Vegetable venders
-
Rahul Gandhi: రామేశ్వర్ ముఖంలో నవ్వులు పూయించిన రాహుల్
రామేశ్వర్.. అడ్డగోలుగా పెరిగిన టమాట ధరలు.. వాటి వల్ల తాను ఎలాంటి కష్టాలు అనుభవిస్తోంది చెబుతూ కన్నీటి పర్యంతమైన ఓ కూరగాయల వ్యాపారి. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కట్ చేస్తే.. ‘‘నాకు ఈ సమాజంలో బతకాలని లేదు’’ అంటూ భార్యా, కూతురు పక్కన ఉండగానే రామేశ్వర్.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీకి తన కష్టాలను ఏకరువు పెట్టుకున్నారు. ఆ సమయంలో అలా మాట్లాడొద్దంటూ ఆయనకు ధైర్యం చెప్పడమే కాదు.. ఆయన ముఖంలో చిరునవ్వులూ పూయించారు రాహుల్. వీడియో వైరల్ అయిన తర్వాత ఢిల్లీలోని ఆజాదీ మండీ కూరగాయల మార్కెట్‌ను రాహుల్ గాంధీ స్వయంగా సందర్శించి.. అక్కడి వ్యాపారుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఆ టైంలో రామేశ్వర్‌ను ఆయన కలవలేకపోయారు. దీంతో ఆయన్ని ఇంటికి రప్పించుకున్న రాహుల్ గాంధీ.. లంచ్ తానే స్వయంగా వడ్డించాడు. ఆయన భార్య ఉపవాసం అని తెలుసుకుని.. కావాలంటే పండ్లు తీసుకొస్తానంటూ రాహుల్ అనడమూ ఆ వీడియోలో ఉంది. ఆపై అతని కష్టాలను సావధానంగా విన్నారు కూడా. అంతేకాదు.. అతనికి ధైర్యాన్ని అందించారు కూడా. ‘‘రామేశ్వర్‌జీ గొంతు.. ఆయన ఒక్కరిదే కాదు. దేశంలో ఆయనలా బాధలు, సమస్యలు, సవాళ్లు ఎదుర్కొంటున్న ఎంతోమంది గొంతుక. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది చర్చల్లో కూడా లేకుండా పోయింది. వాళ్ల గొంతుకను వినడమే కాదు.. సమస్యతో పోరాడుతున్న వాళ్లకు సాయం అందించడం కూడా మన నైతిక బాధ్యత అంటూ రాహుల్ గాంధీ ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. ఢిల్లీ ఆజాద్‌పూర్ మండీకి చెందిన రామేశ్వర్ పెరిగిన కూరగాయల ధరలు తన మనుగడకు ఎలాంటి అవాంతరం కలిగిస్తుందో చెబుతూ.. రామేశ్వర్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ వీడియో వైరల్ కావడంతో.. పలువురు రాజకీయ నేతలు సహా సోషల్ మీడియాలో పెద్ద ఎతున సాయం అందించేందుకు ముందుకు వచ్చారు కూడా. रामेश्वर जी उस भारत की आवाज़ हैं जिसकी पीड़ा, मुद्दे और चुनौतियां आज मुख्यधारा की बहस से बहुत दूर हैं। उस भारत की आवाज़ सुनना और संघर्षों का मुकाबला करने में साथ निभाना हम सब की नैतिक ज़िम्मेदारी है। उनकी सच्चाई और सादगी से भरी बातचीत का पूरा वीडियो: https://t.co/OL3hB2rQVQ pic.twitter.com/JTwUulQ4aF — Rahul Gandhi (@RahulGandhi) August 18, 2023 -
టమాటాలు తెచ్చిన తంటాలు.. బౌన్సర్లను పెట్టుకున్న వ్యాపారి..
వారణాసి: యూపీలోని ఓ కాయగూరల వ్యాపారి తన షాపు ముందు ఇద్దరు బౌన్సర్లను నియమించాడు. ఉన్నట్టుండి టమాటాల ధర ఆకాశాన్నంటడంతో కస్టమర్లతో ఇబ్బంది అవుతోందని బౌన్సర్లను పెట్టుకున్నట్లు చెబుతున్నాడు షాపు యజమాని. ఆ కాయగూరల వ్యాపారి మాట్లాడుతూ.. ప్రస్తుతం కిలో టమాటా ధర రూ. 160కి చేరింది. దీంతో టమాటాలు కొనడానికి వచ్చేవారు ఇక్కడ ఘర్షణలకు పాల్పడుతున్నారు. కొంత మంధైతే టమాటాలను దొంగతనంగా ఎత్తుకుపోతున్నారని తెలిపాడు. టమాటాల ధర ప్రస్తుతం కిలో రూ.160గా ఉంది. షాపుకి వచ్చేవారు కూడా 50 గ్రాములు, 100 గ్రాములు మాత్రమే కొంటున్నారని, మా షాపులో టమాటాలు దండిగా ఉన్నందున ఇక్కడ ఎలాంటి హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా చూసేందుకు ఇద్దరు బౌన్సర్లను నియమించానని తెలిపాడు. కూరగాయల షాపు ముందు బౌన్సర్లు విధులు నిర్వహిస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో స్వైర విహారం చేస్తోంది. నెటిజన్లు కూడా అందుకు తగ్గట్టుగానే చిత్ర విచిత్రమైన కామెంట్లతో స్పందిస్తున్నారు. VIDEO | A vegetable vendor in Varanasi, UP has hired bouncers to keep customers at bay when they come to buy tomatoes, whose price has increased massively over the past few days. "I have hired bouncers because the tomato price is too high. People are indulging in violence and… pic.twitter.com/qLpO86i9Ux — Press Trust of India (@PTI_News) July 9, 2023 ఇది కూడా చదవండి: మంత్రిని ఆహ్వానించడానికి విద్యార్థులే దొరికారా? -
‘సాఫ్ట్వేర్ శారద’ కథనంపై స్పందించిన ఎంపీ
సాక్షి, హైదరాబాద్/వరంగల్: కరోనా లాక్డౌన్ కారణంగా ఉద్యోగం కోల్పోయి కూరగాయలు అమ్ముతున్న యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై పలువురు ప్రముఖులు స్పందించారు. కష్టపడి పనిచేయాలన్నది శారద ఆదర్శంగా తీసుకున్నారని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. తద్వారా యువతకు ఆదర్శంగా నిలిచిచారని కొనియాడారు. శారద కష్టపడేతత్వం చూసి గర్వంగా ఫీలవుతున్నానని తెలిపారు. ఆమె కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. శారద కుంటుంబాన్ని కలుస్తానని ఎంపీ వెల్లడించారు. స్టాఫ్‌వేర్ ఉద్యోగిగా పనిచేసి కూరగాయలు అమ్ముతున్న శారద కథనం తనను ఎంతగానో కదిలించిందని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శారద ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం తరఫున శారద కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ఇక సాఫ్ట్వేర్ శారదపై సాక్షి కథనానికి ఉపరాష్ట్రపతి కార్యాలయం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం, తెలంగాణ బీజేపీ నాయకులు, పలువురు ఎన్ఆర్ఐలు స్పందించారు. ఆమెకు ఉద్యోగం ఇచ్చేందుకు పలు ఐటీ సంస్థలు ముందుకొచ్చాయి. (చదవండి: భూ వివాదం : సెల్ టవర్ ఎక్కిన యువకుడు) జీవితం అంటే అదొక్కటే కాదు ఉద్యోగం ఒక్కటే లైఫ్ కాదని యువ సాఫ్ట్వేర్ శారద అన్నారు. నెగటివ్‌గా ఆలోచించి ఆత్మహత్యలకు పాల్పడవద్దని సాక్షి టీవీతో మాట్లాడుతూ ఆమె యువతకు సందేశం ఇచ్చారు. ఓడిపోయినా ధైర్యంగా నిలబడి విజయం సాధించవచ్చని తెలిపారు. ఇదిలాఉండగా.. కుటుంబం కోసమే శారద కూరగాయలు అమ్ముతోందని ఆమె తల్లి తెలిపారు. శారదను చదివించేందుకు చాలా కష్టపడ్డానని చెప్పారు. చిన్నతనం నుంచి శారద బాగా కష్టపడేదని అన్నారు. వయసు పైబడిన తండ్రికి సాయం చేస్తోందని అన్నారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీలో రెండేళ్లు సాప్ట్వేర్ ఉద్యోగం చేసిన శారద ఇటీవల హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజీకి కొత్తగా జాబ్‌లో జాయిన్ అయ్యారు. మూడు నెలల పాటు ట్రైనింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. అంతలోనే కరోనా వ్యాప్తి మొదలవడం, దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో సదరు కంపెనీ యాజమన్యం ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. అయినప్పటికీ ఎలాంటి కుంగుబాటుకు లోనవకుండా ఆమె తల్లిదండ్రులకు తోడుగా కూరగాయల వ్యాపారం ప్రారంభించారు. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. (కూరగాయలు అమ్ముతున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్) -
కూరగాయల వ్యాపారుల ఘర్షణ: కత్తిపోట్లు
పరకాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరకాలలోని కూరగాయల మార్కెట్లో ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. దీంతో ఓ వ్యాపారి కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం సంత జరుగుతుండగానే మార్కెట్లో కక్కు శ్రీను, వనం రాజు అనే వ్యాపారులు గొడవపడ్డారు. రాజుపై శ్రీను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిపోయిన రాజును ఇతర వ్యాపారులు పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శ్రీను పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరకాల సీఐ జాన్ నర్సింహులు, ఎస్ఐ సుధాకర్‌లు సందర్శించి వివరాలు సేకరించి కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో ఎదురెదురుగా దుకాణాలు నిర్వహిస్తున్న వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో వారం క్రితమే పెద్దలు పంచాయితీ చేసి మరోసారి గొడవలు పడవద్దని ఇద్దరి కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలిసింది. అయినా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇతర వ్యాపారులు తెలిపారు. సంతలో జరిగిన ఈ సంఘటన వ్యాపారులను, కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేసింది.