ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా నిర్వహించాలి : జేసీ
Published Tue, Nov 1 2016 11:33 PM | Last Updated on Sun, Sep 2 2018 4:03 PM
కాకినాడ సిటీ : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాల్సిన బాధ్యత కేంద్రాల ఇన్ చార్జిలదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక అంబేడ్కర్‌భవన్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి పౌరసరఫారాల సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర చెల్లించడానికి కేంద్రాల ఇన్ చార్జిలు బాధ్యతతో పనిచేయాలన్నారు. కేంద్రాల్లో రిజిస్టర్లు నిర్వహించాలని చెప్పారు. ధాన్యం సాధరణ రకం 75కిలోలు రూ.1102.50పైసలు, వంద కిలోలు రూ.1470, గ్రేడ్–ఎ రకం 75కిలోలు రూ.1132.50పైసలు, వంద కిలోలు రూ.1510 మద్దతు ధరగా ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా 251 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నటు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆర్డీఓలు అంబేడ్కర్, సుబ్బారావు, గణేష్‌కుమార్, విశ్వేశ్వరరావు, పౌరసరఫరాల సంస్థ డీఎం కె.కృష్ణారావు, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, మార్కెటింగ్ శాఖ ఏడీ కేవీఆర్‌ఎన్ కిషోర్, డీసీఓ ప్రవీణ తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రం
కాకినాడ సిటీ: కాట¯ŒS కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా(గుంటూరు) ఆధ్వర్యంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. కనీస మద్దతు ధర, ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల రెండోవారంలో పిఠాపురంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనున్నారని ఇందుకు మార్కెటింగ్‌శాఖ సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కనీస మద్దతు ధర రూ.4160 ఉందన్నారు. అలాగే ఏలేరు ఆధునికీకరణ, ఏడీబీ రోడ్, కెనాల్‌రోడ్ భూసేకరణ పనులపై ఆయా శాఖల అధికారులతో ఆయన కలెక్టరేట్‌లో సమీక్షించారు. రాజానగరం– సామర్లకోట ఏడీబీరోడ్డు భూసేకరణకు సర్వే పూర్తయిందని, వారం రోజుల్లో ప్రిలిమినరీ నోటిఫికేష¯ŒS జారీ చేయాలని పెద్దాపురం ఆర్డీఓను ఆదేశించారు.
Advertisement
Advertisement