కూరగాయల వ్యాపారుల ఘర్షణ: కత్తిపోట్లు | Vegetable venders fight in Jayashanker Bhupalapalli | Sakshi
Sakshi News home page

కూరగాయల వ్యాపారుల ఘర్షణ: కత్తిపోట్లు

Published Sun, Jul 2 2017 5:25 PM | Last Updated on Tue, Oct 2 2018 6:46 PM

Vegetable venders fight in Jayashanker Bhupalapalli

పరకాల: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పరకాలలోని కూరగాయల మార్కెట్‌లో ఇద్దరు వ్యాపారస్తుల మధ్య పాత కక్షలు భగ్గుమన్నాయి. దీంతో ఓ వ్యాపారి కత్తిపోట్లకు గురయ్యాడు. ఆదివారం సంత జరుగుతుండగానే మార్కెట్‌లో కక్కు శ్రీను, వనం రాజు అనే వ్యాపారులు గొడవపడ్డారు. రాజుపై శ్రీను కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుప్పకూలిపోయిన రాజును ఇతర వ్యాపారులు పరకాల సివిల్‌ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

శ్రీను పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని పరకాల సీఐ జాన్‌ నర్సింహులు, ఎస్‌ఐ సుధాకర్‌లు సందర్శించి వివరాలు సేకరించి  కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో ఎదురెదురుగా దుకాణాలు నిర్వహిస్తున్న వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండడంతో వారం క్రితమే పెద్దలు పంచాయితీ చేసి మరోసారి గొడవలు పడవద్దని ఇద్దరి కుటుంబ సభ్యులకు సూచించినట్లు తెలిసింది. అయినా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని ఇతర వ్యాపారులు తెలిపారు. సంతలో జరిగిన ఈ సంఘటన వ్యాపారులను, కొనుగోలుదారులను భయభ్రాంతులకు గురిచేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement