రాంచీ: జార్ఖండ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన దాడుల్లో భారీ మొత్తంలో నోట్ల కట్టలు పట్టుబడ్డాయి. సోమవారం రాంచీలోని పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టగా.. మంత్రి అలంగీర్ సన్నిహితుడి ఇంట్లో సుమారు రూ. 25 కోట్ల భారీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. వాటిని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్ మంత్రి అలంగీర్ సన్నిహితుల ఇంట్లో ఈడీ సోదాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. జార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి అలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజయ్ లాల్ ఇంట్లోని గది నిండా ఉన్న భారీ నోట్ల కట్టలను ఈడీ స్వాధీనం చేసుకుంది. 70 ఏళ్ల అలంగీర్ ఆలం పాకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహిస్తున్నారు.
‘‘జార్ఖండ్‌లో అవినీతి అంతం కావటం లేదు. ఈ డబ్బును ఎన్నికల్లో పంచాలని ప్రణాళిక వేశారు. దీనిపై ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలి’’ అని జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రతూల్ సహదేవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment