సాక్షి, వికారాబాద్ అర్బన్: గత రెండు నెలలుగా టమాటా ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని రకాల కూరగాయల ధరలు కాస్త తగ్గినా టమాటా ఏమాత్రం దిగిరావడం లేదు. ఆదివారం వికారాబాద్ మార్కెట్‌లో కిలో టమాటా రూ.100 చొప్పున విక్రయించారు. నాసిరకం టమాటా రూ.80 వరకు పలికింది. జూన్ మొదటి వారంలోనైనా ధరలు తగ్గుతాయని భావించిన వినియోగదారుల ఆశలు నెరవేరలేదు.
శుభకార్యాలు ఎక్కువగా ఉండటంతోనే డిమాండ్ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. మార్కెట్లలోకి ఆశించిన స్థాయిలో సరుకు రావడం లేదని పేర్కొంటున్నారు. కర్నూల్, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. సకాలంలో వర్షాలు పడితే ఆగస్టులో ధర తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏమైనా టమాటా కొనుగోలు చేసేందుకు పేదలు, మధ్య తరగతి ప్రజలు సాహసం చేయలేదు.
చదవండి: మహా జాదుగాళ్లు.. విదేశీ కరెన్సీ కావాలంటూ..
Comments
Please login to add a commentAdd a comment