కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రైతులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. చేతికొచ్చిన పంట కొనేవారు లేక పండించిన పంటను ఏం చేయాలో తెలియక రైతులు సతమవుతున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో చేతికొచ్చిన టమాట పంటను కొనేవారు లేరంటూ ఆవేదనగా కొందరు పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
అది చూసి చలించిన తెలుగు ఎన్‌ఆర్‌ఐ సోదరులు డాక్టర్ వాసుదేవ రెడ్డి నలిపిరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి కల్లూరి, సుబ్బారెడ్డి చింతగుంట, రమేష్ రెడ్డి వల్లూరు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని కొంతమంది రైతులని ఆదుకోవాలని తమ మిత్రులతో టమోటో ఛాలెంజ్ పేరుతో నేరుగా రైతుల వద్ద పంటను కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నారు. సేవా కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, అనంతసాగరం మండలంలో 3500 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అదే విధంగా వివిధ పల్లెలోని రైతుల దగ్గర కూరగాయలు కొనుగోలు చేసి వాటిని పేద ప్రజలకు ఉచితంగా అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment