
పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు స్వాధీనం
బాసర: ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న క్లబ్పై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు, 100 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
ఏఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మహారాష్ట్రలోని నాయిగాం గ్రామంలోని క్లబ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన 100 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.