కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్‌లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్‌లో పార్ట్‌నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
మనీష్ మల్హోత్రా..
డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్‌లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్‌ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్‌లైన్‌లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/-
ఆమ్రపాలి జ్యూలరీ
రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్‌లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్‌ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్‌లైన్ మార్కెట్టూ విస్తృతమే.
(చదవండి: స్టన్నింగ్ లుక్‌తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..)
Comments
Please login to add a commentAdd a comment