![American Telugu NRIs Helping Andhra Pradesh Farmers - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/19/NRI1.jpg.webp?itok=QdKguCyD)
కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. చేతికొచ్చిన పంట కొనేవారు లేక పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు సతమవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చేతికొచ్చిన టమాట పంటను కొనేవారు లేరంటూ ఆవేదనగా పోస్ట్ చేశారు.
అది చూసి చలించిన తెలుగు ఎన్‌ఆర్‌ఐ సోదరులు డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, పుల్లారెడ్డి యెదురు ఆంధ్రప్రదేశ్ లోని కొంతమంది రైతులను ఈ కష్టకాలంలో ఆదుకోవాలని తమ మిత్రులతో టమాట ఛాలెంజ్ పేరుతో ఆ రైతు వద్ద నుంచి పంటను కొనుగోలు చేశారు. అదే విధంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు మంగళవారం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం బురుజుపల్లెలో 400 కుటుంబాలకు నిత్యవసర సరుకులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment