huge cash
-
జార్ఖండ్‌లో ఈడీ సోదాలు.. భారీగా పట్టుబడ్డ నోట్ల కట్టలు
రాంచీ: జార్ఖండ్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు. -
ఎన్నికల వేళ భారీగా పట్టుబడుతున్న నగదు
-
ముగిసిన ఐటీ సోదాలు.. మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో భారీగా నగదు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: మంత్రి సబిత అనుచరుడి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. మూడ్రోజులుగా ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రదీప్‌రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు భారీగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎన్నికల కోసం సమకూర్చుకున్న డబ్బుగా ఐటీ శాఖ తేల్చింది. ప్రదీప్‌రెడ్డితో పాటు కోట్ల నరేందర్‌రెడ్డి ఇంట్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఆయన ఇంట్లో రూ. 7 కోట్ల 50 లక్షలు ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఐటీ అధికారుల వరుస సోదాలు సోమవారం మూడ్రోజులు పాటు కొనసాగాయి. ఫార్మా రంగానికి చెందిన పలువురి ఇళ్లు, కార్యాలయాల్లో ఉదయం నుంచి ఐటీ అధికారుల బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. అమీన్‌పూర్‌లోని పటేల్‌గూడ, ఆర్సీపురం, వట్టినాగులపల్లి,గచ్చి బౌలిలోని మైహోం భుజాలో సోదాలు నిర్వహించాయి. మై హోమ్ భుజాలో నివాసం ఉంటున్న ప్రదీప్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అమీన్పూర్ మండల పరిధిలోని పటేల్ గూడాలో అంతర్జాతీయ రసాయన పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి రానీయకుండా సీఆర్పీ ఎఫ్ జవాన్లు బందోబస్తు నిర్వహించారు. ఆయా కంపెనీలకు చెందిన ఆర్ధిక లావాదేవీల వివరాలకు సంబంధించిన పత్రాలను ఐటీ అధికారులు పరిశీలించారు. కాగా, ఎన్నికల నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పలు ఫార్మా కంపెనీల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తున్నట్టు అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు మెరుపుదాడులు చేపట్టినట్టు ప్రచారం జరుగుతోంది. చదవండి: కోట్లున్నా..కారుండదు..ఎందుకు? -
మునుగోడు ఎన్నికలు టార్గెట్ గా నేతలకు వల
-
తెలంగాణలో ఎమ్మెల్యేల ఆపరేషన్ ఆకర్ష్ భగ్నం!
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల వేళ.. అధికార పక్ష నేతలకు గాలం వేసే వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. తెలంగాణ పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్‌లో.. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు యత్నించిన మధ్యవర్తీలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. వారి నుంచి భారీగా నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డీల్ విలువ సుమారు రూ.100 కోట్లు నగదు ఉంటుందని అంచనా. నోట్ల కట్టలతో పోలీసులకు చిక్కిన వారిలో రామంచంద్ర భారతి, సోమయాజుల స్వామి, నందకుమార్, తిరుపతిలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారంతా ఢిల్లీకి చెందిన వారని పేర్కొన్నారు. బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ హోటల్ చెందిన నందకుమార్ ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. నందు కిషన్ రెడ్డికి సన్నిహితుడు అని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు.. బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు ప్లాన్ చేసిందంటూ టీఆర్ఎస్ ఆరోపణలు చేస్తోంది. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ఢిల్లీ నుంచి స్కెచ్ వేశారని ఆరోపించింది. ఫిరాయింపుల కోసం భారీగా నగదు ఆఫర్ చేశారని పేర్కొంది. ఆపరేషన్‌లో లక్క్ష్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, హర్షవర్థన్‌రెడ్డి, రేగ కాంతారావు, పైలట్ రోహిత్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఎర వేసినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలతో డీల్ చేసిన నందు, తిరుపతి, రామ చంద్ర భారతి, సింహా యాజులు. వంద కోట్ల రూపాయల డీల్ కాగా.. స్పాట్లో 15 కోట్ల రూపాయలు పట్టుబడినట్లు సమాచారం. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే దాడి తెలంగాణలో ఎమ్మెల్యేల ప్రలోభ పర్వం ఒక్కసారిగా కలకలం సృష్టించింది. ప్రలోభ పర్వం గురించి సమాచారం అందుకోగానే రంగంలోకి దిగినట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియా సమావేశంలో వెల్లడించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే మొయినాబాద్‌లోని బేరసారాలు నడుస్తున్న ఫామ్ హౌజ్‌పై రైడ్ చేశామని, ముగ్గురు దొరికారని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. రామచంద్రభారతి ద్వారా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం అందింది. సింహయాజులు తిరుపతి నుంచి వచ్చాడు. నందకుమార్, సింహయాజులు.. ఫరిదాబాద్ నుంచి రామచంద్రభారతిని ఇక్కడికి తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే.. పదవులు, డబ్బు, కాంట్రాక్టులు ఇస్తామని ప్రలోభ పెట్టారు. నందకుమార్ మధ్యవవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం ఉంది అని సీపీ వెల్లడించారు. -
మునుగోడులో భారీగా పట్టుబడ్డ డబ్బు
-
చిట్టీ నిర్వాహకుల అరెస్ట్
వరంగల్: వరంగల్ జిల్లాలో చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిర్వాహకులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. నెక్కొండలో పావని ఎంటర్ ప్రైజెస్ చిట్టీల పేరుతో భారీగా మోసాలకు పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు శుక్రవారం నిర్వాహకులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.12.65 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు స్వాధీనం
బాసర: ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న క్లబ్‌పై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు, 100 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మహారాష్ట్రలోని నాయిగాం గ్రామంలోని క్లబ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన 100 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.