ఇప్పటివరకు ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారుని చూసుంటారు, బైకుని చూసుంటారు.. అంతెందుకు ఖరీదైన దుస్తులను కూడా చూసుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ గురించి తెలుసుకోబోతున్నారు.
ఐస్‌క్రీమ్ ఏంటి.. ఖరీదైనదేంటి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా, దీని ధర వెయ్యో, పదివేలో అనుకుంటే పొరపాటే. అక్షరాలా రూ. 5 లక్షల కంటే ఎక్కువ. జపాన్‌కు చెందిన ఐస్‌క్రీమ్ తయారీదారులలో ఒకటైన 'సిలాటో' దీనిని తయారు చేసింది. ఇది బైకుయా అనే ప్రోటీన్ కలిగిన ఐస్‌క్రీమ్ కావడం విశేషం. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 'ఐస్‌క్రీమ్'గా రికార్డుకెక్కింది.
ఇంత ఖరీదైన ఐస్‌క్రీమ్ కూడా పాలతోనే తయారవుతుంది. కానీ ఇది వెల్వెట్ మాదిరిగా ఉంటుంది. ఇందులో చీజ్, గుడ్డులోని పచ్చ సోన వంటివి కలుపుతారని సమాచారం. వీటితో పాటు ఇందులో పర్మిజియానో చీజ్, వైట్ ట్రఫుల్, ట్రఫుల్ ఆయిల్, గోల్డ్ లీఫ్ ఉంటాయి. ఈ మొత్తం ఐస్‌క్రీమ్ ఒక స్టైలిష్ బ్లాక్ బాక్స్‌లో ప్యాక్ చేస్తారు. ఇది చూడటానికి సాధారణ ఐస్ క్రీమ్ మాదిరిగానే కనిపిస్తుంది. అయితే దీనిని తినటానికి ఉపయోగించే స్పూన్ చేతితో తయారు చేసిన మెటల్ కావడం విశేషం. దీనిని క్యోటోకి చెందిన హస్తకళాకారులు ప్రత్యేకంగా తయారు చేశారు.
(ఇదీ చదవండి: వాట్సాప్‌లో ఇలాంటి ఫీచర్ ఒకటుందని తెలుసా? తెలిస్తే ఎగిరి గంతేస్తారు!)
కేవలం 130ml ఐస్‌క్రీమ్ ధర కంపెనీ వెబ్‌సైట్‌లో అక్షరాలా 8,80,000 యెన్స్ అంటే అమెరికా కరెన్సీ ప్రకారం దాదాపు 6వేల డాలర్ల కంటే ఎక్కువ, భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 5 లక్షలకంటే ఎక్కువ. ఈ ఐస్‌క్రీమ్ తినటానికి నిర్దిష్ట గడువు అంటూ ఏమి ఉండదు, కావున దీనిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయవచ్చు. ధర ఎక్కువ కావడంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది.
Comments
Please login to add a commentAdd a comment