tomato farmers
-
టమోటా రైతులను పట్టించుకోని కూటమి ప్రభుత్వం
-
టమాట రైతులకు అండగా ప్రభుత్వం
కర్నూలు (అగ్రికల్చర్): ధరలు తగ్గుతుండటంతో టమాట రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యాపారులు సిండికేట్ కాకుండా చూడటం, ధర తగ్గుతున్నప్పుడు వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇటీవల వరకు టమాట ధర చుక్కలనంటింది. ఆ సమయంలో జిల్లాలో టమాట పంట లేదు. ఇప్పుడు రైతులు సాగు చేసిన పంట ఒక్కసారిగా మార్కెట్‌ను ముంచెత్తడంతో ధరలు పడిపోయాయి. దీంతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం మార్కెటింగ్ శాఖకు దిశానిర్దేశం చేసింది. జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఈ నెల 9 నుంచి మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం పత్తికొండ మార్కెట్ యార్డులో జరిగే టమాట వేలం పాటలో పాల్గొంటుందని మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఎం) నారాయణమూర్తి తెలిపారు. శుక్రవారం పత్తికొండ మార్కెట్లో టమాట ధర కిలోకు కనిష్టంగా రూ.7, గరిష్టంగా రూ.14 పలికింది. మోడల్ ధర రూ.10గా నమోదైంది. కనిష్ట ధర రూ.7 కంటే తక్కువకు పడిపోతున్నప్పుడు మాత్రమే మార్కెటింగ్ శాఖ ఏర్పాటు చేసిన బృందం వేలంలో పాల్గొంటుంది. మార్కెటింగ్ శాఖ కూడా వేలంలో పాల్గొంటున్నందున వ్యాపారుల మధ్య పోటీ పెరిగే అవకాశం ఉంటుంది. మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన టమాటను రైతుబజార్ల ద్వారా నో లాస్, నో ప్రాఫిట్ కింద వినియోగదారులకు విక్రయిస్తామని ఏడీఎం తెలిపారు. -
టమాటాలు అమ్మి రూ. 38 లక్షలు.. రైతు పంట పండింది!
గత కొంత కాలంగా తక్కువ ధరకే లభించిన 'టమాట' ఇప్పుడు కొండెక్కింది. కేజీ ధర రూ. 150 నుంచి రూ. 180 వరకు వుంది. ఇది సామాన్యులకు కొంత కష్టంగా అనిపించినా.. ఎప్పటి నుంచో సరైన ధరల కోసం ఎదురు చూస్తున్న రైతన్నకు మాత్రం శుభవార్త అనే చెప్పాలి. ఎన్ని పంటలు పండించినా రైతు అప్పులు పాటు అవుతున్న సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు టమాట రైతుల మోహంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. మంచి లాభాలను పొందుతున్నారు. ఇటీవల ఒక రైతు టమాటలు అమ్మి ఒకే రోజు ఏకంగా రూ. 38 లక్షల సొమ్ము కళ్ళ చూసినట్లు తెలిసింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, కర్ణాటక కోలార్ ప్రాంతానికి చెందిన రైతు కుటుంభం ఒకే రోజు రూ. 38 లక్షల విలువైన టమాటాలు విక్రయించినట్లు తెలిసింది. బేతమంగళం జిల్లాలోని ప్రభాకర్ గుప్తా, అతని సోదరుడు గత కొంత కాలంగా వారికున్న 40 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం ఒక్కో బాక్స్ రూ. 800కి విక్రయించారని.. ఆ తరువాత అత్యధిక ధర ఇదే అనే చెబుతున్నారు. (ఇదీ చదవండి: జీఎస్టీ సెస్ పెంపు.. ఆ కార్ల ధరలకు రెక్కలు - కొనుగోలుదారులకు చుక్కలు!) మంగళవారం వారు ఒక్కో బాక్స్ రూ. 1900కు మొత్తం 2000 బాక్సులు విక్రయించి రూ. 38 లక్షలు సొంతం చేసుకున్నారు. ఆ రైతులకు నాణ్యమైన టమాట ఎలా పండించాలో తెలుసనీ.. ఆ కారణంగానే పంటను తెగులు నుంచి కాపాడుకున్నామని వెల్లడించారు. మొత్తానికి టమాట వల్ల వారి ముఖాల్లో వెలుగు నిండిపోయింది. -
టమాటా రైతుకు దిగుల్లేదిక..
సాక్షి, అమరావతి: టమాటా రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. దళారుల ప్రమేయం లేకుండా రైతులకు కనీస మద్దతు ధర కంటే అదనపు లబ్ధి చేకూర్చే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఆధ్వర్యంలో 20 టమాటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటిలో నాలుగు యూనిట్లు ఈ నెలాఖరులో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతుండగా, ఇందులో అత్యధికంగా రాయలసీమ జిల్లాల పరిధిలోనే 56,633 హెక్టార్లు ఉన్నాయి. ఏటా 22.16 లక్షల టన్నుల దిగుబడుల్లో 20.36 లక్షల టన్నులు ఆ జిల్లాల నుంచే వస్తోంది. మూడున్నరేళ్లుగా టమాటా రైతుకు మద్దతు ధర లభించేలా కృషి చేస్తున్న ప్రభుత్వం.. ధరలు తగ్గిన ప్రతిసారి మార్కెట్లో జోక్యం చేసుకొని, వ్యాపారులతో పోటీపడి ధర పెరిగేలా చేస్తోంది. దీంతో పాటు అదనపు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ‘ఆపరేషన్ గ్రీన్స్’ ప్రాజెక్టు కింద రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో 20 ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో 4 యూనిట్ల నిర్మాణం పూర్తి కాగా, మిగిలిన యూనిట్లను మార్చి కల్లా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఒక్కో యూనిట్‌ను ఎకరం విస్తీర్ణంలో రూ.3 కోట్ల అంచనాతో ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో గంటకు 1.5 టన్నుల చొప్పున నెలకు 300 టన్నులు, ఏడాదికి 3,600 టన్నుల చొప్పున ప్రాసెస్ చేయనున్నారు. సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్.. ఒక్కో యూనిట్ పరిధిలో కనీసం 250 టన్నులు నిల్వ చేసేందుకు వీలుగా శీతల గిడ్డంగులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. తద్వారా పండ్లు, కూరగాయలను సార్టింగ్, గ్రేడింగ్, వాషింగ్ చేసి.. అధిక ధరలకు విక్రయించే అవకాశం కలుగనుంది. ఈ రంగంలోని బడా కంపెనీలతో రైతు ఉత్పత్తి దారుల సంఘాలను (ఎఫ్‌పీవో – ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్) అనుసంధానిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే లీఫ్ అనే కంపెనీతో ఒప్పందం జరిగింది. సాధారణంగా రైతులు తాము పండించిన టమాటాలను మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మగా వచ్చే ఆదాయంలో రవాణా, కమీషన్ చార్జీల రూపంలో 10–20 శాతం కోల్పోతుంటారు. ఈ యూనిట్ల ఏర్పాటు వల్ల రైతులు ఈ నష్టాన్ని పూడ్చుకోగలుగుతారు. వీటన్నింటి వల్ల మార్కెట్ ధర కంటే 30 శాతం అదనంగా వస్తుంది. దళారుల చేతిలో నష్టపోకుండా అధిక లాభాలను ఆర్జించగలుగుతారు. వీటి నిర్వహణా బాధ్యతలను రైతు ఉత్పత్తి దారుల సంఘాలకు అప్పగిస్తున్నారు. వచ్చే లాభాలను ఆయా సంఘాల పరిధిలోని రైతులే పంచుకోనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూ చైన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులను ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ.. మార్కెటింగ్ బాధ్యతలను లారెన్సు డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ నిర్వహించనున్నాయి. ట్రయల్ రన్ విజయవంతం ఒక్కో యూనిట్‌ను ఒక్కో ఎఫ్‌పీవోకు అప్పగించనుండగా, మొత్తంగా 20 వేల మంది టమాటా రైతులు లబ్ధి పొందనున్నారు. తొలి దశలో చిత్తూరు జిల్లా అటుకురాళ్లపల్లి, చప్పిడిపల్లె, కమిరెడ్డివారిపల్లితో పాటు అన్నమయ్య జిల్లా తుమ్మనంగుంటలలో 4 యూనిట్లు ఈ నెలాఖరు నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా 3,300 మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఇటీవలే ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. రెండో దశలో అన్నమయ్య జిల్లా చెంబకూర్, పోతపొల్లు, చిన్నమండెం, తలవం, ములకల చెరువు, కంభంవారిపల్లె, బి.కొత్తకోట, కలికిరి, చింతపర్తి, వాల్మీకిపురం, నిమ్మనపల్లె, చిత్తూరు జిల్లా వీ.కోట, పలమనేరు, పుంగనూరు, రాజ్‌పేట, చెల్దిగనిపల్లి యూనిట్లు మార్చిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దళారుల నుంచి ఉపశమనం ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా దళారుల చేతిలో నష్టపోకుండా టమాటా రైతులు అధిక లాభాలు ఆర్జించే వీలు కలుగుతుంది. రవాణా, కమిషన్ నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా, తమకు గిట్టుబాటైన ధరకు నచ్చిన వారికి అమ్ముకోగలుగుతారు. పైగా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వీటి నిర్వహణా బాధ్యతను కూడా రైతు సంఘాలకే ఇస్తున్నాం. వచ్చే లాభాలు సంఘాలే పొందనున్నాయి. – ఎల్.శ్రీధర్‌రెడ్డి, సీఈఒ, ఏపీ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ -
టమాటా రైతుకు రానున్నది మంచికాలం
సాక్షి, అమరావతి: దళారుల ప్రమేయం లేకుండా టమాటా రైతులకు కనీస మద్దతు ధర కల్పించి తద్వారా వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో ఇంటిగ్రేటెడ్ టమాటా వాల్యూచైన్ డెవలప్మెంట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సమక్షంలో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా మంత్రి కాకాణి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ, ఉద్యాన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వారా రైతులకు అదనపు ప్రయోజనం కల్పించడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. సొసైటీ ద్వారా రూ.110 కోట్ల అంచనాతో 20 ప్రాథమిక ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటు చేస్తోందని తెలిపారు. మంత్రి కాకాణి సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ, ఏపీ మహిళాభివృద్ధి సొసైటీ, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా ప్రతినిధులు వచ్చేనెలలో 4 ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభం నాలుగు ప్రాసెసింగ్ కేంద్రాలను వచ్చే నెలలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కాకాణి చెప్పారు. వీటి నిర్వహణ బాధ్యతలను రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (ఎఫ్‌పీవోలకు) అప్పగిస్తామని తెలిపారు. క్లీనింగ్, వాషింగ్, గ్రేడింగ్ తదితర పనులకు ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ, మార్కెటింగ్ చైన్ అభివృద్ధికి లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సహకరిస్తాయని తెలిపారు. సాధారణంగా డిమాండు, సప్లయ్‌కి అనుగుణంగా ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల కొన్నిసార్లు టమాటా రైతులు, మరికొన్నిసార్లు బహిరంగ మార్కెట్లో రేట్లు పెరగడం వలన వినియోగదారులు నష్టపోతున్నారని చెప్పారు. ధర పతనమైనప్పుడు మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వం... మార్కెట్లో ధరలు పెరిగినప్పుడు రైతుల నుంచి కొనుగోలుచేసి రైతుబజార్ల ద్వారా సరసమైన ధరలకు విక్రయిస్తూ వినియోగదారులకు అండగా నిలుస్తుందన్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో డిమాండుకు మించి దిగుబడుల ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర రాలేదన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 20 ఎఫ్‌పీవోల పరిధిలోని 20 వేలమంది టమాటా రైతులకు మేలు కలుగుతుందన్నారు. రాష్ట్ర మార్కెటింగ్, సహకార శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సీఈవో ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఏపీ మహిళా అభివృద్ధి సొసైటీ సీఈవో సీఎస్ రెడ్డి, లారెన్స్ డేల్ ఆగ్రో ప్రాసెసింగ్ ఇండియా (పై) లిమిటెడ్ సీఈవో పి.విజయరాఘవన్ తదితరులు పాల్గొన్నారు. -
టమాటా రైతుకు ఏపీ సర్కార్ బాసట
సాక్షి, అమరావతి: ధర లేక సతమతమవుతున్న టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. నాణ్యమైన టమాటానే కాదు.. కాస్త వినియోగానికి పనికొచ్చేలా ఉన్న టమాటాను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతుకు అండగా నిలవాలని సంకల్పించింది. మరోవైపు టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకుల సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద మిగిలి ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేయించేలా చర్యలు చేపట్టింది. చదవండి: సీఎం వైఎస్ జగన్ చొరవ.. నెరవేరిన 25 ఏళ్ల కల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మార్కెటింగ్‌శాఖ కమిషనర్ పి.ఎస్.ప్రద్యుమ్న, రైతుబజార్ల సీఈవో బి.శ్రీనివాసరావుతో పాటు అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. టమాటా రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు, సలçహాలు ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని చెప్పారు. రైతులెవరైనా తమవద్ద టమాటా నిల్వలున్నాయి, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆర్బీకేకు సమాచారం ఇస్తే వెంటనే స్పందించి వారిని ఆదుకునేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. క్వాలిటీ ఎలా ఉన్నా సరే వినియోగానికి పనికి వస్తాయని భావిస్తే కొనుగోలు చేయాలని ఆదేశించారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం జిల్లాల పరిధిలోని వివిధ మార్కెట్లకు 51,661 క్వింటాళ్ల టమాటా రాగా, ధర పతనం కాకుండా మార్కెటింగ్‌శాఖ దగ్గరుండి పర్యవేక్షించింది. ఫలితంగా నాణ్యమైన టమాటాకు సైజును బట్టి కిలో రూ.12 నుంచి రూ.20 వరకు ధర లభించింది. మినిమమ్ క్వాలిటీ రకానికి కిలో రూ.6 నుంచి రూ.15 వరకు, మధ్యస్థ రకానికి కిలో రూ.10 నుంచి రూ.18 వరకు ధర లభించింది. మరోవైపు ఆయా జిల్లాల పరిధిలో తమ వద్ద నిల్వలున్నాయి, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ రైతులు అందించిన సమాచారం మేరకు ఆర్బీకేల ద్వారా సుమారు 300 క్వింటాళ్ల టమాటాను కిలో రూ.11 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ టమాటాను గుంటూరు, విజయవాడ రైతుబజార్లకు తరలించింది. మరోవైపు అనంతపురం, అన్నమయ్య జిల్లాల్లో రైతుల వద్ద ఉన్న టమాటా నిల్వలను కొనుగోలు చేసేలా చిత్తూరు జిల్లాలో ఉన్న టమాటా ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వాహకులతో సమావేశమై వారిని ఒప్పించింది. ఇలా సుమారు 500 క్వింటాళ్ల వరకు కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆందోళన వద్దు టమాటా రైతులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. క్వాలిటీతో సంబంధం లేకుండా వినియోగానికి పనికి వచ్చే టమాటాను కొనుగోలు చేస్తాం. అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం మార్కెట్లో ధరలు నిలకడగానే ఉన్నాయి. ఒకవేళ మీ వద్ద ఉన్న టమాటా నిల్వలను మార్కెట్లో అమ్ముకోలేని పక్షంలో ఆర్బీకేలకు సమాచారమివ్వండి. ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి -
Tomato Prices: ట‘మాట’ వినదే!
సాక్షి, వికారాబాద్ అర్బన్: గత రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రకాల కూరగాయల ధరలు కాస్త తగ్గినా టమాటా ఏమాత్రం దిగిరావడం లేదు. ఆదివారం వికారాబాద్ మార్కెట్లో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయించారు. నాసిరకం టమాటా రూ.80 వరకు పలికింది. జూన్ మొదటి వారంలోనైనా ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరలేదు. శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలోకి ఆశించిన స్థాయిలో సరుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కర్నూల్, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు పడితే ఆగస్టులో ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా టమాటా కొనుగోలు చేసేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు సాహసం చేయలేదు. చదవండి: మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ.. -
టమాటా ‘ధర’హాసం
లావేరు: టమాటా ధర అమాంతం పెరిగిపోయింది. పది రోజుల కిందట కిలో రూ.20 ఉండగా ఆదివారం నాటికి రూ.60కు చేరింది. పది రోజుల వ్యవధిలోనే ఇంతలా ధర పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాము టమాటా పంట పండించిన సమయంలో కిలో రూ.8 నుంచి రూ.10వరకు ఉందని, ఇప్పుడు రూ.60కి చేరిన సమయంలో తమ వద్ద పంట లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు సిండికేట్ అవుతుండటం వల్లనే టమాటా పంటకు ధర ఉండటం లేదని, రైతులు వద్ద లేని సమయంలో మంచి ధర ఉంటోందని అంటున్నారు. (చదవండి: పూజించారు.. పట్టుకుపోయారు) -
‘టమాటా’ రైతుకు అండగా సర్కార్
సాక్షి, అమరావతి: మంచి ధర లభించక కుదేలవుతున్న టమాటా రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గిట్టుబాటు ధరలు దక్కక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఉద్దేశంతో టమాటా ధరలు పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ రంగంలోకి దిగి ధర తక్కువగా ఉన్నచోట మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద టమాటా కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటోంది. ఇందులో భాగంగా శనివారం చిత్తూరు జిల్లా మదనపల్లి మార్కెట్ యార్డులో నాణ్యతను బట్టి కిలో రూ.4 నుంచి రూ.6 చొప్పున ఐదు మెట్రిక్ టన్నుల టమాటాను కొనుగోలు చేసింది. ఇలా కొన్న టమాలను రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రాయలసీమ నుంచే అధిక దిగుబడి రాష్ట్రవ్యాప్తంగా 61,571 హెక్టార్లలో టమాటా సాగవుతోంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 34,030, అనంతపురం జిల్లాలో 19,340, కర్నూలు జిల్లాలో 3,203, విశాఖపట్నం జిల్లాలో 1,260 హెక్టార్లలో, మిగిలిన జిల్లాల్లో వెయ్యిలోపు హెక్టార్లలో పండిస్తున్నారు. ఏటా 22,16,540 టన్నుల దిగుబడి వస్తుండగా.. ఇందులో రాయలసీమలోని మూడు జిల్లాల నుంచే 20,36,628 టన్నుల దిగుబడి వస్తోంది. రోజూ చిత్తూరులో 300–400 టన్నులు, అనంతపురంలో 80–100 టన్నులు, కర్నూలులో 80 టన్నులు, కడపలో 8–10 టన్నులు, విశాఖలో 30–50 టన్నుల టమాటా మార్కెట్‌కు వస్తోంది. చిత్తూరు మినహా మిగిలిన జిల్లాల్లో క్వింటాల్‌కు రూ.600 నుంచి రూ.1,000 ధర పలుకుతోంది. వ్యాపారులతో కలిసి కొనుగోలు రాయలసీమ టమాటాకు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది. ఏప్రిల్ నుంచి సగానికి పైగా టమాటా ఈ రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఆ మేరకు రేట్లు కూడా పెరుగుతాయి. కానీ కరోనా నేపథ్యంలో ఎగుమతుల్లేక స్థానిక మార్కెట్లో రేటు ఏమాత్రం పెరగలేదు. ఎక్కువగా దిగుబడి వచ్చే చిత్తూరులోని కొన్ని మార్కెట్ యార్డుల్లో క్వింటాల్‌కు రూ.400కు మించి పలకడం లేదు. ఈ ధర మరింత పతనమయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో సర్కార్ రంగంలోకి దిగింది. ధర పతనమైన మార్కెట్ యార్డుల్లో వ్యాపారులతో కలిసి మార్కెటింగ్ శాఖ ఈ–నామ్ (వేలం పాట)లో పాల్గొని టమాటా కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. మంచి ధర లభించేలా సర్కార్ చర్యలు ధర తక్కువగా ఉన్న ఇతర మార్కెట్ యార్డుల్లో కూడా ఇదే తరహాలో సర్కార్ జోక్యం చేసుకోనుంది. వ్యాపారులతో కలిసి వేలం పాటల్లో పాల్గొని పోటీని పెంచడం ద్వారా రైతుకు మంచి ధర వచ్చేలా ఏర్పాట్లు చేస్తోంది. మిగిలిన మార్కెట్ యార్డుల్లో కూడా రోజూ టమాటా ధరలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకాధికారులను నియమిస్తోంది. కనీసం కిలోకి రూ.5 తక్కువ కాకుండా రైతుకు ధర లభించేలా చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న ఆదేశాలు జారీ చేశారు. ఇలా కొనుగోలు చేసిన టమాటాను స్థానిక రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. -
రైతులకు బాసటగా తెలుగు ఎన్ఆర్ఐలు
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. చేతికొచ్చిన పంట కొనేవారు లేక పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు సతమవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చేతికొచ్చిన టమాట పంటను కొనేవారు లేరంటూ ఆవేదనగా పోస్ట్ చేశారు. అది చూసి చలించిన తెలుగు ఎన్ఆర్ఐ సోదరులు డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, పుల్లారెడ్డి యెదురు ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది రైతులను ఈ కష్టకాలంలో ఆదుకోవాలని తమ మిత్రులతో టమాట ఛాలెంజ్ పేరుతో ఆ రైతు వద్ద నుంచి పంటను కొనుగోలు చేశారు. అదే విధంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు మంగళవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బురుజుపల్లెలో 400 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు. -
రోడ్డు పైనే పారేసి వెళ్తున్నారు..
సాక్షి, పాపన్నపేట(మెదక్): కనికరం లేని కరోనా ఏవర్గాన్ని వదిలి పెట్టడడం లేదు. లాక్డౌన్ అన్ని వర్గాలకు బేడీలు వేసింది. నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటుతుంటే ..కూర గాయల ధరలు పాతాళానికి పడి పోతున్నాయి. అంగళ్లపై నిషేధం ఉండటంతో ..కూరగాయల రైతులు ఎక్కడో ఒక చోట వీధి మూలన బిక్కు బిక్కుమంటూ అరగంట పాటు అమ్ముకొని ఎవరి కంట పడకుండా ఇంటి బాట పడుతున్నారు. ఈ పద్ధతి వారి అవసరానికే అమ్ముకుంటున్నట్లు ఉండటంతో ..ధరలు అమాంతం పడిపోయాయి. ముఖ్యంగా టమాటా రైతు చితికి పోతున్నాడు. రూ.10కి మూడు కిలోల చొప్పున అమ్ముకుంటున్నాడు. ఒక్కో సారి అవి కూడా అమ్మక పోవడంతో జిల్లాలో యాసంగి పంటగా సుమారు 750 ఎకరాల టమాటా పంట వేశారు. 7500 టన్నుల పంట దిగుబడి వస్తోంది. ఇతర కూరగాయలు 3500 ఎకరాల్లో వేసినట్లు హారి్టకల్చర్ అధికారులు తెలిపారు. సాధారణంగా వేసవి కాలంలో నీటి లభ్యత మోస్తారుగా ఉన్న చోట కూరగాయల పంటలకు ప్రాధాన్యత ఇస్తారు. యేటా మే నెల నాటికి ఎండల ప్రభావం పెరగడంతో, సాధారణంగా కూరగాయల ధరలు కూడా పెరుగుతుతాయి. కానీ ఈ సారి కరోనా..లాక్డౌన్ ప్రభావాలతో ధరలు పతనమయ్యాయి. రైతు కంట కన్నీళ్లు.. కరోనా కల్లోలం కూరగాయల రైతుల బతుకులను ఆగం చేసింది. విత్తు విత్తి..కలుపు తీసి..పురుగు మందులు చల్లి పండించిన కూరగాయలు రైతు కలలను కల్లలు చేశాయి. అంగళ్లు మూతబడ్డాయి. హాస్టళ్ళు, హోటళ్లు, మెస్‌లు బంద్ అయ్యాయి. దీంతో కూరగాయల వ్యాపారులు ఇళ్లిల్లు తిరుగుతూ అమ్ముతున్నారు. ఇంటికి వచి్చన వ్యాపారి ఎంతో కొంతకు ఇవ్వక మానడు అన్న తలంపుతో తక్కువ ధరలకే వినియోగదారులు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అంగళ్లకు వచ్చే వ్యాపారులు చాటు మాటుకు దుకాణాలు పెట్టుకొని ఏదో కొంత ధరకు అమ్ముకొని పరుగులు తీస్తున్నారు. టమాటా రైతు పరిస్థితి మరీ దీనంగా ఉంది. రూ.10కి మూడు కిలోల టమాటా అమ్ముకుంటున్నారు. ఒక్కో సారి ధరలేక రూ.2 కు కిలో ఇస్తున్నట్లు చెపుతున్నారు. కొన్ని పరిస్థితుల్లో అసలు కొనే వారే లేకపోవడంతో దారి పక్కనే పారేసి కన్నీళ్లతో వెళ్తున్నారు. ధర గిట్టుబాటు కాకపోవడంతో టమాటా తెంపకుండా పొలంలోనే వదిలి వేస్తున్నారు. బీరకాయలు కిలో రూ.20, బెండకాయలు రూ.30, వంకాయలు రూ.30, గోపి గడ్డ రూ. 10, కాలి ఫ్లవర్ రూ.20 కి లో చొప్పున అమ్ముతున్నారు. -
టమాటా రైతు పంట పండింది!
కర్నూలు జిల్లాలోని ఆదోని, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలో టమాటా విస్తారంగా సాగవుతోంది. ప్రస్తుతం జిల్లా మొత్తం మీద ఆరు వేల హెక్టార్ల వరకు సాగులో ఉంది. టమాటా మార్కెటింగ్‌కు పత్తికొండ కేంద్ర బిందువు. ఇక్కడి నుంచే దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. సాక్షి, అమరావతి, కర్నూలు (అగ్రికల్చర్), పత్తికొండ : టమాటా రైతును ఆర్థికంగా దెబ్బ తీసేందుకు వ్యాపారులు, దళారీలు వేసిన ఎత్తులను వైఎస్ జగన్ సర్కారు రెండో రోజు కూడా చిత్తు చేసింది. ధరల స్ధిరీకరణ నిధితో శనివారం కర్నూలు జిల్లాలో 100 మెట్రిక్ టన్నుల టమాటాను మార్కెటింగ్ శాఖ కొనుగోలు చేసిన విషయం విదితమే. దీంతో వ్యాపారులు కిలో టమాటా ధరను రూ.14 నుంచి రూ.19కి పెంచి కొనుగోలు చేశారు.టమాటాకు గిట్టుబాటు ధర వచ్చే వరకు మార్కెటింగ్ శాఖ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేయడంతో ఆదివారం కూడా ఆ శాఖ అధికారులు కర్నూలు జిల్లా పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డుపై దృష్టి కేంద్రీకరించారు. దీంతో దిగివచ్చిన వ్యాపారులు రైతుల నుంచి కిలో రూ.20 నుంచి రూ.22 చొప్పున కొనుగోలు చేశారు. మార్కెటింగ్ శాఖ కూడా 8 టన్నుల టమాటా కొనుగోలు చేసింది. ఆ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ, కమిషనర్ ప్రద్యుమ్నలు ఆదివారం కర్నూలు జిల్లాలో టమాటా అమ్మకాల గురించి గంటకోసారి ఆరా తీశారు. మార్కెట్ యార్డు బయట కొనుగోళ్లు జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ధరల స్థిరీకరణ నిధితో రైతులకు భరోసా సీఎం ఆదేశాలతో శని, ఆదివారాల్లో ధరల స్ధిరీకరణ నిధితో కర్నూలు జిల్లాలో మార్కెటింగ్ శాఖ టమాటా కొనుగోలు చేపట్టింది. రైతుకు న్యాయం జరిగే వరకు అక్కడ మార్కెటింగ్ శాఖ క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది. – మంత్రి మోపిదేవి వెంకటరమణ -
సీఎం జగన్ ఆదేశాలు... టమాటా కొనుగోళ్లు ప్రారంభం
సాక్షి, అమరావతి : తక్షణమే మార్కెటింగ్ శాఖ నుంచి టమాటా కొనుగోళ్లు మొదలుపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో పత్తికొండ మార్కెట్ యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. టమాటా రైతుల సమస్యపై శనివారం ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా టమాటా కొనుగోలులో తలెత్తిన సమస్యలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ క్రమంలో పండ్లు, కూరగాయలను డీ రెగ్యులేట్ చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. తద్వారా మార్కెట్ ఫీజు లేకుండా.. ఏజెంట్లకు కమిషన్ ఇవ్వకుండా రైతులు అమ్ముకోవచ్చని వివరించారు. ఈ నేపథ్యంలో ఏజెంట్లు టమోటా కొనుగోలు నిలిపేశారని పేర్కొన్నారు. పత్తికొండ మార్కెట్లో కాకుండా మార్కెట్ బయటకు వచ్చి అమ్మితేనే కొంటామని ఏజెంట్లు రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని సీఎం జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అయితే మార్కెట్లో మాత్రమే తాము అమ్ముతామని రైతులు ఏజెంట్లకు స్పష్టం చేశారని వెల్లడించారు. ఈ క్రమంలో ఏది ఏమైనా రైతులు ఇబ్బందులు పడకూడదని సీఎం జగన్ అధికారులతో పేర్కొన్నారు. మార్కెట్లో పరిస్థితులను సరిదిద్దడానికి తగిన చర్యలు తీసుకుని వెంటనే మార్కెటింగ్ శాఖ నుంచి కొనుగోళ్లు మొదలుపెట్టాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో పత్తికొండ మార్కెట్‌యార్డులో టమాటా కొనుగోళ్లు తిరిగి ప్రారంభమయ్యాయి. ధరలు తగ్గకుండా వేలంపాటలో పాల్గొంటూ మార్కెటింగ్ శాఖ అధికారులు సైతం పాల్గొంటున్నారు. ఇక ఉదయం నుంచి 50 టన్నుల టమాటా అమ్ముడుపోయింది. ఇందులో ధరల స్థిరీకరణ నిధి కింద 5 టన్నుల వరకూ మార్కెటింగ్ శాఖ అధికారులు కొనుగోలు చేశారు. దీంతో ప్రస్తుతం వ్యాపారస్తులు సైతం ముందుకు వచ్చి టమాటాను కొనుగోలు చేస్తున్నారని మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న వెల్లడించారు. అదే విధంగా రైతులను ఇబ్బందులకు గురిచేసిన ఏజెంట్లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. -
పెరిగిన టమాటా ధరలు
కూలీలు కూడా గిట్టుబాటు కాకుండా నష్టపరిచిన టమాట ప్రస్తుతం రైతులను ఆదుకుంటోంది. కిలో రూ.37లు పలుకుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితి కొద్ది రోజలు ఇలాగే ఉంటే చేసిన అప్పులు కొంతమేర తీరుతాయని చెబుతున్నారు. పెరిగిన ఎండలు, ఇతర ప్రాంతాల నుంచి కాయలు రాకుండా చర్యలు తీసుకోవడంతోనే ధరలు పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు, మదనపల్లె టౌన్ /రామసముద్రం : జిల్లాలోని పడమటి మండలాల్లో ప్రధానంగా టమాట పంట సాగు చేస్తారు. ఎకరా సాగుకు రూ.లక్ష వరకు ఖర్చు చేస్తున్నారు. నీరు తక్కువగా ఉన్న రైతులు మల్చింగ్, డ్రిప్, స్ప్రింక్లర్లను వినియోగిస్తూ ఖర్చుకు వెనకాడకుండా పంటను పెడుతున్నారు. మదనపల్లె డివిజన్లో ప్రస్తుత రబీ సీజన్లో 43 వేల హెక్టార్ల సాధారణ సాగుకు గానూ 36 వేల హెక్టార్లో టమాట సాగు చేసినట్టు ఉద్యానవన శాఖ అధికారులు సుబ్రమణ్యం, ఉమాదేవి తెలిపారు. మదనపల్లె నియోజకవర్గంలోని నిమ్మనపల్లె మండలంలో 1200 హెక్టార్లకు గాను 480 హెక్టార్లు, రామసముద్రం మండలంలో 2,200 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,600 హెక్టార్లలో, మదనపల్లె మండలంలో 1,400 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 800 హెక్టార్లలో టమాట పంట సాగు చేశారు. వేసవిలో పంట దిగుబడి తగ్గడం, మార్కెట్ అధికారులు నెల రోజులుగా బయటి రాష్ట్రాల కాయలను మార్కెట్లోకి అనుమతించకపోవడంతో రేట్లు పెరిగాయి. మార్కెట్‌కు ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాట పది కిలోలు రూ.340, రెండో రకం రూ.200 పలికింది. వారం రోజులుగా సగటున కిలో రూ.34–36 మధ్య ధర ఉంది. శుక్రవారం మార్కెట్‌కు 262 టన్నుల టమాట కాయలు వచ్చాయి. నార్లకు పెరిగిన డిమాండ్ నెల క్రితం టమాట నార్లను అడిగేవారు లేకపోవడంతో నర్సరీల్లో పడేశారు. 20 రోజులుగా టమాట ధరలు పెరగడంతో రైతులు సాగుపై దృష్టి సారించారు. దీంతో నార్లకు డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం ఒక్కొక్క మొలకకు 60 పైసల నుంచి 80 పైసల వరకు చెల్లించి తీసుకెళుతున్నారు. అయినా నార్లు లభించడంలేదని రైతులు చెబుతున్నారు. కర్ణాటకకు వెళ్లి నారు తెచ్చుకుంటున్నట్టు పేర్కొంటున్నారు. -
'దగా'రులు
వారం రోజులుగా ఒడిదుడుకులకు గురవుతున్న టమాట రేట్లు ఆదివారం నాటికి మరింత పతనమయ్యాయి. మదనపల్లె మార్కెట్‌కు తక్కువ మోతాదులో టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారుల సిండికేట్‌తో కర్షకుల కష్టం దోపిడీకి గురవుతోంది. నిబంధనలకు నీళ్లు వదులుతూ ఈ–వేలానికి బదులు బహిరంగ వేలంనిర్వహిస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఉన్నతాధికారులు సైతం పట్టనట్లు వ్యవహరిస్తుం డడంతో తమకు ఆత్మహత్యలేశరణ్యమని అన్నదాతలు వాపోతున్నారు. చిత్తూరు, మదనపల్లెటౌన్: మదనపల్లె మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతూ రేట్లు పతనమవుతున్నాయి. తక్కువగా టమాటాలు వస్తున్నా వ్యాపారులు, అధికారులు కుమ్మక్కవడంతో ధరలు పడిపోతున్నాయి. రోజు రోజుకు టమాటా ధరలు పతనం దిశగా పరుగులు తీస్తుండడంతో రవాణా చార్జీలు కూడా గిట్టడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో అధికారులు, వ్యాపారుల గూడుపుఠానీ కారణంగా ఈ–వేలం పాటలకు మంగళం పాడి చట్టవిరుద్ధంగా బహిరంగ వేలం నిర్వహిస్తూ రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా... డివిజన్‌తో పాటు పశ్చిమ మండలాలైన అనంతపురం జిల్లాల నుంచి రోజూ మార్కెట్‌కు 200 టన్నుల వరకు టమాటా వస్తోంది. ఇవే కాకుండా ఛత్తీస్‌గఢ్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో టమాటా ఉత్పత్తి అధికంగా ఉండడంతో అక్కడి కాయలను ఇక్కడి మండీ వ్యాపారులు, మార్కెట్ అధికారులతో కుమ్మక్కై బయట రాష్ట్రాల టమాటా లారీలను రాత్రికి రాత్రే మదనపల్లె మార్కెట్‌కు తీసుకువచ్చి గుట్టు చప్పుడు కాకుండా అన్లోడ్ చేస్తున్నారు. వ్యాపారులు కొన్నాక తిరిగి లోడ్‌చేసి తెల్లవారకనే పొరుగు రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. దీంతో వ్యాపారులు పెద్దగా మదనపల్లె పరిసర ప్రాంతాల రైతులు తీసుకు వచ్చే టమాటాలను కొనడం లేదు. స్థానిక వ్యాపారులు కొందరు మాత్రమే ఉదయం ఓపెన్ ఆక్షన్‌లో కొంటున్నారు. నిబంధనలకు పాతర నిబంధనల ప్రకారం వ్యాపారులు, మార్కెట్ అధికారులు, టమాటాలను తీసుకు వచ్చిన రైతులు ముందుగా ఓ గదిలో సమావేశం అయ్యాక ఈ–వేలం నిర్వహించాలి. ఆ తతంగం లేట్ అవుతుందని వ్యాపారులతో మార్కెట్ అధికారులు కుమ్మక్కై ఓపెన్ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. స్థానికంగా కాయలు కొంటున్న ఒకరిద్దరు వ్యాపారులు ఒక రోజు కాయలు కొనడానికి వస్తే మరో రోజు మార్కెట్‌కు రావడం లేదు. దీంతో మార్కెట్లో ఒక్కో రోజు ఒక్కో రకంగా టమాటా ధరలు పలుకుతున్నాయి. ఇప్పుడే టమాటా ధరలు పతనమైతే ఎండలు ముదిరి దిగుబడి తగ్గితే మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించాలి వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్, కలెక్టర్, మార్కెటింగ్ రీజనల్ మేనేజర్లు స్పందించి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి మదనపల్లె టమాటా మార్కెట్‌కు బయట టమాటాలు రాకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెట్ అధికారులు మాత్రం రైతుల కష్టాలు పట్టించుకోకుండా మార్కెట్‌కు ఎన్ని టన్నుల టమాటా వస్తే అంత ఆదాయం వస్తుందని ఆశించి పొరుగు రాష్ట్ర, జిల్లాల టమాటాను కూడా అనుమతిస్తున్నారు. దీంతో మదనపల్లె పరిసర ప్రాంతాల రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. -
గిద్దలూరులో టమాట రైతు ఆందోళన
-
ధరదడలాడించారు!
సోంపేట : సోంపేట మండలం బెంకిలి, జింకిభద్ర రైతులు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఇన్నాళ్లూ ఇతరులు ధర నిర్ణయిస్తే పంట కోసి అప్పగించేవారు. కానీ గిట్టుబాటు ధర కోసం భీష్మించుకుని కూర్చుని దళారులనే తమ వద్దకు రప్పించుకున్నారు వీరు. ధర కోసం పంటను సైతం త్యాగం చేయడానికి సిద్ధపడి సాటి రైతుల్లో స్ఫూర్తి నింపారు. గిట్టుబాటు ధర అందజేస్తే గానీ పంట కోసేది లేదని, గ్రామానికి టమాటా కో సం ఎవరు వచ్చినా విక్రయించే ప్రసక్తే లేదని ఆదివారం భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో దళారులే ధర పెంచి రైతులను బుజ్జగించారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు. సోంపేట మండలంలోని బెంకిలి, జింకిభద్ర గ్రామాల రైతులు ఖరీఫ్, రబీ సీజన్లలో కాయగూరలు సాగు చేసి జీవనాధారం పొందుతుంటారు. అయి తే ఈ సంవత్సరం రబీ సీజన్లో వేసిన టమాటా పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో పంట పొల్లాలో పాడైనా ఫర్వాలేదు గానీ గిట్టుబాటు ధర రాకపోతే విక్రయించేది లేదని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. చివరి వరకూ అలాగే ఉండి తమ పంతం నెగ్గించుకున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణం బెంకిలి, జింకిభద్ర గ్రామాల్లో గత నాలుగేళ్ల రబీ సీజన్లో సుమారు 4 వందల ఎకరాల్లో టమాటా పంటను సాగుచేసేవారు. అయితే ఈ ఏడాది పరిసర గ్రామాలైన పలాసపురం, లక్కవరం, బారువ, కంచిలి మండలంలోని కుత్తమ, మండపల్లి గ్రామాల్లో కూడా టమాటా సాగు చేశారు. సోంపేట, కంచిలి మండలాల పరిధిలో సుమారు 8 వందల ఎకరాల్లో టమాటా పంట రబీ సీజన్లో సాగు చేశారు. గిట్టుబాటు కాని ధర కౌలుతో కలుపుకుని ఎకరాకు సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. పంట దిగుబడులు వచ్చే సరికి మార్కెట్లో ధర లేకుండా పోయింది. దళారులంతా కుమ్మక్కై టమాటా కిలో రూ.2 రూ.3కు కొనుగోలు చేస్తున్నారు. దీంతో కూలీ ఖర్చు కూడా రాని పరిస్థితి ఎదురైంది. 30 కిలోల ట్రే రూ.70కు విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో థర్మల్ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని రైతులంతా ఏకమయ్యారు. గిట్టుబాటు ధర వస్తే గానీ పంట కోయబోమని దళారులకు తేల్చి చెప్పారు. దీంతో 30 కిలోల ట్రేను రూ.70కు కొంటామని వచ్చిన వారు రూ.130 ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారిగా ధర రెట్టింపు చేయడం చూసి రైతులు కూడా ఆశ్చర్యపోయారు. అయినా ఇంకా ధర పెంచితే గానీ పంట కోసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిన్నటి వర కు మార్కెట్లో లేని ధర ఇప్పుడు ఎలా వచ్చిందని దళారులను ప్రశ్నించారు. బయట మార్కెట్లో ధర పెరిగినా రైతులకు ఆ ధర ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గ్రామానికి చెందిన రైతులు ఎం.బుద్దేశ్వరరావు, ఎం.లోకనాథం, కె.భీమయ్య, పి.సురేష్, టి. బాబూరావు, కె.రామారావు, పి.దుర్యోధన తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు రైతుకు మద్దతు ఇస్తే ఇలాంటి సమస్యలు రావని వారు పేర్కొన్నారు. దళారులు ధర పెంచక పోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, దళారులు దిగి రావడంతో పంట పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. కోల్డ్ స్టోరేజీలు నిర్మించాలి ప్రభుత్వాలు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తే పంట దాచుకునే వీలుంటుంది. కోల్డ్ స్టోరేజీలు లేకపోవడంతో పంట నిల్వ ఉండే అవకాశం లేకపోయింది. దీంతో దళారులు చెప్పిన ధరకే పంట ఇవ్వాల్సి వచ్చేది. – మడ్డు బుద్దేశ్వరరావు బెంకిలి, రైతు గిట్టుబాటు ధర రావడం లేదు టమాటాను కష్టపడి సాగు చేస్తుంటే గిట్టుబాటు ధర రావడం లేదు. మార్కెట్లో ధర ఉన్నా రైతులకు మాత్రం దళారులు గిట్టుబాటు ధర ఇవ్వ డం లేదు. దీంతో పంట పాడైనా ఫర్వాలేదు గానీ కోయకూడదని తీర్మానించాం. – కె.భీమయ్య, బెంకిలి టమాటా రైతు -
ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం
-
వైఎస్ జగన్ ఎదుట టమాట రైతుల ఆవేదన
-
అన్నదాతల ఆక్రందన
దుర్గ్: ఎంతో కష్టపడి పండిన పంటకు కనీస ధర దక్కకపోవడంతో అన్నదాత కడుపు మండింది. శ్రమకు తగిన ప్రతిఫలం దక్కకపోవడంతో కర్షకులు కన్నెర్ర చేశారు. పెట్టుబడి సంగతి అలా ఉంచితే కనీస ధర కూడా రాకపోవడంతో ఛత్తీస్ గడ్ లోని టమాట పడించిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో టమాట ధర రూపాయికి పడిపోవడంతో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఏడు లారీల టమాటాలను రోడ్డుపై పడేసి తమ ఆవేదన తెలిపారు. ధంధా ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నదాతల ఆవేదనను ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయం. ఇటీవల కాలంలో టమాట ధరలు గణనీయంగా పడిపోయాయి. నిల్వచేసుకునే సౌకర్యం లేక అయినకాడికి అమ్ముకుందామని ఆశగా మార్కెట్లకు వచ్చిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. పెట్టుబడి డబ్బులు కూడా రాకపోవడంతో అన్నదాతలు చితికిపోతున్నారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులు, అధికార యంత్రాంగం చేతులు కట్టుకుని చూస్తుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకుని తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
టమాటా రైతులకు తప్పని తిప్పలు
-
రూపాయికే కిలో టమోటా అంటే ఎలా?
అనంతపురం: దేశమంతటా ఉల్లి ఘాటు ఎక్కువైన సంగతి తెలిసిందే. ఉల్లి కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అలాంటి తరుణంలో టమోట రైతులకు చేదు అనుభవమే మిగిలింది. ఉన్నట్టుండి టమోటా గిట్టుబాటు ధర తగ్గడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఓవైపు వ్యాపారస్తులు మాత్రం కిలో రూపాయికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రూపాయికే కిలో టమోటా ఇస్తే రైతు నట్టేట మునగాల్సిందే.. ఈ పరిస్థితి తాజాగా శనివారం అనంతపురం నగరంలోని కాయగూరల మార్కెట్లో చోటుచేసుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు పండించిన టమోటాను తీసుకుని వచ్చారు. అయితే రేటు బాగా తగ్గిందని వ్యాపారస్తులు రూపాయికే కిలో ఇవ్వాలన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు రూపాయికే కిలో టమోటా ఎలా ఇస్తామంటూ వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఊరుకోవడం గమనార్హం. -
అప్పుల ఊబిలో టమాట రైతు
మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోయినా కనికరించని ప్రభుత్వం నాలుగేళ్లలో జిల్లాలో 1,55,275 ఎకరాల్లో పంటసాగు రుణమాఫీలో చోటు దక్కక దిగాలు జిల్లాలో రూ.1,500 కోట్ల అప్పుల్లో రైతాంగం బి.కొత్తకోట: టమాట రైతులు గడచిన నాలుగేళ్లలో 1,55,275 ఎకరాల్లో పంట సాగుచేశారు. 2010-11లో 15,320 హెక్టార్లు.. 2011-12లో 17,581 హెక్టార్లు.. 2012-13లో 16,224 హెక్టార్లు.. 2013-14లో 12,985 హెక్టార్లలో సాగుచేశారు. ఇందులో అత్యధికంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తర్వాత పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగైంది. మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా సాగుచేశారు. ఖరీఫ్, రబీతోపాటు వ్యవసాయ బోర్ల కింద పంట సాగైంది. ఈ సంవత్సరాల్లో రైతులు అత్యధిక ధరలను పొందిందిలేదు. అప్పుడప్పుడు మంచి ధర పలికినా నిలకడగా లేవు. చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అత్యధిక ధర పలికింది. రుణాలు వందల కోట్లలో.. చెరుకు రైతులకు మాత్రమే బ్యాంకులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50వేల రుణం ఇస్తాయి. ఆ తర్వా త టమాట రైతుకు రూ.25 వేల నుంచి రూ.30వేలు ఇస్తాయి. వేరుశెనగకు తక్కువ రుణం వస్తుంది. దీంతో టమాట సాగుచేసిన రైతులు టమాటపైనే రుణం తీసుకున్నారు. 2009-10లో టమాట సాగుకు ఎకరాకు రూ.20వేలు, 2009-10లో రూ.25వేలు, 2012-13లో రూ.30వేలు, 2013-14లో రూ.30వేల రుణంగా బ్యాంకులు నిర్ణయించి ఆమేరకు పాసుపుస్తకాలు, బంగారం తాకట్టుపై అప్పులిచ్చాయి. ఇలా అప్పులు తీసుకొన్న రైతులు జిల్లాలో వేలసంఖ్యలో ఉన్నారు. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 2008-09నుంచి 2013 డిసెంబరు నాటికీ 37,251 మంది రైతులు రూ.162.9కోట్ల రుణం తీసుకున్నా రు. వీరుకాక జిల్లాలో మొత్తం రూ.1,500కోట్ల మేర కు అప్పులను టమాట రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. బ్యాంకులిచ్చే రూ.30వేల రుణంతో కనీసం సగం మంది రైతులు ఈ నాలుగేళ్లలో రూ.2,500కోట్ల దాకా అప్పులు పొందడం, తిరిగి చెల్లిస్తూ, కొత్త రుణాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అప్పులు చెల్లించలేక నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోతోంది. మాఫీకి సాకులు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోంది. టమాట పంట ఉద్యానవనశాఖ పరిధిలో ఉందన్న సాకుతో రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వేరుశెనగకు ప్రయత్యామ్నాయంగా సాగుచేస్తున్న టమాటకు సరైన ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం కనీసం రుణ మాఫీనైనా వర్తింపజేయకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోట్ల పెట్టుబడిని కళ్లముందునే నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని వర్తింపజేయాలని రైతాంగం కోరుతోంది. రుణం మాఫీ కాదు.. కొత్త అప్పులు పుట్టవు మూడేళ్ల క్రితం సొసైటీ బ్యాంకులో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశా. రూ.90 వేలు ఖర్చు అయింది. బ్యాంకులో తెచ్చిన రుణం చాలక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పంటపై ధారపోశా. 30 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది బంగారు నగలను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఇటీవల రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. బ్యాంకులో చూస్తే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మాఫీ చేయక పూటకో మాట మాట్లాడుతావుండాడు. బ్యాంకోళ్ళు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేదు. పాసు బుక్కులు, బంగారు నగలు బ్యాంకులో ఉంటే ఏం జూసి మాకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పులు ఇస్తారు. -సిద్దారెడ్డి, రైతు, పెద్దతిప్పసముద్రం మండలం ఆవులకు వదిలేశాం రెండెకరాల్లో టమాట సాగు చేశాం. రూ.లక్ష దాకా ఖర్చయ్యింది. ఇప్పటివరకు రూ.20 వేలు మాత్రమే వచ్చింది. తొలి నుంచి రేటు లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. దీంతో సగం పంటలో ఆవులను తోలేశాం. రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేటు లేనప్పుడు మాత్రం చేతులెత్తేసింది. రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ఆదుకునే వారు లేరు. -బి.కృష్ణారెడ్డి, సర్కారుతోపు, కురబలకోట మండలం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామానికి చెందిన రైతు బయ్యారెడ్డి ఏళ్ల తరబడి టమాట పండిస్తున్నాడు. 2011లో బి.కొత్తకోట గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, ఇండియన్ బ్యాంకులో 1.5లక్షల అఫ్పు తీసుకున్నాడు. పంటనష్టం వాటిల్లినా రూ.1.5లక్షల రుణం చెల్లించాడు. మళ్లీ పంటకోసం 2012లో ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రూ.2లక్షలు రుణాన్ని 2013లో కట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.లక్ష అప్పుచేశాడు. రుణాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న బయ్యారెడ్డి రుణ మాఫీపై ఆశపెట్టుకున్నాడు. మాఫీ ఇస్తే చెల్లించిన సొమ్ము తిరిగి దక్కుతుందనుకున్నాడు. అయితే టమాట రైతుకు మాఫీ అయ్యే పరిస్థితులు లేవని తేలిపోవడంతో నిరాశవ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులోని రూ.50వేల రుణం చెల్లించలేదు. అదైనా మాఫీ అవుతుందో లేదోనని ఎదురుచూస్తున్నాడు. -
పిండేస్తున్నారు
=టమాట రైతుకు దళారుల టోకరా =జాక్‌పాట్ పేరుతో దోపిడీ =అధికారుల ప్రేక్షకపాత్ర టమాట రైతుల కష్టాన్ని దళారులు నిలువునా దోచుకుంటున్నారు . రాష్ట్రంలో అతిపెద్దదిగా పేరొందిన మదనపల్లె టమాట మార్కెట్లో దళారులు చెప్పిందే వేదం. అధికారులు సైతం వారికే వంత పాడుతున్నారు. ఆరుగాలం కష్టించిన రైతుకు దక్కే ప్రతిఫలం కంటే దళారులకే ఎక్కువ ఆదాయం వస్తోంది. అధికారుల అండదండలతో ఒక వైపు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తూ మరో వైపు రైతన్నను దోచుకుంటున్న వైనంపై ప్రత్యేక కథనం. మదనపల్లె, న్యూస్‌లైన్: మదనపల్లె టమాట మార్కెట్‌కు చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల నుంచే కాకుండా కర్ణాటక నుంచి సుమారు 300మంది రైతులు వస్తారు. సీజన్లో రోజు కు కోటి రూపాయల వరకూ వ్యాపారం జరుగుతుంది. ఒక్కోరైతు 25 నుంచి 30 క్రేట్ల (క్రేట్=30 కేజీలు) టమాటాలను తీసుకువస్తారు. రైతులు తీసుకువచ్చిన సరుకును నేరుగా విక్రయించే అవకాశం లేదు. కమీషన్ ఏజెంటు ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఏజెంట్లు ముందుగానే వ్యాపారులతో లావాదేవీలు జరిపి ఒప్పందం కుదుర్చుకుంటారు. రైతుకి, వ్యాపారికి మధ్యవర్తిగా వ్యవహరించి ట మాటాల వేలం నిర్వహిస్తారు. ఇలా వేలం నిర్వహించినందుకు రైతు పది క్రేట్లకు గాను ఒక క్రేట్ను ఏజెంటుకు జాక్ పాట్ కింద ఉచితంగా ఇవ్వాలి. ఇలా 30 క్రేట్లు తెచ్చిన రైతు నుంచి జాక్‌పాట్ పేరుతో 3 క్రేట్ల టమాటాలను అప్పనంగా తీసుకుంటారు. అంతే కాకుండా క్రేట్ను రూ.500లకు విక్రయిస్తే అందులో కూడా పదిశాతం తగ్గించి రైతుకు నగదు ఇస్తారు. నిబంధ నల ప్రకారం నాలుగుశాతం మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా ఏజెంట్లు పదిశాతం వసూలు చేస్తున్నారు. ఇలా అన్ని దశల్లోనూ దళారులు రైతన్నను దోచుకుంటున్నారు. అధికారులు అండదండలు ఉండడంతో దోపిడీకి అంతే లేకుండా ఉంది. ప్రభుత్వానికీ టోకరా! మార్కెట్లో రైతులను దోచుకుంటున్న దళారులు అధికారుల సహకారంతో ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. మార్కెట్లో దాదాపు 50 వరకూ మండీలు ఉన్నాయి. ఒక కమీషన్ ఏజెంట్ నెలకు సరాసరి రూ. 50 లక్షలు వ్యాపారం చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం పదిలక్షలుగానే చూపిస్తూ ప్రభుత్వాదాయానికి తూట్లు పొడుస్తున్నారు. ప్రస్తుతం అధికారులు చూపుతున్న లెక్కల ప్రకారం సెస్, కమీషన్ ద్వారా మార్కెట్ యార్డుకు సరాసరి రూ. 1.5 కోట్లు ఆదాయం వస్తోంది. అధికారులు నిక్కచ్చిగా వ్యవహరిస్తే యార్డు ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ఉన్నతాధికారులు స్పందించి రైతులు నిలువుదోపిడీకి గురికాకుండా చూడాల్సి ఉంది. జాక్‌పాట్ లేకుండా చేస్తా.. మార్కెట్‌యార్డులో జాట్‌పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందు కోసం టమాటా రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా. రైతులకు న్యాయం చేసేలా చేసేలా చర్యలు తీసుకుంటా. ఇందుకు రైతులు కూడా సహకరించాలి. అధిక కమీషన్ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. -శ్రీరామ్ చినబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, మదనపల్లె. -
వర్షం దెబ్బ
ఉట్నూర్, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా రైతులు 62,300 ఎకరాల్లో టమాటా సాగు చేశారు. మంచి ధర పలకడం, స్వల్పకాలిక పంటకావడంతో రైతులు మొగ్గు చూపారు. జిల్లాలోని ఇంద్రవెల్లి, జైనథ్, కెరమెరి, గుడిహత్నూర్, ఉట్నూర్, సిర్పూర్(యు), బజార్హత్నూర్, నార్నూర్, జైనూర్, బోథ్, తాంసి, తలమడుగు, ఇచ్చోడ, నేరడిగొండ మండలాల్లో టమాటా సాగవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రవెల్లి మండలం టమాటా సాగులో పేరు గాంచింది. ఇక్కడ ఈసారి దాదాపు 5 వేల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. టమాటాకు మంచి ధర పలకడంతో ఆశించిన లాభాలు వస్తాయని రైతులు భావించారు. కానీ వర్షాలు, వరదలు నట్టేట ముంచాయి. నిండాముంచిన వర్షాలు.. పొగమంచు.. వర్షాలు, వరదలు టమాటా రైతులను నిండా ముంచాయి. పది రోజుల క్రితం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, పై-లీన్ తుపాన్ ప్రభావంలో టమాటా సాగుపై పండింది. అధిక వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండటంతో మొక్కల వేర్లు మురిగిపోయాయి. దీనికి తోడు టమాటా కాయలు బురదలో వేలాడటంతో మురిగిపోయాయి. రైతులు చేలలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బ్యాక్టిరియా సోకి కాయలకు నల్లమచ్చలు ఏర్పడ్డాయి. ఇటువంటి టమాటాలను ఏరివేస్తున్నా ఫలితం ఉండటం లేదని రైతులు పేర్కొంటున్నారు. టమాటా దిగుబడి పెరగాలంటే పొగమంచు అదుపులో ఉండాలి. కానీ, ఆకాల వర్షాలు తగ్గినప్పటి నుంచి వేకువజామున పొగమంచు విపరీతంగా కురుస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పొగమంచు పెరగడంతో కాత, పూత రాలడం.. కాయ ఎదుగుదల లేకుండా పోయి దిగుబడి తగ్గుతోంది. పొగమంచు తగ్గుముఖం పడితే గాని దిగుబడి పెరిగే అవకాశం లేదని రైతులు తెలుపుతున్నారు. టమాటా సీజన్ కావడంతో సాధారణంగా ఈ సీజన్లో కిలో టమాటా ధర రూ. 10 నుంచి రూ.20 మధ్య ఉంటుంది. కానీ, వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గడంతో మార్కెట్లో ప్రస్తుతం కిలో టమాటా ధర రూ.40పైగా పలుకుతోంది. మార్కెట్లో ధర ఉండటం, పంట దిగుబడి లేక రైతులు అల్లాడుతున్నారు. నష్టాల ఊబిలో రైతులు ఎకరం టమాటా పంట సాగు చేయాలంటే రైతుకు రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు పెట్టుబడికి ఖర్చవుతుంది. ఎకరం సాగులో వారానికి 20 క్యారెట్ల టామాటాను మార్కెకు తరలిస్తే రైతులకు లాభాలు వస్తాయి. ఈసారి వర్షాలు, పొగమంచు కారణంగా దిగుబడి తగ్గి ఎకరం చేనులో వారానికి మూడు లేదా నాలుగు క్యారెట్ల టమాటా కూడా మార్కెట్‌కు తరలించడం లేదు. కానీ, గతేడాది దిగుమతి పెరిగి.. ధర లేక నష్టపోయామని రైతులు పేర్కొంటున్నారు. ఈ మూడు, నాలుగు క్యారెట్ల టమాటా కాయలపై కూడా నల్లమచ్చలు ఉండటంతో ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం క్యారెట్ ధర రూ.700 నుంచి రూ.1,300 వరకు పలుకుతుంది. ఈ సమయంలో టమాటా దిగుబడి ఆశించిన విధంగా ఉంటే లాభాలు వచ్చేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.