UP Vegetable Vendor Hires Bouncers To Protect Tomatoes - Sakshi
Sakshi News home page

టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి.. 

Published Sun, Jul 9 2023 6:07 PM | Last Updated on Sun, Jul 9 2023 6:37 PM

UP Vegetable Vendor Hires Bouncers To Protect Tomatoes - Sakshi

వారణాసి: యూపీలోని ఓ కాయగూరల వ్యాపారి తన షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను నియమించాడు. ఉన్నట్టుండి టమాటాల ధర ఆకాశాన్నంటడంతో కస్టమర్లతో ఇబ్బంది అవుతోందని బౌన్సర్లను పెట్టుకున్నట్లు చెబుతున్నాడు షాపు యజమాని. 

ఆ కాయగూరల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160కి చేరింది. దీంతో టమాటాలు కొనడానికి వచ్చేవారు ఇక్కడ ఘర్షణలకు పాల్పడుతున్నారు. కొంత మంధైతే టమాటాలను దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని తెలిపాడు. 

టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.160గా ఉంది. షాపుకి వచ్చేవారు కూడా 50 గ్రాములు, 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని, మా షాపులో టమాటాలు దండిగా ఉన్నందున ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా చూసేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని తెలిపాడు. 

కూరగాయల షాపు ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారు.  

ఇది కూడా చదవండి: మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement