
రూపాయికే కిలో టమోటా అంటే ఎలా?
అనంతపురం: దేశమంతటా ఉల్లి ఘాటు ఎక్కువైన సంగతి తెలిసిందే. ఉల్లి కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అలాంటి తరుణంలో టమోట రైతులకు చేదు అనుభవమే మిగిలింది. ఉన్నట్టుండి టమోటా గిట్టుబాటు ధర తగ్గడంతో దిక్కు తోచని స్థితిలో రైతులు ఉన్నారు. ఓవైపు వ్యాపారస్తులు మాత్రం కిలో రూపాయికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రూపాయికే కిలో టమోటా ఇస్తే రైతు నట్టేట మునగాల్సిందే..
ఈ పరిస్థితి తాజాగా శనివారం అనంతపురం నగరంలోని కాయగూరల మార్కెట్లో చోటుచేసుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రైతులు పండించిన టమోటాను తీసుకుని వచ్చారు. అయితే రేటు బాగా తగ్గిందని వ్యాపారస్తులు రూపాయికే కిలో ఇవ్వాలన్నారు. దీంతో ఆగ్రహించిన రైతులు రూపాయికే కిలో టమోటా ఎలా ఇస్తామంటూ వాగ్వాదానికి దిగారు. ఇంత జరుగుతున్నా మార్కెట్ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ఊరుకోవడం గమనార్హం.