రభుత్వం సెప్టెంబరు నుంచి ఖచ్చితంగా ఆధార్‌కార్డులు లేకపోతే ఇవ్వబోమని తేల్చి చెప్పేసింది.
ఆధార్ మంజూరు కాలేదు
పెనుమూడి కోటేశ్వరరావు, శేరీ కల్వపూడి
ప్రమాదంలో చేతి వేళ్లు పోవడంతో వేలిముద్రలు వేయలేకపోవడం వలన నాకు ఆధార్ కార్డు మంజూరు కాలేదు. రేషను సరుకులు ఇవ్వనని మా డీలరు చెప్పేశాడు. ఇపుడు పింఛను రావడం లేదు. ఇప్పటికైనా నాకు ఆధార్ కార్డును ప్రభుత్వం కల్పించాలి.